Wednesday, February 9, 2011

కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నారా?







నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి ముందు మంచి ముహూర్తాలను తప్పనిసరిగా చూసుకోవాలి. వ్యాపారం ప్రారంభించటానికి ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు మంచివి. బొగ్గు, ఇనుము, రాయి, కలప వంటి వ్యాపారాలకు మంగళవారం కూడా శుభప్రదమని జ్యోతిష్కులు అంటున్నారు. అదేవిధంగా పంచమి, సప్తమి, అష్టమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమలు కృష్ణ పక్షం పాడ్యమి విదియ తిధులు యోగ్యములు. 

అదే విధంగా అశ్వని, రోహిణి, పుష్యమి, ఉత్తర, హస్త, అనూరాధ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు, వృషభ, మిధున, సింహ కన్య, ధనుస్సు, మీనరాశుల్లో వ్యాపారం ప్రారంభించడం ద్వారా మంచిఫలితాలతో పాటు వ్యాపార రీత్యా అభివృద్ధి గడిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.  

 వ్యాపార విషయానికి సంబంధించిన ముహూర్తాలు ఇలా ఉంటే వ్యవసాయదారులు తమ పైరును కోసేటపుడు మంచి ముహూర్తాలను ఎన్నుకోవాలి.

పైరు కోయటానికి ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు చాలా మంచివని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా విదియ, తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమా,తిధులు, భరణి, కృత్తిక,ఆరుద్ర,ఆశ్లేష, మఘ, ఉత్తర, స్వాతి తదితరాలు శుభకరం. అలాగే వర్జ్యము, దుర్ముహూర్తాలు లేని శుభగ్రహ హోరకాలాలలో పైరు కోయటానికి అనుకూల సమయం.