ఆరోగ్యమే మహా భాగ్యం అంటారుకదా..! అటువంటి ఆరోగ్యానికి ఆహారానికి 
ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.ఆహారం తీసుకోవటంలో కొద్ది పాటి మెళకువలు 
పాటిస్తే ఆరోగ్యాన్ని మహా భాగ్యం గా కాపాడుకోవచ్చు. ప్రతి ప్రాణి ఆహారం 
తీసుకోక తప్పదు. అలాంటిది మనిషి మూడు పూటలా భోజనం చేయాల్సిందే. ఇందులో ఉదయం
 అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ లేదా సప్పర్ ఏదైనా కావచ్చు. 
మనిష తీసుకునే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా శరీరంలోని మెదడు తదితర 
భాగాలకు పోషణనందిస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ మనసు, 
ఆరోగ్యం ఆధారపడి వుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాదు ఆహారాన్ని 
ఎప్పుడు తినాలి ఎలా తినాలి అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. వాటితో పాటు, 
ఆహారాన్ని తీసుకొన్న తర్వాత కొన్న పనులకు దూరంగా ఉండాలి. అటువంటప్పుడే 
ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారు. మరి ఆహారం తీసుకొన్న తర్వాత ఎటువంటి పనులు
 చేయకూడదో ఒకసారి చూద్దాం... 
మన శరీరానికి నిజమైన సుఖాన్నిచ్చేది ఆరోగ్యమే. ఈ శరీరానికి ఏ జబ్బులు 
రాకుండా జాగ్రత్త పడటం, ఉన్న ఆరోగ్యాన్ని పెంచుకోవటం, ఒకవేళ చెడిపోతే బాగు 
చేసుకోవటం అవసరం. యంత్ర రూపమైన మన శరీరంపై చుట్టూరా ఉన్న వాతావరణ ప్రభావం 
ఎల్లప్పు డూ ఉంటుంది. ఈ వాతావరణం ప్రతిరోజు కొద్దిగా, ప్రతికార్తెలో 
ఎక్కువగా, ప్రతి ఋతువులో మరీ ఎక్కు వగా మారుతుందని మనకు తెలుసు. ఈ ప్రభావం 
మన శరీరానికి హాని కలిగించకుండా ఆరోగ్యంగా జీవించగల్గుటకు తీసుకోవలసిన 
జాగ్రత్తలు, పాటించ వలసిన నియమాలే స్వస్థవృత్తం.
పొగ తాగకూడదు: ధూమపానము చేయరాదు. భోజనము చేసినతరువాత ఒక సిగరెట్ 
కాల్చితే అది పది సిగరెట్ లకు సమానము అని చెబుతున్నారు వైద్యనిపుణులు. 
కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.
భోజనం తిన్న వెంటనే పండ్లుకు బ్రేక్: పళ్ళు తినకూడదు. భోజనము చేసిన 
తరువాత పండ్లు తినడం వలన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుకే పళ్ళు 
తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.
టీ - కాఫీలకు బ్రేక్: భోజనానంతరం టీ మరియు కాఫీలకు తాగకూడదు. టీవలన 
పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది. 
కాఫీలోని కెఫిన్ వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది.
బెల్ట్ లూజ్ చేయకూడదు: సాధారణంగా మగవారు ప్యాంట్ కు ఖచ్చితంగా బెల్ట్ 
వేస్తుంటారు. ఫ్యాషన్ అంటూ అమ్మాయిలు కూడా వారి వారి సౌకర్యాన్ని బట్టి 
బెల్టులు వేసుకొంటుటారు. భోజనం తర్వాత బెల్టు లూస్ చేయకూడదు. దీనివల 
పొట్టలోపల ఎక్కడన్నా ఇరుక్కున్న ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.
స్నానం: భోజనానంతరం స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే
 రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం 
తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల జీర్ణ వ్యవస్థ 
సామర్ధ్యం తగ్గిపోతుంది.
నడక: చాలా మంది భోజనం తర్వాత కొంత దూరమైన నడవాలంటారు. భోజనం తర్వాత 
వంద అడుగులు నడవటం వల్ల తొంభైతొమ్మిదేళ్ళు జీవిస్తారంటారు. ఇది నిజం కాదు. 
భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణవ్యవస్థ తగిన ఆహార పోషణ గ్రహించలేకపోయే 
అవకాశం ఉంది. కాబట్టి భోజనానంతరం నడక అవసరం లేదు.
భోజనం తర్వాత నిద్ర: భోజనానంతరం నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే 
పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక గాస్ట్రిక్ మరియు ఇన్ఫెక్షన్ వంటివి 
వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే
 నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు 
కంటే ఎక్కువగా పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు 
డాక్టర్లు. తప్పకుండా ఇవన్ని పాటిస్తారు కదూ!

