Wednesday, June 6, 2012

జామపండులో ఎన్నో ఔషధ గుణాలున్నాయట....!?






జామపండులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పండులో కార్పోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు లభిస్తుంది. విటమిన్ "సి" పుష్కలంగా లభిస్తుంది. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్ లాంటివి కూడా సమృద్ధిగా లభిస్తాయి. అలాగే దంతాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

ఇంకా... 

* లివర్ వ్యాధితో బాధపడేవారు తరచుగా జామపండును తినడం ఆరోగ్యకరం. జామపండు జీర్ణశక్తి పెంచుతుంది.

* శరీరంలోని అధికవేడిని తగ్గిస్తూ, చలువ చేస్తుంది.

* ప్రతిరోజూ ఒక మెత్తని జామపండు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

* జామపండు వాతాన్ని తగ్గిస్తుంది

* లేత జామ ఆకులను నమిలినట్లైతే పంటినొప్పి తగ్గుతుంది. లేత జామ ఆకుల కషాయాన్ని పుక్కిళించినట్లైతే పంటినొప్పి తగ్గుతుంది. లేత జామ ఆకుల కషాయాన్ని పుక్కిళిస్తే చిగుళ్ళవాపు, బాధ, తగ్గుతాయి.

* భోజనమైన తర్వాత కానీ, అల్పాహారం చేసిన తర్వాత కానీ మెత్తని జామపండును తినడం ఆరోగ్యకరం