Wednesday, May 2, 2012

రుచికరమైన పాల అరిసెలు.......!?








కావలసిన పదార్థాలు:-
 బియ్యం: 2cup
బెల్లం: 11/2మహజ
పాలు: సరిపడా
యాలకుల పొడి: 1tsp
నూనె: వేయించడానికి సరిపడా

 
తయారు చేయు విధానం: -
 1. అరసెలు చేయాలంటే బియ్యంను ఒక రోజు ముందుగానే నీటిలో నానబెట్టి పెట్టుకోవాలి. మరుసటి రోజూ బియ్యంలో నీళ్ళు వంపేసి తడిగానే పిండిని మిషన్ లో వేయించుకు రావాలి. కొద్దిగా చేసుకొనే వారు ఇంట్లో మిక్సీలో వేసుకొంటే సరిపోతుంది. 

2. తర్వాత బెల్లం తురిమి తడిపిండిలో వేసి పాలతో బాగా కరిగేలా కలపాలి. ఇది దోసెల పిండిలా చిక్కగా కలుపుకోవాలి. 


3. అందులోనే యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.


4. ఇప్పుడు పాన్ లో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో గరిటతో గట్టిపాల పిండి తీసుకొని దాన్ని వేడి నూనెలో అరెసలాగే వేసి బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించాలి. ఇవి ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. 


5. ఇవి చూడటానికి మామూలు అరిసెల్లాగే ఉంటాయి కాబట్టి ఇష్టం ఉన్నవాళ్ళు అందులో నువ్వులు, గసగసాలు వంటివి కూడా వేసుకోవచ్చు.