Wednesday, October 31, 2012

వైట్ పెట్రోలియం జెల్లీతో పాదాల పగుళ్ళకు చెక్.....!?
స్త్రీపురుషులు అనే తేడా లేకుండా వర్షాకాలంలో పాదాలకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా.. తడిలో ఉండే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పగుళ్ళ కారణంగా పాదాల నొప్పులు కూడా పుడుతుంటాయి.


ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే.. పాదాల పగుళ్ళ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రధానంగా.. తడి నుంచి నాణ్యమైన సాక్స్‌, షూ వేసుకోవడం వల్ల పాదాల పగుళ్ల నుండి కాపాడుకోవచ్చు.


పగుళ్లు వచ్చిన వారు పాదాలను రాత్రి పడుకునేముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు, పసుపు చిటికెడు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకుని వైట్‌ పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పాదాల పగుళ్లు పోవడమే కాకుండా మృదువుగా కూడా తయారవుతాయని వైద్యులు చెపుతున్నారు. 
Tuesday, October 30, 2012

వేడినీటి స్నానంతో విసుగు, చికాకులను వాష్ చేసేయండి...!?రోజంతా పని...పని విపరీతమయిన అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువసేపు స్నానం చేస్తే ఆ పని తాలుకూ ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును వాష్ చేసేయవచ్చు. శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు, వేడెక్కిన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా మారేందుకు దీనికి మించిన మందు బహుశా లేనేలేదు.


చర్మానికి కూడా మంచిది. నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటిలో కలుపుకుంటే మనస్సంతా తేలిక పడుతుంది. మంచి మూడ్‌లోకి వచ్చేస్తారు. సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోండి. తడి టవల్‌ను తలకు చుట్టుకుని కొద్దిసెపు రిలాక్సవ్వండి. మంద్రమైన సంగీతాన్ని ఆస్వాదించండి. ఇలా చేయడం వలన కొద్ది నిమిషాల తరువాత అద్భుతమయిన ఆనందం స్వంతం అవుతుంది. కాంతులతో తాజాగా బయటకు వచ్చేస్తారు.బంగారు నీటితో ఏనుగులాంటి బలం మీ సొంతం చేసుకోండి..!!
* ప్రతిరోజు నల్లనువ్వులను తిని, చల్లని నీరు త్రాగినట్లైతే శరీరానికి కావాల్సిన బలం అందుతుంది.

* బంగారాన్ని నీటిలో వేసి కాచి, ఆ నీటిని తాగినట్లైతే ఏనుగులాంటి బలం కలుగుతుంది.

* తాజా వెన్నను ప్రతిరోజూ ఉదయం తినాలి.

* నీటిలో ఖర్జూరపండ్లు నానబెట్టి బాగా కలిపి, ఆ నీటిని తాగాలి.

* మర్రిపండులోని గింజలు తినాలి.

* బాగా మగ్గిన అమృతపాణి అరటిపండ్లు తింటే శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. దాంతో పాటు ఏ వ్యాధులు     రాకుండా ఉంటుంది.

* పాలలో అతిమధురం పొడికలిపి తాగాలి.

* ద్రాక్ష లేక కిస్‌మిస్ రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం బాగా కలిపి ఆ నీరు తాగాలి.


Sunday, October 28, 2012

వీర్య గ్రంథికి హోలెప్ విధానం ద్వారా చికిత్స!!తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లోని ఆర్.జి స్టోన్ యూరాలజీ అండ్ లాప్రోస్కోపీ హాస్పిటల్ అధునాతన శస్త్రచికిత్స విధానం ద్వారా వీర్యగ్రంథికి ఆపరేషన్లను విజయవంతంగా చేస్తోంది. వంద గ్రాముల కంటే ఎక్కువ బరువున్న వీర్యగ్రంథులను హోలెప్ శస్త్రచికిత్స విధానం ద్వారా చికిత్స చేస్తారు.

ఇదే అంశంపై ఆ ఆస్పత్రి హెడ్, చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ ఆర్.విజయ్ కుమార్ గురువారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ వీర్య గ్రంథి అనేది పురుషుల్లో మూత్ర సంచికి దిగువ భాగంలో మూత్రనాళానికి సమీపంలో వస్తుందన్నారు. ఇది సాధారణ పురుషుల్లో 20 గ్రాముల బరువును కలిగివుంటుందన్నారు.

వయస్సు పెరిగే కొద్ది పురుషులందరిలో ఈ వీర్య గ్రంథి సైజు పెరుగుతుందన్నారు. దీన్ని బెనిగన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లాసియా (బీపీహెచ్) అంటారన్నారు. ఈ వీర్యగ్రంథి సైజు పెరిగే కొద్దీ మూత్ర విసర్జన సమయంలో తీవ్రనొప్పి కలుగుతుందన్నారు. అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రరూపం దాల్చి ప్రమాదకర పరిస్థితికి జారుకుంటుందన్నారు.

ఈ తరహా వ్యాధితో చెన్నయ్ నగరంలో అనేక మంది బాధపడుతున్నారన్నారు. వీరిలో అవగాహన కల్పించడంతో పాటు... సులభతరమైన లేజర్ చికిత్సా విధానం ద్వారా ట్రీట్‌మెంట్ చేయవచ్చన్నారు. ఈ విధానం ద్వారా వైద్య ఖర్చులు విదేశాల్లో లక్షల్లో వసూలు చేస్తారన్నారు. కానీ, తాము 60 వేల నుంచి రూ.90 వేలుగా వసూలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ప్రధానంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించి, ఈ చికిత్సా విధానం ద్వార వీర్యగ్రంథి సమస్య నుంచి విముక్తి కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో యూరాలజీ కన్సల్టెంట్ ఎం.జీవగన్, జీఎస్. వేణుగోపాల్, జైగణేష్ తదితరులు పాల్గొన్నారు. 


Thursday, October 18, 2012

విస్కీ సేవించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
మందు ఎప్పుడో ఒకసారి తాగితే సంతోషం... అప్పుడప్పుడూ తాగితే వ్యసనం.... రోజూ తాగితే రోగం... అన్న విషయాన్ని గుర్తుంచుకొంటే... ఆల్కహాల్ అన్ని సందర్భాల్లోనూ అనారోగ్యం కాదు. ఆల్కహాల్ ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కొన్ని రకాలైరటువంటి ఆల్కహాల్ అంటే వైన్ మరియు బ్రాండీ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వింటుంటాం.. బహుషా అందుకేనేమో గర్భవతిగా ఉన్నప్పుడు గర్భిణీకి గ్రేప్ వైన్, ఆపిల్ వైన్ అని వారికి ఇస్తుంటారు. ఆల్కహాల్ కు సంబంధించిన విస్కీలో కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఆశ్చర్య కలగక మానదు. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం...

మంచి నిద్ర: కొన్ని రోజులుగా అంటే పది పదిహేను రోజులుగా ఎక్కువగా కష్టపడి, లేదా జర్నీ చేయడం వల్ల శరీరం ఎక్కువగా అలసినప్పుడు విస్కీలో ఐస్ చేర్చి ఒకటి లేదా రెండు పెగ్గులు తాగడం వల్ల నిద్ర బాగా పట్టి శరీరానికి విశ్రాంతినిస్తుంది. తాగడం కూడా హర్రీగా తీసుకోకుండా తక్కువ మోతాదులో కొద్దిగా కొద్దిగా తీసుకోవడం వల్ల బాగా పనిచేస్తుంది. తాగిన కొద్ది సేపటికే నిద్రలోకి జారుకొని, గాఢ నిద్రను పొందుతారు.

క్యాన్సర్: చాలా మంది ఆల్కహాల్ క్యాన్సర్ కు దారితీస్తుందని చెబుతుంటారు? అయితే అది నిజం కాదనే చెప్పాలి. ఎందుకంటే విస్కీలో ఉన్న ఎలాజిక్ యాసిడ్స్ క్యాన్సర్ ఉత్ప్రేరకాలను తగ్గిస్తుంది. విస్కీని తరచూ తీసుకోకుండా ఏదో ఒక సందర్భంలో తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే యాంటిఆక్సిడెంట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఏప్పుడో ఒక సారి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు.

మధుమేహానికి: విస్కీ లో మంచి కొలెస్ట్రాల్ కలిగి ఉండటం వల్ల, ఇది శరీరంలోని రక్తనాలల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. విస్కీలో మంచి కొలెస్ట్రాల్ ఉండటం వల్ల మధుమేహ వ్యాధి బారీన పడకుండా చేస్తుంది. మధుమేహగ్రస్తులు కూడా అతి తక్కువ మోతాదులో వారానికి ఒక సారి విస్కీని తీసుకోవడం వల్ల రక్త నాళాలు ఫ్రీ అవుతాయి.

ఒత్తిడిని దూరం చేసే విస్కీ: ఒత్తిడిని దూరం చేసే గుణం కూడా విస్కీలో ఉంది. ఎక్కువ రోజులగా ఏదైనా కారణం చేత ఎక్కువగా ఒత్తిడికి గురౌతున్నట్లైతే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అది ఫిజికల్ గా మెంటల్ గా అనారోగ్యం చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ తో ఉన్నప్పుడు విస్కీని కొద్దిగా తీసుకోవడం వల్ల మానసిక ప్రభావం నుండి బయటపడేలా చేస్తుంది. శరీరం కొంత విశ్రాంతి పొంది మునుపటి కంటే కొంచెం సౌకర్యంగా ఫీలవుతారు.

జలుబు - దగ్గు: బాగా కోల్డ్ చేసి, దాంతో పాటు దగ్గు ఉన్నప్పుడు హాట్ విస్కీని కొద్దిగా తీసుకోవడం వల్ల త్వరగా తగ్గిపోతుంది. మంచి క్వాలిటీ ఉన్న విస్కీ, ప్రత్యేకంగా స్కాచ్, మరియు దీనికి కొద్దిగా హాట్ వాటర్, ఒక చెంచా తేనె, మరియు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
 
ఇతర వ్యాధులు: విస్కీని నెలకోసారి లేదా రెండు సార్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచి, చిన్న చిన్న జబ్బులను రానివ్వకుండా చేస్తుంది.

Wednesday, October 17, 2012

వీర్యంతో మిసమిసలాడే తేజస్సు
రతిక్రీడ పట్ల అనేక అపోహలు ఉన్నాయి. రతిక్రీడలో ముఖరతి ఓ భాగం. స్త్రీ పురుషాంగాన్ని చుంబించి ఆనంద రసాస్వాదన చేయడం శృంగార క్రీడలో అత్యంత ముఖ్యమైంది కూడా. స్త్రీ పురుషాంగాన్ని చుంబించినప్పుడు వీర్యం నోటి ద్వారా కడుపులోకి పోతే ఏమైనా ప్రమాదమా, లేదంటే మంచిదేనా అని ఓ రీడర్ అడిగారు.

నిజానికి, ఈ విషయంలో చాలా మందికి ఇటువంటి అనుమానాలు కలుగుతుంటాయి. వీర్యం కడుపులోకి వెళ్లడం వల్ల ప్రమాదం లేకపోగా, మహిళలు మరింత తేజవంతులవుతారని ఓ అధ్యయనంలో తేలింది. అందువల్ల దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అంగాన్ని మహిళ చుంబించడం వల్ల ఆమెకు ఆనందం కలుగుతుంది. అంతకన్నా ఆమె పురుషుడికి ఎనలేని సంతృప్తి, మధురానుభాతి ప్రసాదిస్తుంది. మహిళల నోటి ద్వారా కడుపులోకి వీర్యం జారితే వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందట. ఓరల్ సెక్స్ సమయంలో పురుషుడి అంగం నుంచి విడుదలయ్యే వీర్యంలో మూడ్ మార్చేసే రసాయనాలు ఉంటాయని ఇటీవలి ఓ అధ్యయనంలో తేలింది.

న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ దానిపై సర్వే నిర్వహించింది. విశ్వవిద్యాలయం 293 మంది మహిళల లైంగిక జీవితాలను మానసిక ఆరోగ్యంతో బేరీజు వేసింది. ఆ తర్వాత దానిపై పరిశోధనలు నిర్వహించింది. పురుషాంగం నుంచి స్రవించే వీర్యంలో ఉండే రసాయనాలు మూడ్‌ను ఆహ్లాదకరంగా మార్చడమే కాకుండా ప్రేమను కూడా పెంచుతుందట. దానికి తోడు ప్రశాంతమైన నిద్రను ప్రసాదిస్తుందని తేలేంది. పైగా వీర్యంలో ఒత్తిళ్లను తగ్గించే మూడు రకాల హార్మోన్లు ఉన్నట్లు అధ్యయంలో తేలింది.

ఓరల్ సెక్స్ చేసే స్త్రీల్లో ఒత్తిడి లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వీర్యంలో స్పెర్మటోజోవాతో పాటు కోర్టిసోల్ ఉంటుంది. ఇది ప్రేమను, ఈస్ట్రోన్‌ను ద్విగుణీకృతం చేస్తుందట. అందులోని ఆక్సిటోసిన్ మూడ్‍ను ఆహ్లాదకరంగా ఉంచుతుందని చెబుతున్నారు.

వీర్యంలో థైరోట్రోపిన్ (ఒత్తిడిని తగ్గించే హార్మోన్), మెలాటోనిన్ (నిద్రకు ఉపకరించే ఏజెంట్), సెరోటోనిన్ (యాంటీ డిప్రెసెంట్ న్యూట్రోట్రాన్స్‌మిటర్) ఉంటాయి. ఇవి మెదడు ప్రతిక్రియలను మార్చే హార్మోన్లు. పరిశోధకులు గాలప్, బుర్చ్, సైకాలిజిస్టు స్టీవెన్ ప్లాటెక్ ముఖరతి చేసే స్త్రీలలో ఎక్కువ ఆనందం, తక్కువ ఒత్తిడి ఉన్నట్లు చెప్పారు.

కండోమ్స్ వాడకం వల్ల కన్నా కండోమ్స్ వాడని సెక్స్‌ నే మహిళలు ఎక్కువగా కోరుకుంటున్నట్లు, ఇలాంటి సెక్స్ వల్లనే స్త్రీలు ఎక్కువ మానసికానందం పొందుతున్నట్లు కూడా పరిశోధనల్లో తేలిది. ఏ రోజు కూడా కండోమ్స్ వాడకుండా సెక్స్‌ను అనుభవించిన స్త్రీల్లో తక్కువ ఒత్తిడి లక్షణాలు కనిపించినట్లు తేలింది.

సెక్స్‌లో ఎక్కువగా పాల్గొన్న స్త్రీలు, సెక్స్‌లో తక్కువగా పాల్గొనే స్త్రీల కన్నా ఎక్కువ ఉల్లాసంగా ఉన్నట్లు గుర్తించారు. వీర్యం స్రవించే హార్మోన్లు స్త్రీల నరాల్లో ప్రవహించడం వల్ల అదనపు ఆనందం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది.
Saturday, October 13, 2012

కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఏం చేయాలంటే!?
కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే తొలి రోజున మంచి కార్యాలు చేపట్టాలి. ఇతరులకు దానం చెయ్యడం, భగవదారాధన చేయడం శుభఫలితాలనిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దైవపూజ చెయ్యని దేహం ప్రాణంలేని శరీరానికి సమానం. దైవ సంబంధం లేని వృధా మాటలు నక్కల ఊళలకు సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి.

అందుచేత కొత్త సంవత్సరం పుట్టుకను వేడుకగా జరుపుకోవడంతో పాటు భగవదారాధన చేయడం ద్వారా ఆ సంవత్సరమంతా సత్ఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న జనవరి ఒకటో తేదీన పరిశుభ్రమైన నీరు, కుంకుమపువ్వు, పచ్చ కర్పూరం కలిపి దానితో మీకు ఇష్ట దైవమైన భగవంతునికి అభిషేకం చెయ్యడం ఉత్తమం.

ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, చెరకురసం, కొబ్బరిబొండాంనీరు, చందనం వంటి వాటితోనూ అభిషేకం చేయించవచ్చు. అభిషేకం తర్వాత పూజకు పువ్వులతో అర్చన చేయించాలి. అలాగే ఇళ్లళ్లో అన్నం, పళ్లు, కొబ్బరికాయ నివేదనం చేసి తాంబులం, కర్పూర నీరాజనం చెయ్యాలి.

ఆలయాల్లో అభిషేకం, పూజలు పూర్తయ్యాక ఆలయాన్ని మూడుసార్లు ప్రదక్షిణం చెయ్యడం, ఆ దేవుడితి సంబంధించిన కీర్తనలు, స్తోత్రాలు గానం చేయాలి. అనంతరం మీకు వీలైనంత ఇతరులకు దానం చెయ్యాలి. ఇలా కొత్త సంవత్సరం ప్రారంభం రోజున చేసే వారికి ఆర్థిక వృద్ధి, వ్యాపారాభివృద్ధి, వంశాభివృద్ధి వంటి శుభ ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

నుదుటిపై పుట్టుమచ్చ గల స్త్రీలు భర్తను లెక్కచేయరట!


నుదుటి పై భాగమునందు పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు అహంకారము ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించగలరు. జ్ఞానవంతురాలు, కళలయందు ఆసక్తి ఎక్కువగా ఉండటమేగాక టీవీ మెగా సీరియల్స్‌కు కథ, మంచి బ్యానర్స్‌పై సినీ రచనలు చేయడం, పత్రికా రంగంలో ఉన్నత రచయత్రీ అయ్యే అవకాశం ఉంది.

ప్రముఖ వ్యక్తులతో స్నేహం ఏర్పరుచుకోగలరు. వీరి సంసార జీవితం అంత పటిష్టంగా ఉండదు. కానీ సర్దుకుపోతే మంచి ఫలితాలుంటాయి. అయితే నుదుటిపై పుట్టుమచ్చగల స్త్రీలు భర్తను ఏ మాత్రం లెక్కచేయరు. చివరికి పిల్లల్ని సైతం పట్టించుకోరు. అయినప్పటికీ వీరికి అనుకూలమైన భర్త లభించడం వీరికి ప్లస్ పాయింటే.

ఇంకా నుదుటిపై పుట్టుమచ్చగల స్త్రీలకు కలిగే సంతానం ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వీరి జీవితం మొదట ఆకాశము ఆ తర్వాత నేల అనే విధముగా కష్ట సుఖాల కలయిక కొంత కాలం వీరు చెప్పిందే వేదం, వీరే రాణి అన్నవిధంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Friday, October 12, 2012

రాహువుకు ఏ భగవదారాధన మంచిదో తెలుసా..?!నవగ్రహాల్లో రాహుగ్రహానికి దుర్గాపూజ, సరస్వతీ పూజ, కుమారీ పూజ, దుర్గాస్తోత్ర పారాయణ, దేవి భాగవత పురాణ పారాయణ చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మేధస్సు, శిరోపరిభాగం, గడ్డం అనే శరీర భాగాలకు రాహువు ప్రాతినిధ్యం వహిస్తాడు.

రాహువు పరిహార క్రియల విషయానికొస్తే.. శక్తిగలవారు దున్నపోతును దానం చేయవచ్చును. స్కందపురాణ, సుబ్రహ్మణ్య చరిత్రను మండల దీక్షతో పారాయణ చెయ్యాలి. నవగ్రహాల్లో రాహు గ్రహం వద్ద 18 వత్తుల దీపారాధన-గోధుమ రంగు వస్త్రదానం చేయడం మంచిది.

దుర్గాదేవి, సుబ్రహ్మణ్య ఆలయాల్లో మంగళవారం లేదా శనివారం నాడు పేదలకు అన్నదానం లేదా ప్రసాదాన్ని పంచిపెట్టడం మంచిది. రావిచెట్టుకు ప్రదక్షిణలు, రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కావున దుర్గాక్షేత్ర సందర్శన, సర్వక్షేత్రాలు (మోపిదేవి, తిరుత్తణి మొదలగునవి) సందర్శించడం మంచిది.

శ్రీకాళహస్తి, పెద కాకాని దేవాలయాల్లో 9సార్లు రాహుదోష నివారణ పూజ చేయించాలి. ఆదివారం రోజున మినపగారెలు లేదా మినుములతో చేసిన పదార్థాలను సాధువులకు పంచడం మంచిది. నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో నాగ ప్రతిష్టలు చేయించడం మంచిది. రాహువునకు 18వేల జపం చేయించి, ఐదు కిలోల 250 గ్రాముల మినుములు దానం చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, ఆర్థికవృద్ధి, వ్యాపారాభివృద్ధి. విద్యాభివృద్ధి వంటి శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా గ్రహణం రోజున కాని, అమావాస్య ఆదివారం రోజున కాని, శక్తిని బట్టి బంగారం లేదా వెండి సర్ప ప్రతిమను పడగ ఉండే విధంగా చేయించి దానం చెయ్యాలి. 18 శనివారాలు ఉపవాసం ఉంటూ, చివరి శనివారం రాహువుకు అష్టోత్తర పూజ, దుర్గాదేవికి కుంకుమ పూజ జరిపించాలి. దర్భలతో, ఆవునెయ్యి, తేనె హోమం చేయించడం శుభఫలితాలనిస్తుంది. మినపగారెలు, మినుములతో చేసిన పదార్థాలతో సద్భ్రాహ్మణోత్తమునికి ఆదివారం రోజు సంతృప్తికరంగా భోజనం పెట్టాలి.

ఇకపోతే.. సంఖ్యాశాస్త్ర ప్రకారం 04 సంఖ్య వారు రాహు సంఖ్య అవుతారు. 04 అంటే ఏ నెల, ఏ వారం, ఏ సంవత్సరంలో అయినా 4,13,22 సంఖ్యల వారు పై నివారణోపాయాలను పాటిస్తే సత్ఫలితములు పొందుతారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా పెడితే..!?
శనిగ్రహ దోష నివారణకు తమిళనాడులోని తిరునల్లార్ దేవస్థానాన్ని దర్శించుకుని శనిహోమం జరిపించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తిరునల్లార్ మాత్రమే గాకుండా మందపల్లి, సింగనాపూర్‌, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని శనైశ్వర ఆలయంలో శని త్రయోదశి నాడు అభిషేకం జరిపించడం శుభఫలితాలనిస్తుంది.

ప్రతిరోజూ మధ్యాహ్నం బెల్లం కలిపిన నల్లనువ్వులు కాకులకు ఆహారంగా పెట్టడం ద్వారా శనిగ్రహ ప్రభావంచే కలిగే ఈతిబాధలు, ఆర్థిక పతనం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగావకాశాలు చేజారిపోవడం వంటి దుష్ఫలితాల నుంచి తప్పుకోవచ్చు.

అలాగే శనిగ్రహ దోష నివారణకు హనుమంతుడిని ప్రతి శనివారం దర్శించుకుని నేతితో దీపమెలిగించడం మంచిది. ఇంకా శనివారం రోజున నువ్వుండలు కానీ, లేదా నువ్వులతో చేసిన ఏదైనా పిండివంటలను సాధువులకు దానం చేయండి.

పుష్యమి నక్షత్రం రోజున నల్లనువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి, రెండు కిలోల బియ్యం కూడా వేరే వస్త్రంలో మూటగా చుట్టి బ్రాహ్మణునికి దానం చేయండి. ఇలా చెస్తే శనిగ్రహ దోషాలచే కలిగే దుష్ఫలితాలు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా నీలిరంగు పువ్వులు, నల్లని వస్త్రాలు, నూనె దానం, స్టీల్ పాత్రలు దానం చేయాలి

"ఓం హ్రాం హనుమతే నమ:
ఓం నమో రామచంద్రాయ నమ:"
అనే మంత్రాలను ప్రతినిత్యం పఠించినట్లైతే శనిగ్రహ నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

నాగపూజ, నాగశాంతి ఏ శుభ తిథుల్లో చేయాలంటే..!?

"అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః
భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్
సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్"

నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.

నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు.

అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. ఏలినాటి శని పీడిస్తోందా..? ఐతే ఇలా చేయండి..!
ఏలినాటి శని ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోవాలంటే ప్రతిరోజూ అన్నం తినేముందు కొంత భాగం కాకులకు వేయండి. ఇనుము, పెనం, సారాయి, నూనె దానం చెయ్యండి. రొట్టెముక్కల మీద నువ్వులనూనె వేసి, వీధి కుక్కలకు రాత్రిపూట ఆహారంగా పెడుతుంటే శనిగ్రహ దోషాలకు నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఏ లగ్నంవారికైనా, శనిగ్రహస్థితి బాగాలేకపోతే ప్రతినిత్యం మూడుసార్లు అంటే ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో కాలభైరవ స్తోత్రం పఠించాలి. పూర్తిగా నల్లని రంగు గల గుర్రం కాలికి కట్టిన నాడా తీసికొచ్చి, నువ్వులనూనెతో అభిషేకం చేసి శనిస్తోత్ర పఠనం చేసి, ఇంటి గుమ్మానికి కాని, తలుపుకుకానీ కొట్టడం శనిగ్రహ ప్రభావాన్ని తప్పిస్తుంది.

నల్ల నువ్వులు 8 సంఖ్య కొలత గల ఇనుము లేదా స్టీలు అరిటాకులో పోసి దక్షిణ తాంబూలాలు పెట్టి శనిగ్రహాన్ని విధివిధానంగా పూజించి, మధ్యాహ్నం ఒక గంటా, ఒక గంటా 3 నిమిషాల మధ్య నడివయస్సు బ్రాహ్మణుని ఆహ్వానించి పాద ప్రక్షాళ చేసి నమస్కరించి, పశ్చిమదిక్కుకు తిరిగి దానం చేయండి.

అలాగే నువ్వుండలు పిల్లలకు పంచడం, ఆవాలు కలిపిన గేదె పెరుగన్నం పెట్టడం కూడా శనిగ్రహ దోష నివారణలో ఒకటి. కాగా, శనిగ్రహానికి అధిష్టాన దైవం శ్రీ వేంకటేశ్వరుడు. శనివార నియమం పాటిస్తూ.. ప్రతిదినం ఆ స్వామిపూజ అభిషేకం చేయడం వల్ల శనిగ్రహదోశ నివారణ జరుగును.

ఇకపోతే.. ఇనుము లేదా స్టీల్ బిందెతో శుద్ధ జలాన్ని నింపి, అందులో నల్లనువ్వులు, మినుములు, నల్ల ఉమ్మెత్త వేర్లు, దర్భలు జమ్మి ఆకులు వేసి ఉంచాలి. ధనురాకారపు ముగ్గువేసి దానిపై దర్భలు పరచి ఈ బిందెలుంచాలి.

ఓం ఐం హ్రీం శ్రీ శనైశ్చరాయ నమః
ఓం భ్రాం భ్రీం భ్రౌం సః శనయే నమః

అనే శనిగ్రహస్తోత్ర మంత్రాన్ని పఠించి, ఈ బిందెలోని నీళ్ళతో శిరఃస్నానం చేయాలి. ప్రతి శనివారం ఇలా చేస్తే శనిగ్రహదోష నివారణ జరుగుతుంది. అలాగే శనిబాధా నివారణకు దగ్గర్లో గల ఆంజనేయుని దేవాలయాల్లో ప్రదక్షిణలు హనుమాన్ చాలీసా పఠనం, విఘ్నేశ్వరుని శరణువేడినా శనిబాధ పటాపంచలు కావడం తథ్యం.

ప్రతి శనివారం గరికెతో గణపతిని పూజించడం కూడా మంచిది. ఇంకా ప్రతి శనివారం సాయంసంధ్య వేళలో రాగి ప్రమిదలో ఆవునెయ్యి, ఆముదం, నువ్వుల నూనెల మిశ్రమంతో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి నమస్కరించినా శనిగ్రహ దోషాల నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Thursday, October 11, 2012

మీకు నాలుక చివరి భాగమున పుట్టుమచ్చ ఉందా..?


పురుషులకు నాలుక చివరి భాగమున పుట్టుమచ్చ ఉంటే.. ఆ వ్యక్తి చెప్పే విషయాలు ఫలించి తీరుతాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు. నాలుక చివరి భాగమున పుట్టుమచ్చ కలిగిన వారి నోటి మాట ఊరికే పోదు. ఇంకా ఆ వ్యక్తి అమిత మేధావంతుడుగా రాణిస్తారు.

అలాగే నాలుక పైభాగమున పుట్టుమచ్చ ఉన్న పురుషుడు గొప్ప ఉపన్యాసకుడు అవుతాడు. వారి మాటను పదిమంది మెచ్చుకుంటారు. నాలుక మీద ఎక్కడైనా పుట్టుమచ్చ ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి.

అలాగే మెడమీద పుట్టుమచ్చ గల పురుషులు ఎలాంటి కష్టనష్టాలనైనా అధిగమిస్తారు. శుభ్రతకు ప్రాధాన్యమిచ్చే వీరికి అదృష్టం వెన్నంటి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఆ వేలు పొడవుగా ఉంటే అమ్మాయిలు లక్కలా అతుక్కుపోతారట..!

అమ్మాయిలూ.. అబ్బాయిలు ధనవంతులో కాదో తెలుకోవడానికి మీరేం చేస్తారు..? మహా అయితే అతని పర్స్ లేదా అతని వెనకున్న ఆస్తిపాస్తులు చూస్తారేమో.. కదా..! అలా చేస్తే మీరు పర్సులో లెగ్ వేసినట్లే..!

అబ్బాయిలు ధనవంతులని తెలుసుకోవడానికి ఇవేమి చూడనక్కర్లేదట.. కేవలం అతని చేతి వేళ్లను గమనిస్తే చాలట. ఏంటి నమ్మడం లేదా..? నిజమండీ.. అబ్బాయిల ఉంగరపు వేలు (రింగ్ ఫింగర్), మిగిలిన వేళ్ల కన్నా పొడవుగా ఉంటే గొప్ప ధనవంతులవుతారని చెబుతున్నారు కెనడాకు చెందిన పరిశోధకులు.

ప్రత్యేకించి చూపుడు వేలు (ఇండెక్స్ ఫింగర్) కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉన్నట్లయితే అతను ధనం అధికంగా సంపాదించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని వారు చెబుతున్నారు. అంతే కాదు.. అటువంటి వ్యక్తి "కష్టపడి పనిచేస్తాడు, కష్టపడి ఆడుతాడు" అని కూడా సెలవిస్తున్నారు. ఒక ఆర్థిక పరమైన డీల్ కానివ్వండి లేదా అమ్మాయి హృదయం గెలుచుకోవడం కానివ్వండి దేనికీ.. "నో" అని సమాధానం చెప్పడట.

అంతే కాదండోయ్.. రింగ్ ఫింగర్ పొడవుగా ఉండే అబ్బాయిలతో అమ్మాయిలు లక్కలా అతుక్కుపోతారట. అతనితో జీవితం అత్యంత సురక్షితంగా ఉంటుందని, అతనో "మిస్టర్ రిలయబిల్" (నమ్మదగిన వ్యక్తి) అని కితాబులిచ్చేస్తున్నారు.

ఇందులో పెద్ద ఆంతర్యం ఏమీ లేదండి..! వారు తమ పరిశోధనలో స్త్రీ, పురుషులలోని చేతివేళ్ల పొడవుల మీద టెస్టోస్టెరోన్ స్థాయిల ప్రభావంపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఉంగరపు వేలు పొడవుగా ఉండే పురుషులు దేన్నైనా పోటీగా తీసుకని కష్టపడని పని చేసి సాధిస్తారు. ఇలాంటి వారిలో టెస్టోస్టెరాన్ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుందట.

కెనడాకు చెందిన కాన్కార్డియా విశ్వవిద్యాలయ పరిశోధకులు 415 మంది స్త్రీ, పురుషులపై పరిశోధన జరిపి ఈ విషయాలను ప్రకటించారు. అధిక టెస్టోస్టెకాన్, రిస్క్ తీసుకోవడం ఈ రెండు అంశాలపై వారు అధ్యయనం చేశారు. పురషులలో వినోదం (క్రీడలు), సామాజికం, ఆర్థికం అనే మూడు అంశాలపై వారు తీసుకునే రిస్క్ ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు.సృష్టిలో తొలి పెళ్లికూతురు, తొలి ముత్తైదువ ఎవరు..?


సృష్టిలో తొలిదంపతులు పార్వతీపరమేశ్వరులు.

మన వివాహ శుభ దైవకార్యక్రమాల్లో పెళ్లికూతురి చేత గౌరీ పూజ అంటే.. పార్వతీదేవికి పూజ చేయిస్తారు.

శ్రీమహాలక్ష్మి, సరస్వతీదేవీల పూజ చేయించనిది ఎందుకంటే తొలి వధువూ, తొలి ముత్తైదువ పార్వతీ దేవి అని పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నాయి.
 


రాహుకేతు, సర్పదోషాలున్న జాతకులు ఏం చేయాలంటే!?


రాహు, కుజ, సర్పదోషాలున్నాయని జ్యోతిష్యులు చెప్పారా? అయితే నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి, నాగారాధన చేసేవారికి సర్పదోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

నాగరాజుకు పుట్టలో ఆవుపాలుతో పాటు కోడిగుడ్డు, చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, కర్పూర పువ్వులు, లడ్డూలు మున్నగునవి నివేదన చేయాలి. ఇలా చేస్తే సర్పదోషాలు తొలగిపోయి, శుభఫలితాలుంటాయని పురోహితులు అంటున్నారు.

నాగపూజ ఎలా చేయాలంటే..?
ఆ రోజు ఉదయం ఐదింటికే లేచి, శుచిగా స్నానమాచరించి, ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమను గానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి.

పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి.

పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో "ఓం నాగేంద్రస్వామినే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి.

ఇకపోతే.. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.
కార్తీక పౌర్ణమి: నేతితో దీపమెలిగించండి....!!?

కార్తీక మాసంతో సమానమైన మాసం, విష్ణువుతో సమానమైన దైవం లేదంటారు. సూర్యుడు తులారాశి లోకి రాగానే కార్తీకమాసం ఆరంభమైంది.కార్తీక పౌర్ణమి రోజున ఇంటిల్లపాది దీపాలతో అలంకరించడంతో పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించడం, నేతితో దీపమెలిగించడం, పేదలకు అన్నదానం చేయడం వంటి సుకార్యాలను చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయాలి. ఇతరులకు దీపాలను దానం చేయాలి.

కార్తీక పౌర్ణమి నాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతో పాటు ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి.

అలాగే ఈ రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. కార్తీక పౌర్ణమి నాడు లలితాదేవి సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఇదే రోజున దీపారాధన చేయడం ద్వారా శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతుంటారు.


Wednesday, October 10, 2012

బిడ్డలకు దిష్టి ఎలా తీయాలి.....!?
రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి.

చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పైవిధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి.

ఇదేవిధంగా ఉప్పు, మిరపకాయలు కలిపిన మిశ్రమంతో తీయవచ్చు. ఇంకా కొబ్బరి కాయను లేదా కోడిగుడ్డును కూడా దిష్టి తీయడానికి వాడవచ్చు.
 

స్త్రీల కాలివ్రేళ్లకు మట్టెలు పెట్టడంలో ఆంతర్యమేమిటి?

వివాహమైన స్త్రీని ముత్తైదువంటారు. అంటే ఆమె విధిగా ఐదు ముత్యములు లేక ఐదు ఆభరణాలు ధరించాలి. చెవులకు, ముక్కులకు, మెడలో మంగళసూత్రము, నల్లపూసలు, చేతులకు గాజులు, కాళ్లకు కడియాలు, కాలివేళ్లకు మట్టెలు ధరించాలి.

ఇందులో స్త్రీలు కాలి వ్రేళ్లకు మట్టెలు పెట్టడంలో ఆంతర్యమేమిటంటే..? కాళ్ల బొటన వ్రేలి పక్కనున్న వ్రేలు స్త్రీలకు ఆయువుపట్టు వంటిది. దానినుంచి విద్యుత్తు ప్రసరిస్తుంటుంది. ఆ వేలు నేలకు తగిలితే అది నష్టమవుతుంది. అలా ఆ వేలు నేలకు తగలకుండా ఉండేందుకు మట్టెలు ధరిస్తారని పురోహితులు చెబుతున్నారు.

దక్షాపతి కుమార్తె దాక్షాయణి తన భర్త శివుడిని, తన తండ్రి దక్షప్రజాపతి అవమానించాడని తన కాలి వ్రేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి, అందులో తాను దహనమైనట్లు పురాణాలు చెబుతున్నాయి.
బుధ గ్రహ దోష నివారణకు విష్ణుపూజ చేయండి..!బుధ గ్రహ దోష నివారణకు మహా విష్ణు పూజ చేయాలి. బుధ మంత్రంతో జపం చేసి మంచి పచ్చ (మరకతం)ను బుధవారం రోజు ధరిస్తే దోషాలు హరింపబడుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

బుధ గ్రహ దోష నివారణకు పచ్చని మైదానంలో, ఆకు పచ్చి వాతావరణంలో కొంతకాలం గడపటం మంచిది. విద్యాలయ పరిసరాల్లో ఉండటం, పండిత ప్రసంగ శ్రవణం, మేధావుల స్నేహం ఉపయుక్తమైన ప్రక్రియలు చేయడం ద్వారా బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

బుధ గ్రహ ప్రభావంతో నరాలు, చర్మం, స్వరపేటిక సంబంధిత వ్యాధులు, నాసిక సంబంధ వ్యాధులు, పక్షవాతం, పిచ్చితనం, నోటి వ్యాధులు సామాన్యంగా బుధుడు కల్పించే వ్యాధులు. అంతేగాకుండా వ్యాపారంలో చిక్కులు, మోసపోవడం, మతిపరుపు, ఆదాయ వ్యయాలు గణిత సంబంధమైన పొరపాట్లు బుధ గ్రహ దోషం వలన కలిగే ఇబ్బందులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

కాబట్టి బుధ గ్రహ దోష నివారణకు బుధవారం రోజు పచ్చ పెసలు బ్రాహ్మణునికి దానం చేయాలి. బుధవారాల్లో పచ్చ పెసలు నానపెట్టి ఆవుకు పెడితే దోష నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో 40 రోజులు ఆరాధన చేస్తే అప్పులు వసూలు!
సాధారణంగా దైవారాధన సమయంలో దీపారాధనకు వివిధ రకాల నూనెలను వినియోగిస్తుంటారు. కొందరు మంచి నూనెను ఉపయోగిస్తే.. మరికొందరు కొబ్బరి నూనెను వాడుతారు. మరికొందరు నెయ్యితో కూడా దీపారాధన చేస్తుంటారు. అయితే, మంచి నూనె, నెయ్యితో చేసే దీపారాధన కంటే కొబ్బరి నూనెతో దీపారాధన వల్ల మంచి శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.

కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని చెపుతున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మికి 40 రోజుల పాటు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మొండి బకాయిలు కూడా వసూలవుతాయట. కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ, కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజచేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముత్తైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుందని చెపుతున్నారు.

పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారివారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయని చెపుతున్నారు. ప్రతి శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావట.

కాశీలోని విశ్వేశ్వరస్వామికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి... వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయట. హరిద్వార్‌లో సాయం సంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరినూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుందట. 


Tuesday, October 9, 2012

ఏడు ప్రమిదలతో కన్యలు దీపమెలిగిస్తే..?!ఎర్రటి ఏడు ప్రమిదలతో దీపమెలిగించే కన్యలకు వివాహాది దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఏ ఆలయంలోనైనా ఏడు ప్రమిదల్లో శుక్రవారం లేదా మంగళవారం పూట నేతితో దీపమెలిగించే కన్యలకు మనస్సుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుంది. ఇంకా మహిళలు సైతం ఇలా తొమ్మిదివారాలు దీపమెలిగిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.

ఇంకా ఒక ప్రమిదతో దీపమెలిగిస్తే.. విద్యావకాశాలు, ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు.

రెండు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.

మూడు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. దీర్ఘ ఆయుర్దాయం చేరూకుతుంది.

నాలుగు ప్రమిదలతో దీపమెలిగించే వారికి.. గృహం, వాహనాల కొనుగోలు వంటి శుభఫలితాలుంటాయి.

ఐదు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ఆరు ప్రమిదలైతే.. మంచి స్నేహితులు,

ఏడు ప్రమిదలైతే.. వివాహదోషాలు తొలగిపోతాయి.

ఎనిమిది ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే.. శత్రుభయం వంటి తొలగిపోతుంది.

తొమ్మిది ప్రమిదలైతే.. నవగ్రహదోషాలు హరింపబడుతాయి.

పది ప్రమిదలైతే.. శత్రుభయం ఉండదు.

108 ప్రమిదలతో దీపమెలిగిస్తే... అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

508 ప్రమిదలతో దీపమెలిగించే వారికి వివాహ దోషాలు తొలగిపోయి, మంచి భవిష్యత్తు చేకూరుతుంది.

1008 ప్రమిదలైతే.. సంతాన భాగ్యం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.


శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు..?శ్రీమహాలక్ష్మి, ఆమె అక్క జ్యేష్ఠాదేవికీ ఎవరెక్కడ ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవడంతో ఆమెను బైటకు రమ్మని జ్యేష్ఠాదేవి కోరింది.

ఆ సమస్య కొలిక్కి వచ్చిన సమయంలో లక్ష్మీదేవి తానెక్కడుంటుందో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ శుభలేఖలకీ, కొత్త వ్యాపార లెక్కల పుస్తకాలకు పసుపు రాసి శ్రీమహాలక్ష్మీకి ఆహ్వానం పలుకుతారు.

ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల ఆమె కృప అన్ని వేళలా వారిపై ఉంటుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్ఠాదేవి ఆ పరిసరాల్లోకి రాదు.పురుషులకు శిరము కుడిభాగమున పుట్టుమచ్చ ఉంటే..?
పురుషులకు శిరస్థలికి కుడిభాగమున పుట్టుమచ్చ ఉంటే శుభసూచకము. ఈ పుట్టుమచ్చ తేనె, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉండటం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

శిరమునందు కుడిభాగమున పుట్టుమచ్చ కలిగిన వ్యక్తి పరిపాలకుడిగా, సత్ప్రవర్తన కలిగి వాడుగా ఉంటాడు. జీవితంలో ఉన్నత పదవులను అలంకరించి, భోగభాగ్యాలను అనుభవిస్తాడు. సర్వసంపదలతో తులతూగుతాడు.

అదే పుట్టుమచ్చ ఎడమ భాగమున ఉంటే.. ఆ వ్యక్తి సన్యాసి అవుతాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే భాగస్వామి సర్దుకుపోతే ఆ వ్యక్తి జీవితం పురోగమనం వైపు కొనసాగుతుంది.

శిరమునందు ఎడమవైపు పుట్టుమచ్చ కలిగిన వ్యక్తి ఇతరులకు బోధించడం, ఇతరులకు సేవచేయడమంటే ముందుంటాడు. అలాగే శిరము మీద ఎక్కడనైనా పుట్టుమచ్చ ఉన్నచో ఆ వ్యక్తి కీర్తివంతుడు, ధనవంతుడగునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 


నవగ్రహాల్లో శనిభగవానుడిని మీరెలా నమస్కరిస్తున్నారు?నవగ్రహాల్లో శని భగవానుడికి మీరెలా నమస్కరిస్తున్నారు. శని భగవానుడికి ప్రత్యక్షంగా నిలబడి నమస్కరిస్తున్నారా? అయితే అది మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏదైనా ఆలయంలో గల నవగ్రహాలను 9సార్లు ప్రదక్షిణ చేసి, అనంతరం శనిగ్రహానికి నేరుగా నిలబడి తలవంచి నమస్కరించడం కూడదు. శనిగ్రహం మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు నమస్కరిస్తే.. శనిగ్రహ ప్రభావంచే దుష్పలితాలు తప్పవని పండితులు అంటున్నారు.

ఇంకా నవగ్రహ ప్రదక్షణ చేసేటప్పుడు ఏ గ్రహాన్ని ముట్టుకోకుండా.. చేతితో ఏ విగ్రహాన్ని తాకకుండా ప్రదక్షణ చేయడం ద్వారా నవగ్రహాలచే ఏర్పడే దుష్ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది. ముఖ్యంగా శనిగ్రహానికి నేరుగా నిలబడి నమస్కరిస్తే ఆ గ్రహ ప్రభావంచే అశుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే.. నవగ్రహాల్లో శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పూర్వం శ్రీలంకను పరిపాలించిన రావణాసురుడు తన బలపరాక్రమాలచే దేవతలను మరియు నవగ్రహాలను జయించాడు. ఇందులో నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసి, వాటిపై నడవటం చేశాడు. దీన్ని గమనించిన నారదమహాముని రావణాసురుడి అహంకారానికి నిర్మూలించాలని భావించాడు.

ఈ క్రమంలో "ఓ రావణాసురా.. నీవు నిజమైన బలపరాక్రమశాలి అయితే నవగ్రహాలను బోల్తాపడేసి నడిచిపోవడం గాకుండా.. వారిని సాష్టాంగ పడుకోబెట్టి మెట్లుగా ఉపయోగించుకోవచ్చు కదా..!" అన్నాడు. నారదుని మాట విన్న రావణాసురుడు నవగ్రహాలను బోల్తా పడుకోబెట్టకుండా తనవైపు చూసేలా పడుకోబెట్టి మెట్లుగా ఉపయోగించుకున్నాడు.

ఇలా రావణాసురుడు ప్రత్యక్షంగా శనిగ్రహాన్ని చూడటం ద్వారా అప్పటినుంచి ఆతనికి చెడుకాలం ఆరంభమైంది. ఇది జరిగిన తర్వాతే రామునిచే రావణాసురుడు హతుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శనిభగవానుడిని నమస్కరించే సమయాల్లో ఆయనకు ప్రత్యక్షంగా గాకుండా పక్కకు నిలబడి నమస్కరించడం చేయాలని పురోహితులు చెబుతున్నారు. 


గడ్డము మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతుడవుతారట..!పురుషులకు గడ్డము మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతుడవుతారట. ఇతరులను ఆకర్షించే ఛాయ, వాక్చాతుర్యాన్ని కూడా కలిగివుంటారట. చాలా కీర్తివంతుడవుడు కూడా అవుతాడు.

అలాగే గడ్డమునకు కుడిభాగమున పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది. ఇంకా పదిమందిచేత మంచివాడనిపించుకుంటాడు. అయితే ఆ మచ్చే గడ్డమునకు ఎడమవైపు ఉంటే మాత్రం విద్యావిహీనుడవుతాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అలాగే గడ్డమునకు కుడి, ఎడమ వైపుల గాకుండా గడ్డమునకు మధ్యగా పుట్టుమచ్చ ఉంటే మంచి ఫలితాలనిస్తుంది. గడ్డమునకు మధ్యగా పుట్టుమచ్చ కలిగిన వ్యక్తి ధనవంతుడయి న్యాయంగా ప్రవర్తించుకొంటాడు. ఇంకా గడ్డమునకు కిందిభాగమున పుట్టుమచ్చ వున్నచో సంగీత సాహిత్యముల్లో గట్టివాడవుతాడని పురోహితులు చెబుతున్నారు.


నవగ్రహాల అనుగ్రహం కోసం ఏ వ్రతాలు చేయాలంటే..?మనం కోరుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ పూజలు, పునస్కారాలు చేయడం పరిపాటి. అనుకున్నది జరగాలని కోరుకుంటూ వివిధ రకాల యజ్ఞయాగాదులు, పూజలు చేస్తుంటాం.

ముఖ్యంగా జ్యోతిష్యుల సలహాల ప్రకారం నవగ్రహ అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తుంటాం. ఇలా నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు చేయడంతో పాటు కొన్ని వ్రతాలను ఆచరిస్తే నవగ్రహ ప్రభావంచే ఏర్పడే దుష్పలితాలకు దూరంగా ఉండవచ్చునని పురోహితులు చెబుతున్నారు. నవగ్రహాల అనుగ్రహానికి చేయవలసిన వ్రతాలను ఓ సారి పరిశీలిద్ధాం...!

సూర్యగ్రహ అనుగ్రహముకు రథసప్తమి, శ్రీరామనవమి, కేదారేశ్వర, సూర్య చంద్ర వ్రతము చేయాలి. అలాగే చంద్ర గ్రహానికి అమావాస్య సోమతి వ్రతం, కృష్ణాష్టమి వ్రతం, సోమవార వ్రతం, కుజుడు అనుగ్రహానికి నాగుల చవితి, నాగ పంచమి, అంగారక చవితి, కాత్యాయనీ వ్రతము, కుజగౌరీ వ్రతము చేయాలి.

బుధగ్రహ అనుగ్రహానికి శ్రీ అనంత పద్మనాభ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, తులసీ వ్రతము, గురు గ్రహానికి శ్రీ సత్యసాయి వ్రతము, శ్రీ సత్యదత్త వ్రతము, త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది.

అలాగే శుక్రుడు అనుగ్రహానికి వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, శ్రీలక్ష్మి కుబేర వ్రతం, సంతోషిమాత, అనఘాదేవి వ్రతాలను చేయాలి. శని గ్రహం అనుగ్రహానికి హనుమద్వ్రతము, శివరాత్రి, శనైశ్చర వ్రతాలు, రాహు గ్రహానికి శ్రీదేవి నవరాత్రి, సావిత్రీ, షోడశగౌరీ వ్రతం, కేతువు అనుగ్రహానికి వినాయక చవితి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలితం వుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మీకు కుడికంటిలో పుట్టుమచ్చ ఉందా..?!కుడికంటిలో పుట్టుమచ్చగలిగిన పురుషుడు అనుకోని ఆస్తులు అందుకుంటాడు. తలంచుకొనని భోగాలను అనుభవిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నాపు. ఆ మచ్చ నల్లగుడ్డికి కుడిభాగమున ఉన్నతో ఆ వ్యక్తి గొప్ప ధనవంతుడవుతాడు. మిత్రుల వల్ల సుఖమును కీర్తిని సంపాదిస్తాడు.

ఇదే మచ్చ నల్లగుడ్డునకు ఎడమ భాగమందు ఉంటే ఆ పురుషుడు విజయసౌశీల్యాది గుణములు కలిగివుంటాడు. మొత్తము మీద కుడికంటిలో పుట్టుమచ్చ ఎక్కడవున్నా సౌఖ్యమును, ధనమును, కీర్తిని కలుగజేస్తుంది.

అలాగే కుడికంటి రెప్పమీద మచ్చయున్నచో ఆ వ్యక్తికి అతిశయం ఎక్కువగా ఉంటుంది. కాని ఆనందమయ జీవితాన్ని గడుపుతాడు. అమిత భాగ్యభోగ్యములను అనుభవిస్తాడు. దైవశక్తితో పుణ్యకార్యములు చేయడంలో ముందుంటారు.

ఇంకా కుడికంటి రెప్ప లోపలి భాగమున పుట్టుమచ్చగలవారు ధనధాన్య సమృద్ధి కలిగియుందురు. అధిక సంఖ్యలో సేవకులను కలిగి వుండే వీరికి వాహన సౌఖ్యము కలుగునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 


మీకు నవగ్రహదోషముందా? ఐతే 9సార్లు ప్రదక్షణ చేయండి?


దేవాలయాల్లోని నవగ్రహాల చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేయడం పరిపాటి. అయితే నవగ్రహ దోషమున్నవారు మాత్రమే నవగ్రహాలను తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేసుకోవాలని, మిగిలిన వారు ఒక్కసారి ప్రదక్షణ చేసుకుంటే సరిపోతుందని పురోహితులు అంటున్నారు.

ఇంకా "ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ నవగ్రహాలను ఒక్కసారి ప్రదక్షణ చేసుకుంటే చాలునట. అయితే తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేసినా మంచిదేనని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే మీ జాతకం ప్రకారం ఏ గ్రహ ప్రభావం మీపై ఉందనే విషయాన్ని తెలుసుకుని, ఆ గ్రహానికి అనుకూలమైన పూజలు చేయడం, మంత్రాలు పఠించడం శ్రేయస్కరం. నవగ్రహ ప్రభావంలో ఏ గ్రహదశ మీపై ఉందనే విషయాన్ని తెలుసుకుని, ఆ గ్రహానికి అధిపతి అయిన భగవానుడిని పూజించడం ద్వారా మంచి జరుగుతుందని విశ్వాసం.

ఇందులో శనిగ్రహాన్ని గురించి చెప్పాలంటే..? శనివారం పూట నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా ఈతిబాధలు దూరమవుతాయి. ఇదేవిధంగా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఏలినాటి శని, అష్టమ శని, శని దశాకాలంతో ఏర్పడే అశుభ ఫలితాలను శనివారం శనీశ్వరునికి చేసే పూజ ద్వారా తప్పుకుంటాయని పురోహితులు సూచిస్తున్నారు.
శ్రావణ సోమవారం పరమేశ్వరుడిని పూజిస్తే..!?మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకలసంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసంలో పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది.

పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఓ దేవుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. శుక్రవారం మాత్రమే గాకుండా శ్రావణ మాసంలో ప్రతి రోజూ ఏ దేవతలను కొలవడం మంచిదనే విషయాన్ని పరిశీలిస్తే..

ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు.

సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,

మంగళవారం గౌరీ వ్రతం,

బుధవారం విఠలుడికి పూజలు,

గురువారాల్లో గురుదేవుని ఆరాధన,

శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు,

శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి.. భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇందులో ముఖ్యంగా శ్రావణ సోమవారం శివాలయాలను సందర్శించుకోవడం ద్వారు పుణ్య ఫలితాలు చేకూరుతాయి. ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు, పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుందని పురోహితులు చెబుతున్నారు.

అలాగే ఆలయాల్లో పూజలు నిర్వహించడమే గాకుండా గృహాల్లో నోములు చేసి శనగల వాయనం ఇవ్వడం మంచిది. ఇంకా పెళ్ళైన కొత్తలో వివాహితులు మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవార వ్రతం వంటివి ఆచరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.


మీ శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయి?శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనడాన్ని బట్టి ఫలితాలను చెప్పేయవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగను, ఆకుపచ్చగను, తేనెరంగును, పసుపుపచ్చగను, గంధపురంగుగా ఉంటాయి.

ఇందులో ఆకుపచ్చ, ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి. అయితే నలుపు రంగు దరిద్రమునకు, మరికొన్ని అశుభాలకు సూచకములని పండితములు అంటున్నారు. అయితే లేత నలుపు, ఆకుపచ్చరంగు, గంధపురంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభఫలితాలుంటాయి.

అలాగే పుట్టుమచ్చల మీట వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అని కొంచెము పొడవు కలిగివున్నచో ఆ వ్యక్తి ధనవంతుడు, కీర్తివంతుడవుతాడని పురోహితులు చెబుతున్నారు. అలాగే ఆ వెంట్రుకలే దట్టముగా ఉండి కొంచెము పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు చేకూరుతాయి.

ఇకపోతే.. పురుషులకు రెండు కనుబొమల మధ్య యున్నచో ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. బంధుప్రియుడవుతాడు. భోగములందు ఆసక్తి కలిగివుంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ప్రేమకలిగి వుంటాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.


వెన్నదొంగ' జన్మాష్టమి నాడు తులసీ పూజ చేస్తే..!?
"గీతాచార్యుడు" మహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణపరమాత్ముడు జన్మించిన శుభదినాన్నే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. జన్మాష్టమి నాడు ఉపవాసం ఉండి కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, మీగడ, వెన్నలను సమర్పించుకుంటే సర్వాభీష్టాలు చేకూరుతాయి.

శ్రీకృష్ణ పరమాత్మ తన చిన్ననాటి నుంచే ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానము అనే నల్లటి కుండను బద్దలు కొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి.

ఇంకా చిన్నతనము నుంచే అనేకమంది రాక్షసులకు సంహరిస్తూ దుష్ఠశిష్ఠరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రధసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞాననాంధకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు.

అట్టి మహిమాన్వితమైన కృష్ణపరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని చల్లని నీటితో 'తులసీదళము'లను ఉంచి స్నానమాచరించినట్లైతే, సమస్త పుణ్య తీర్థముల్లో స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా శుచిగా స్నానమాచరించి పసుపు బట్టలు ధరించి తులసీకోటను రంగవల్లికలు, పుష్పాలు, పసుపు కుంకుమలతో అలంకరించుకుని, నేతితో దీపమెలిగించాలి. అనంతరం తులసీ కోటను 9 సార్లు ప్రదక్షణ చేసినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.

అలాగే లీలావినోదాలచే బాల్యము నుండే, భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చిన శ్రీకృష్ణుడి జన్మదినాన అందరూ గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణపాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుతూ, ఊయలలో ఓ చిన్ని కృష్ణుని ప్రతిమను ఉంచి, రకరకాల పూవులతో పూజించి, ధూపదీప నైవేద్యములతో ఆ స్వామిని ఆరాధించి భక్తులకు తీర్థ ప్రసాదములు దక్షిణ తాంబూలములు సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి ఇట్టి పరమ పుణ్యదినమున ఆ శ్రీకృష్ణునికి విశేషార్చనలు జరిపించుకుని కృష్ణభగవానుని ఆశీస్సులను పొందుదుముగాక.!


శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించండి!శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.

శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుందని పురోహితులు చెబుతున్నారు.

అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.

గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.

ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.


కాలసర్పదోషానికి పరిహారం ఎలా చేయాలంటే..?!కాలసర్పదోష పరిహారానికి అందరూ శ్రీ కాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతువుల పూజ చేయించడం పరిపాటి. అయితే ఈ సర్పదోషం ఉన్న జాతకులు కాలభైరవ మూర్తిని ప్రార్థించడం శ్రేయస్కరం.

అంతేగాకుండా తమిళనాడు రాష్ట్రం, శివగంగై జిల్లా, తిరుప్పత్తూరులోని కాలభైరవ దేవాలయంలో పూజ చేయించినట్లైతే కాలసర్పదోషం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆలయంలో భైరవమూర్తి శునకముతో గాకుండా యోగాసీనుడై భక్తులకు దర్శనమివ్వడం ద్వారా కాలసర్పదోషాన్ని తొలగిస్తాడని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా కాలసర్పదోషమున్న జాతకులు కులదైవాన్ని పూజించడం, మానసిక బాధితులకు సహాయం చేయడం ద్వారా కొంత శుభ ఫలితాలను పొందవచ్చును. అలాగే ప్రతి శనివారం శివాలయంలోని భైరవమూర్తికి నేతితో తొమ్మిది వారాల పాటు దీపమెలిగిస్తే శుభఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.


గురుపౌర్ణమి రోజున వస్త్రాలు దానం చేయండిగురుపౌర్ణమి రోజున వస్త్రదానము చేసే వారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాసమహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నారు. గురుపౌర్ణమి నాడు (ఆషాఢ శుద్ధ పౌర్ణమి- 25వ తేదీ)న గురుపూజ చేసే వారికి శుభఫలితాలుంటాయి. అలాగే వస్త్ర, ఆభరణ, గోదానములతో పాటు అర్ఘ్య పాదాల తోటి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

వ్యాసపూర్ణిమ అని పిలుపబడే గురుపౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగాస్నానమాచరించి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరము, ఇంటి గడపకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. పూజకు దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. పూజకు పసుపు రంగు అక్షతలు, చామంతిపువ్వులు నైవేద్యానికి కేసరిబాత్, పాలకోవా, అరటిపండు వంటివి తీసుకోవాలి.

గురుపౌర్ణమి రోజున ఉదయం 11 నుంచి 12గంటల లోపు పూజచేయాలి. తులసిమాల ధరించి ఉత్తరం వైపు తిరిగి కంచు దీపంలో ఐదు దూది వత్తులతో పంచహారతులిచ్చుకోవాలి. పూజకుముందు శ్రీ సాయిబాబా, దత్త స్తోత్రములు, శ్రీ గురుదత్త శ్రీసాయిసచ్చరిత్రలతో ధ్యానించాలి. లేదా 'ఓం శ్రీ సాయిరాం' అనే మంత్రముతో 108 మార్లు జపించాలి.

అలాగే గురుపౌర్ణమి రోజున శ్రీసాయి, శ్రీదత్త పుణ్యక్షేత్రములు అంటే షిరిడి, గాణాగాపూర్‌ల సందర్శనం మంచి ఫలితాలనిస్తుంది. అలాగే వ్యాసపూర్ణిమ రోజున దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది.

అలాగే గురుపౌర్ణమి మహోత్సవాలు, సామూహికంగా శ్రీసాయిసత్యవ్రతం వంటి పూజలు చేయించాలి. అలాగే సన్నిహితులకు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిచ్చరిత్ర వంటి పుస్తకాలతో ఉడకబెట్టిన శెనగలను వాయనమిస్తే ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.


గురుపౌర్ణమి రోజున ఆవునేతితో దీపమెలిగించండిభారతీయ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత మళ్లీ అంతటి గొప్పస్థానం గురువుకే దక్కుతుంది. అందుకే 'ఆచార్య దేవో భవ' అన్నారు. అంతేకాకుండా త్రిమూర్తులు ఒక్కటై గురువుగా అవతరిస్తారని విశ్వాసం. అందుచేత ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున విష్ణుమూర్తి, దత్తాత్రేయ, సాయిబాబా పూజతో పాటు ఆదిశంకరాచార్యుల వారిని కూడా పూజించడం మంచిదని పురోహితులు చెబుతున్నారు.

వ్యాసపూర్ణిమ పర్వదినాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన కొన్ని ఆలయాల్లో ఓ పూజ జరుగుతుంది. కొత్త అంగవస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి, ఆ బియ్యం మీద చుట్టూ నిమ్మకాయలుంచారు. ఆదిశంకరులు, ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం.

పూజ అయిన తర్వాత తలా ఓ పిడికెడు బియ్యం తీసుకుని తమ ఇళ్ళలోని బియ్యంలో కలుపుకుంటారు. బియ్యం, కొత్తవస్త్రం అనేవి లక్ష్మీదేవి చిహ్నాలని, నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచకాలని పురోహితులు అంటున్నారు. అందుచేత గురుపౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూతి నుదుటన బెట్టి దేవతా స్తుతి చేయాలి.

ఇకపోతే.. గురుపౌర్ణమి రోజున నుదుట బొట్టు పెట్టకుండా దేవతా స్తుతి చేయకూడదని పురోహితులు సూచిస్తున్నారు. ఇంకా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాల్లో ఆవునేతితో దీపమెలిగించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే ఆలయాల్లో జరిగే పూజలను కళ్లారా వీక్షించేవారికి లేదా పూజలు జరిపేంచేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. 


శయన ఏకాదశి నుంచి 4 మాసాలు 'గోపద్మ వ్రతం' చేయండి
ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా, శయన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు (నేడు) శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ వ్రతం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈనాటి నుంచి పాల కడలిలో నాలుగు నెలలపాటు మహావిష్ణువు శయనిస్తాడు. కనుకనే దీన్ని శయన ఏకాదశి అన్నారు.

తొలి ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షలను పాటిస్తుంటారు. ఇంకా ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ద్వాదశి వరకు గోపద్మ వ్రతం ఆచరించే వారికి శ్రీ మహావిష్ణువు కోరిన కోర్కెలను నెరవేరుస్తాడని విశ్వాసం. ఈ వ్రతాన్ని ఆచరించని మహిళలను యమధర్మరాజు శిక్షిస్తాడని పద్మపురాణం చెబుతోంది.

ఈ వ్రతం ప్రకారం నాలుగు నెలల పాటు శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. తొలి ఏకాదశి నుంచి ఇంటిల్లాపాదిని శుభ్రం చేసుకుని అలికి ముగ్గులు పెట్టాలి. ప్రత్యేకంగా బియ్యపు పిండితో ముఫ్పై మూడు పద్మాలను తీర్చిదిద్ధి గంధ పుష్పాలతో శ్రీహరిని పూజించి ప్రదక్షిణ నమస్కారించాలి. 33 అప్పాలను వేద పండితులకు వాయనం ఇవ్వాలి.

గ్రామీణ ప్రజలైతే పశువుల కొష్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నాలుగు మాసాలు పరిశుభ్రతతో మహావిష్ణువును పూజించి, కార్తీక శుక్ల ద్వాదశి నాడు నారాయణ స్వామిని నిష్టతో పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ఈ నాలుగు నెలల పాటు విష్ణుమూర్తిని అర్చించి, లీలా విశేషాలు, పురాణ పఠనం వల్ల అష్ట కష్టాలు తొలగిపోయి, సిరిసంపదలు చేకూరుతాయి.

మరోవైపు నాలుగు నెలల పాటు మహావిష్ణువు జల శయనం చేయడం వల్ల విష్ణు తేజం నీటిలో వ్యాపించి ఉంటుంది. అందుకే చాతుర్మాస్యం (నాలుగు నెలలు) చేసే నదీ స్నానం శుభ ఫలితాలను ఇస్తుంది.

నదికి వెళ్లి స్నానం చేయలేని వారు దగ్గరలో ఉన్న నది, చెరువు లేదా బావుల్లో భక్తిపూర్వకంగా స్నానం ఆచరించి పుణ్య ఫలాన్ని పొందవచ్చు. ఇంకా చాతుర్మాస్య ప్రారంభం, సమాప్తం సమయాల్లో విష్ణు భగవానునికి అతి ప్రీతికరమైన ఏకాదశుల్లో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా సత్ఫలితాలు పొందుతారని పురోహితులు సూచిస్తున్నారు.

ఇంకా ఆషాడే తు సితే పక్షే ఏకదశ్యా ముషోషిత:
చాతుర్మాస్యవ్రతంకుర్యా ద్యత్కించి న్నియతో నరః
వార్షికాం శ్చుతురో మాసా న్వాహ యేత్కేనచి న్నరః
ప్రవతేన నోచే దాప్నోతి కిల్బిషం వత్సరోద్భవమ్. అని చాతుర్మాస్య దీక్షా ప్రశస్తిని గురించి స్కాంద, భవిష్యోత్తరాది పురాణములో తెలుపబడి ఉంది.

గృహస్థులైన శ్రీహరి భక్తులు ఈ నాలుగు మాసాలు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కామక్రోధాదులను వీడి, ఒంటిపూట భోజనము చేస్తూ దీక్షతో శ్రీహరిని ఆరాధిస్తే అశ్వమేథయాగఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


 

Monday, October 8, 2012

పుట్టుమచ్చలు-ఫలితాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..?

 పుట్టుమచ్చలు -ఫలితాలు..

నుదుటి మీద ఉంటే : మీరు మంచి కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు. ఆర్థిక స్వతంత్రం ఉంటుంది. రాజకీయాల్లో రాణిస్తారు.

నుదుటి క్రింది భాగంలో ఉంటే : మీరు మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 40 ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు.

కనుబొమ్మపై ఉంటే : మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈర్ష్య ఉండదు.

ముక్కుపై ఉంటే : కొంత మందిలో క్రమశిక్షణ లోపిస్తుంది.

పెదవిపై ఉంటే : కొన్నిసార్లు మీ బంధువులు, స్నేహితుల విషయంలో మీకు ఈర్ష్య కలుగుతుంది.

బుగ్గపై ఉంటే : రాజకీయాల్లో రాణిస్తారు. స్థిరాస్తులు గడిస్తారు.

నాలుకపై ఉంటే : మీరు మంచి తెలివితేటలు, విద్యను కలిగి ఉంటారు.

భుజంపై ఉంటే : మీరు మర్యాదస్తులు, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు.

మోచేయిపై ఉంటే : మీ జీవితంలోని లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు.

ఎడమ చంక భాగంలో ఉంటే : మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడిదుడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి.

కుడి చంక భాగంలో ఉంటే : భద్రత విషయంలో మీరు చాలా మెళకువగా ఉంటారు.

మెడ భాగంలో ఉంటే : కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు. ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు.

శరీరం ముందు భాగంలో ఉంటే : ఆకస్మిక ధన లాభం.

శరీరం వెనుక భాగంలో ఉంటే : మీరు కష్టపడి పని చేసినా ఆ పేరు ఇతరులకు దక్కుతుంది.

ఛాతీ భాగంలో ఉంటే : మీకు మనశ్శాంతి ఉండదు. కొందరికి జీవితంలో కష్టాలు తప్పవు.

శరీరం కుడి భాగంలో ఉంటే : మీ సోమరితనం కుటుంబం పై ప్రభావం చూపుతుంది. ఉల్లాసంగా ప్రయాణాలు సాగిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు.

శరీరం ఎడమ భాగంలో ఉంటే : మీరు ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. జీవితంలో అనుకున్నది సాధిస్తారు.

నాభి భాగంలో ఉంటే : మీకు సుఖ సంతోషాలు సమతూకంగా ఉంటాయి. పూర్వీకుల ఆస్తి లభస్తుంది. కొన్నిసార్లు అదృష్టం కలిసివస్తుంది.

తొడ భాగంలో ఉంటే : మీరు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. వ్యాపారాలు సాగిస్తారు.

పాదం పై ఉంటే : మీరు స్వఛ్చమైన జీవితాన్ని గడుపుతారు. సామాజిక సేవల పట్ల ఆసక్తి చూపుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాధిస్తారు. ఆరోగ్యంగా ఉండటం కోసం రోజూ వ్యాయామం చేయటం మంచిది.

కాలిపై ఉంటే : మీ శ్రీమతి ద్వారా స్థిరాస్తులు, సౌకర్యాలు పొందుతారు.

చెవిపై ఉంటే : మీరు అదృష్ట వంతులుగా పరిగణించవచ్చు.

కంటిపై ఉంటే : మీరు నిజాయితీ పరులు, నమ్మకస్తులు.

చేతిపై ఉంటే : మీరు ప్రతిభ కలిగిన వాళ్లు, జీవితంలో విజయాన్ని సాధిస్తారు.

మడిమపై ఉంటే : మీరు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు.

కుడి మోకాలుపై ఉంటే : మీరు స్నేహభావాన్ని కలిగి ఉంటారు.

ఎడమ మోకాలుపై ఉంటే : మీరు విశృంఖల జీవన శైలిలో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.


నవగ్రహ పారాయణాలు, పుణ్యతిథులేవో తెలుసా?
నవ గ్రహాలను పారాయణాలు, పుణ్యతిథులు ఏమిటో తెలుసా..? నవగ్రహాల శాంతికి ఆ గ్రహానికి సంబంధిత పారాయణము, పుణ్యతిథుల్లో స్తుతిస్తే ఆ గ్రహ ప్రభావములచే ఏర్పడే ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా నవగ్రహాల పారాయణాలు, పుణ్యతిథులు ఏమిటో తెలుసుకుందాం..!

తొమ్మిది నవగ్రహాల్లో వరుస క్రమంలో సూర్యునికి రామాయణము, భవిష్య కల్కి పురాణము, సూర్యపురాణం

చంద్రునికి శ్రీమద్భాగవతము, భవిష్య కల్కి పురాణము, వాయుపురాణము

కుజునికి- అగ్నిపురాణము, స్కాంధపురాణము, బ్రహ్మవైవర్తన పురాణాల్లో కుమారస్వామి చరిత్ర

బుధునికి- లింగపురాణంలో నరసింహావతారము, విష్ణుపురాణము, నారదపురాణము


గురునికి- బ్రహ్మణపురాణము, వామనపురాణం, లింగపురాణం

శుక్రునికి- బ్రహ్మండపురాణం, భవిష్యపురాణమునందు శ్రీమద్భాగవతంలోని పరశురామావతారం

శనీశ్వరునికి-మార్కండేయపురాణం, కూర్మపురాణం, భవిష్యపురాణం,

రాహువు-దేవీభాగవతం, వరాహపురాణం, గరుడపురాణం,

కేతువుకు- బ్రహ్మవైవర్తన పురాణం, మత్స్యపురాణం వంటివి పఠించాలి.

పుణ్యతిథుల విషయానికొస్తే..?

సూర్యునికి- కార్తిక శుద్ద పూర్ణిమ-కార్తిక మాసంలో రవిజపము ఆరువేల సార్లు చేసి గోధుమలు దానం చేయాలి.

చంద్రునికి- శ్రావణ పూర్ణిమ - శ్రావణ మాసంలో చంద్రజపమును పదివేలసార్లు చేసి తెల్లని వస్తాలతో బియ్యాన్ని దానం చేయాలి.

కుజునికి- చైత్రశుద్ద పూర్ణిమ చైత్రమాసంలో అంగారక జపము ఏడువేల సార్లు చేసి కందులు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.

మార్గశిర శుద్ద షష్టి- మార్గశిర మాసంలో అంగారక జపమును ఏడువేల సార్లు చేసి కందులు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.

బుధునికి-జ్యేష్ఠ పూర్ణిమ-జ్యేష్ఠ మాసంలో బుధజపాన్ని 17 వేల సార్లు చేసి పెసలు ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయాలి.

గురువు-వైశాఖ తదియ- భాద్రపదమాసంలో బృహస్పతి జపాన్ని 16 వేలసార్లు చేసి శెనగలు దానం చేయాలి.

శుక్రునికి- ఆషాఢశుద్దదశమి- ఆషాఢమాసంలో శుక్రజపమును 20వేల సార్లు చేసి అలచందలు, తెల్లని వస్త్రాలు దానం చేయాలి.

ఫాల్గుణ శుద్ద పూర్ణిమ - ఫాల్గుణమాసంలో శుక్రజపమును 20వేల సార్లు చేసి తెల్లని వస్త్రాలు దానం చేయాలి. 

శని భగవానునికి - శ్రావణ బహుళ అష్టమి- శ్రావణ మాసంలో శనిజపము చేసి నల్లనువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయాలి. రాహువుకు - ఆశ్వీజ బహుళ చతుర్దశి - ఆశ్వీజమాసంలో రాహుజపం 18 వేలసార్లు చేసి మినుములు కాఫీపొడి రంగుకు చెందిన వస్త్రాలను దానం చేయాలి. కేతువుకు- ఆశ్వీజశుద్ద పాడ్యమి- ఆశ్వీజమాసంలో కేతుజపాన్ని ఏడువేల సార్లు చేసి ఉలవలు నలుపు వస్త్రాలను దానం చేయాలి.

మాఘశుద్ద అష్టమి - మాఘమాసంలో ఏడువేల సార్లు కేతుజపాన్ని చేసి ఉలవలు నలుపు వస్త్రాలను దానం చేయడం ద్వారా నవగ్రహాల ప్రభావంచే కలిగే అశుభ ఫలితాలు దరిచేరవని పురోహితులు సూచిస్తున్నారు.


మహా ప్రళయం 2012లో కాదు... 3097 తప్పదు!!కోటానుకోట్ల జీవరాసులకు నెలవైన భూమికి 2012లో పెను ఉపద్రవం ముంచుకొస్తుందన్న వదంతి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సంచరిస్తోంది. దీనికితోడు "2012 ఎండ్ ఆఫ్ ది వరల్డ్" పేరిట తెరకెక్కిన హాలీవుడ్ సినిమాలోని సంఘటనలు ప్రేక్షకులను మరింత భీతావహులను చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఆయా భవిష్యవాణి పుస్తకాలను తిరగేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 441 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ భవిష్యవాణి పండితుడు నోస్ట్రాడామస్ తన భవిష్యవాణి పుస్తకంలో లిఖించిన విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఆయన తన పుస్తకంలో ఇటీవల కాలంలో సంభవించిన పలు దుర్ఘటనలను ప్రస్తావించారట.

ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలోని ట్విన్ టవర్స్ కూలిపోతాయని 500 ఏళ్ల క్రితమే ఆయన వెల్లడించాడు. అంతేకాదు హిట్లర్ నియంత వల్ల యుద్ధం ముంచుకొస్తుందని తన పుస్తకంలో జోస్యం చెప్పాడట.

అదేవిధంగా 3097వ సంవత్సరంలో మహాప్రళయం తప్పదనీ, ఆ సమయంలో ఒక బలమైన శక్తి భూమిని ఢీకొని భూగ్రహం అంతమవుతుందని చెప్పాడట. అంటే.. ప్రళయానికి మరో 1788 ఏళ్ల సమయం పడుతుందని ఆయన తెలిపారు.

భూమి అంతం అవడానికి ముందు పలు పెను ఉపద్రవాలు సంభవిస్తాయని, మానవాళి తమకు తామే అంతం చేసుకునేందుకు ఆయుధాలను ఉపయోగించుకుంటుందని జోస్యం చెప్పారట. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసి ప్రపంచంలోని దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు అణుబాంబులను వర్షించుకుంటారట. అలా పెను సంక్షోభంలోకి నెట్టబడిన భూగ్రహం చివరికి 1788 ఏళ్ల తర్వాత మహాప్రళయానికి గురై అంతర్థానమైపోతుందట."అక్షయ తృతీయ" నాడు ఏకాక్షీ నారికేళంతో పూజ చేస్తే..!?సాధారణంగా టెంకాయకు మూడు కళ్లుంటాయి. కానీ కొన్ని నారికేళాలకు అరుదుగా ఒకే కన్ను ఉంటుంది. దీనినే ఏకాక్షీ నారికేళమంటారు. అక్షయ తృతీయ నాడు ఈ అరుదైన ఏకాక్షీ నారికేళాన్ని పూజిస్తే తీరని కోరికంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.

ఏకాక్షీ నారికేళానికి పసుపు నూలును చుట్టి కలశంపై ఉంచి, దాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజించిన వారికి పుణ్యఫలంతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా వ్యాపారంలో నష్టం వచ్చిన వారు అక్షయ తృతీయ నాడు పంచధాతువుల లక్ష్మీ పిరమిడ్‌ను పూజించడం మంచిది.

లక్ష్మీ పిరమిడ్‌కు పూజ చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి, లాభాలు ఉంటాయని పురోహితులు అంటున్నారు. అలాగే శ్వేతార్క గణపతిని అక్షయ తృతీయ నాడు పూజించేవారికి వ్యాధులు, దారిద్ర్యం, ఈతిబాధలు తొలగిపోతాయి. కాగా.. అక్షయ తృతీయ నాడు మర్రిచెట్టును 9 సార్లు ప్రదక్షిణ చేసి మృత్యుంజయ మంత్రాన్ని పఠించేవారికి వ్యాధులు మటుమాయమవుతాయి.

మరోవైపు అక్షయ తృతీయ నాడు వివాహాలు చేసుకునే దంపతులు సుఖసంతోషాలతో, నూరేళ్లపాటు వర్ధిల్లుతారని పురాణాలు చెబుతున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ నాడు వివాహాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే.. అక్షయ తృతీయ రోజున పవిత్ర గంగాదేవి (గంగానది) స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ద్రౌపదీ దేవి మానాన్ని శ్రీ కృష్ణుడు వస్త్రమిచ్చి కాపాడింది కూడా ఈ రోజే. అలాగే బ్రహ్మదేవుడు భూమిని సృష్టించింది కూడా అక్షయ తృతీయ నాడేనని పురోహితులు చెబుతున్నారు."అక్షయ తృతీయ" నాడు చేయాల్సిన శుభకార్యాలు..!వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.

అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.

ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.

ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.


"అక్షయ తృతీయ" నాడు ఏ దేవతలను పూజించాలో తెలుసా?"అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన వచ్చే అక్షయ తృతీయ నాడు జాతక రీత్యా 12 రాశులకు చెందిన జాతకులు, ఏయే దేవతలు పూజించాలనే విషయాన్ని జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయక, సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మంచిది. ఇంకా విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేసే వారికి సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు శాంతరూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవికి స్మరించడం, పూజించడం చేయాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాలతో చేసిన పాయసం లేదా రవ్వలడ్డును నైవేద్యంగా సమర్పించుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తే శుభ ఫలితాలుంటాయి.

ఇక మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయనాడు విష్ణు, మహాలక్ష్మీలను పూజించడం శ్రేయస్కరం. విష్ణు, మహాలక్ష్మీదేవిని అష్టోత్తరాలతో పూజించి, బ్రాహ్మణులకు, పేదలకు చేతనైనా సహాయం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.

కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మ తల్లిని పూజించడం చేయాలి. దుర్గమ్మ తల్లికి నేతితో దీపమెలిగించి బియ్యం పిండితో చేసే పదార్థాలను దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇక సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుడిని, కన్యారాశిలో జన్మించిన జాతకులు విష్ణు, మహాలక్ష్మీదేవిలను ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. సింహ, కన్యారాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు శివావిష్ణులువుండే ఆలయాలను సందర్శించడం చాలా మంచిది.

తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను, వృశ్చిక రాశి జాతకులు వినాయకస్వామి, సుబ్రహ్మణ్యులను పూజించడం మంచిది. అలాగే ధనుస్సురాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. ఇంకా దక్షిణామూర్తికి తెల్లటిపువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇకపోతే.. మకరరాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు, హనుమంతుడిని పూజించడం మంచిది. అక్షయ తృతీయ నాడు హనుమంతునికి తమలపాకులతో మాల, వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది. ఇంకా ఈతిబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అలాగే విఘ్నేశ్వరునికి గరిక మాలను సమర్పించుకోవచ్చు.

అలాగే కుంభ రాశి జాతకులు శనీశ్వరుడు, హనుమంతుడిని, మీన రాశి జాతకులు నందీశ్వరుడిని పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.పచ్చగడ్డి కనిపిస్తే అందమైన భార్య లభిస్తుందట.!
పచ్చగడ్డి, పచ్చిక గల భూమి కలలో కనిపిస్తే అన్ని విధాలా మంచి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. అదేవిధంగా కలలో పచ్చగడ్డి కనిపిస్తే అందమైన భార్య లభిస్తుందని జ్యోతిష్కులు అంటున్నారు. పొలం పైరు పంటలతో కనిపిస్తే ధనలాభం. ఎవరైనా తనకు భూదానం చేసినట్లు కల వస్తే పెళ్ళి కాని వారికి పెళ్లి, పెళ్ళైన వారికి స్త్రీ వలన ధన లాభం కలుగుతుంది.


అదేవిధంగా పెరట్లో పూలచెట్లు, పండ్ల మొక్కలు, బావి ఉన్నట్లు కనిపిస్తే పేరు కలిగిన పుత్రులు కలుగుతారు. ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు కనిపిస్తే కార్యసిద్ధి జరుగుతోందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా హద్దులు లేని భూములు కనిపిస్తే అంతులేని సంతోషం, ధనం లభిస్తాయి.


చెట్లు ఎక్కినట్లు కలవస్తే ఆరోగ్యం, ధనలాభం, విందు భోజనం, కార్యజయం. అయితే మెట్లు లేని కొండ ఎక్కినట్లు కనిపిస్తే ఆపదలు కలుగుతాయి. గోడ, మేడ, ఇల్లు, నిచ్చెన ఎక్కినట్లు కలవస్తే సంతోషం కలిగే వార్తలు వింటారని, అయితే వీటి మీద నుంచి కింద పడినట్లు కలవస్తే మాత్రం చేస్తున్న ఉద్యోగ, వ్యాపార వృత్తులకు అవరోధములు, కష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.


ఇకపోతే.. గోతిలో పడితే ఆపదలు వస్తాయి. మ్యాప్స్ కనిపిస్తే దూర ప్రయాణాలు కలిసొస్తాయి. నల్లని భూములు కలలో వస్తే నష్టాలు కలుగుతాయి. గోధుమలతో విత్తబడిన నేల కనిపిస్తే అశాంతి, కష్టము. శ్మశానం కలలోకి వస్తే మంచి అభివృద్ధి కలుగుతుంది. భూకంపం వచ్చినట్లు కలవస్తే అందరికీ కీడు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటోంది.