Wednesday, February 1, 2012

దంపతులకు స్వర్గసుఖాలను అందించే రతి భంగిమలు...!?







ఈ ఆధునిక యాంత్రిక జీవితంలో నూటికి ఎనభై శాతం నుంచి తొంభై శాతం మంది దంపతుల మధ్య కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే మొక్కుబడితంతులా... తూతూ మంత్రంలా రతి క్రీడా కార్యాన్ని ముగిస్తున్నారు. రొటీన్‌కి భిన్నంగా ట్రై చేస్తే సంసార స్వర్గాన్ని చవిచూడొచ్చనే సంగతి చాలామందికి తెలియడంలేదు. ఇలా నిత్యజీవితంలో మనం ఏ పనిచేసినా ఒకే విధంగా చేస్తే ఆ పనిమీద ఆసక్తి సన్నిగిల్లిపోతుంది. అదేసమయంలో ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఎక్కువ ఆసక్తిని చూపుతాం. అందుకే వాత్సాయనుడు తన కామశాస్త్రంలో దాదాపు 525 కి పైగా రతి భంగిమలను అభివర్ణించాడు. ఇందులో కొన్ని భంగిమల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పురుషుడు పైనుండే భంగిమ...
ఇది దాదాపు 70 శాతం మంది పురుషులు పాల్గొనే సెక్స్‌ ప్రక్రియ. ఈ ప్రక్రియలో పురుషుడు పైభాగంలో ఉంటాడు. అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరి ముఖాలు ఒకరిపై ఒకరు చూసుకునే విధంగా ఈ భంగమ ఉంటుంది. సాధారణంగా ఈ భంగిమ ద్వారానే స్త్రీలు స్వర్గాన్ని చూస్తారని పురుషులు అపోహపడుతుంటారు. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవు.


పైగా పురుషుడు బరువు అధికంగా ఉంటే... ఒక్కొక్కసారి కింద ఉన్న స్త్రీ ఆ బరువు తట్టుకోలేక... శృంగారం మీదే విరక్తి కలిగే ప్రమాదం లేకపోలేదు. పైగా స్త్రీలలో సెక్స్‌లో పతాకస్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్‌కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువస్థాయిలోనే కలిగే అవకాశం ఉంది. కదలికలు ఎక్కువ శాతం ఉండవు. కేవలం పురుషాధిక్యత కోసమే ఈ భంగిమ అని కొందరు స్త్రీవాదుల వాదనగానూ ఉంది.

పురుషుడు కిందవుండే భంగిమ...
ఇది దంపతులిద్దరికీ చాలా ఉత్తమమైన భంగిమ. ఈ భంగిమ ద్వారా స్త్రీకి వివిధ కామకేంద్రాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. స్త్రీ తన నియంత్రణ శక్తి ద్వారా తనకు ఏ మేరకు తృప్తి పొందవచ్చో ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకునే వీలుంది. ఎక్కువగా పురుషులలో శీఘ్రస్కలనం ఉన్నవారికి ఈ భంగిమ ఉత్తమమైనది. భార్యకన్నా భర్త అధిక బరువు ఉన్నా ఈ భంగిమ ఉపయుక్తంగా ఉంటుంది.

మోకాలు నొప్పి ఉన్నవారికి 'వి' భంగిమ...
స్త్రీ 'వి' ఆకారంలో పడుకుని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. నడివయసులో ఉన్నవారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి దివ్యౌషధం ఈ భంగిమ.

భావప్రాప్తి భంగిమ...
లూబ్రికేషన్‌ తక్కువ శాతం కలిగిన స్త్రీలకు అత్యంత తృప్తినిచ్చే భంగిమ ఇది. అయితే ఇందులో ఆలుమగల మధ్య సహకారం ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్‌ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుని శిష్నంను చేతితో తీసుకుని మృదువుగా మర్దిస్తుండాలి. ఇలాంటి భంగిమలు వయసుపైబడిన వారికి తృప్తికరంగా ఉంటాయి.

ఇప్పుడు చెప్పుకున్న భంగిమలు కొన్ని మాత్రమే. ఇటువంటి రొటీన్‌కు భిన్నంగా చేసుకునే భంగిమలతో షష్టిపూర్తి జరుపుకున్న దంపతులు కూడా నవదంపతుల తరహాలో సెక్స్‌లో వీరవిహారం చేస్తూ స్వర్గ సుఖాలు పొదవచ్చని వాత్సాయనుడు తన కామశాస్త్రంలో పేర్కొన్నాడు.