Tuesday, May 1, 2012

సేమియా చక్కర పొంగలి .......!








 పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు.   ఆ స్వీట్ ఏటంటే సేమియా పొంగల్ చాలా త్వరగా తయారయ్యే రుచికరమైన స్వీట్ సేమియా చక్కర పొంగలి.

కావలసిన పదార్ధాలు:-
సేమ్యా : 2cups
పెసరపప్పు: 3/4cup
బెల్లం తురుము: 2cups
పంచదార: 1/2cup
పాలు: 3cups
నెయ్యి : 1/2cup
యాలకుల పొడి: 1tsp
జీడిపప్పు: 8-10

తయారు చేసే విధానం:-

1. ముందుగా పెసరపప్పు కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.

2. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేయించి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో సేమ్యా వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.

3. తర్వాత వేగిన సేమ్యాలో కాగిన పాలు పోసి ఉడకనివ్వాలి. సేమ్యా ఉడికిన తరువాత ఉడికించిన పెసరపప్పు కూడా వేసి బాగా కలపాలి.

4. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన బెల్లం, పంచదార వేసి కలిపి ఉడికించాలి. బాగా దగ్గరయ్యేటప్పుడు యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి కలిపి దించెయ్యాలి.

5. ఇందులో పంచదార, బెల్లం ఎవరి రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. బౌల్ లోకి తీసుకుని వేయించిన జీడిపప్పు తో గార్నిష్ చేస్తే వేడి వేడి సేమ్యా చక్రపొంగలి సిద్దం.