Thursday, October 11, 2012

మీకు నాలుక చివరి భాగమున పుట్టుమచ్చ ఉందా..?










పురుషులకు నాలుక చివరి భాగమున పుట్టుమచ్చ ఉంటే.. ఆ వ్యక్తి చెప్పే విషయాలు ఫలించి తీరుతాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు. నాలుక చివరి భాగమున పుట్టుమచ్చ కలిగిన వారి నోటి మాట ఊరికే పోదు. ఇంకా ఆ వ్యక్తి అమిత మేధావంతుడుగా రాణిస్తారు.

అలాగే నాలుక పైభాగమున పుట్టుమచ్చ ఉన్న పురుషుడు గొప్ప ఉపన్యాసకుడు అవుతాడు. వారి మాటను పదిమంది మెచ్చుకుంటారు. నాలుక మీద ఎక్కడైనా పుట్టుమచ్చ ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి.

అలాగే మెడమీద పుట్టుమచ్చ గల పురుషులు ఎలాంటి కష్టనష్టాలనైనా అధిగమిస్తారు. శుభ్రతకు ప్రాధాన్యమిచ్చే వీరికి అదృష్టం వెన్నంటి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.