Friday, October 5, 2012

యోని మంటలు: నివారణ మార్గాలు....!?






రతిక్రీడలో కొంత మంది మహిళలు యోని మంటలతో విలవిలలాడడం పరిపాటి. పొడి మారడం వల్ల యోనిలో మంటలు పుట్టి తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతాయి. రతిక్రీడ సందర్భంగా యోనిలో ద్రావకాలు సరిగా ఊరకపోవడం వల్ల పొడి మారుతుంది. దీన్ని యోని డీహైడ్రేషన్ అని కూడా అంటారు. అయితే, ఈ సమస్యపై ఇతరులతో మాట్లాడడానికి మహిళలు బిడియపడుతుంటారు. ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని చిట్కాలు చూద్దాం.

చముర్లు వాడండి :-

పొడి యోని సమస్యను పరిష్కరించుకోవడానికి ఇది సాధారమైన పద్ధతి. సంయోగ క్రియ యోని మారడం వల్ల అసంభవంగా మారుతుంది. క్రీమ్స్, జెల్స్ వంటివాటిని వాడండి. ఇవి మార్కెట్లో సులభంగా దొరకడమే కాకుండా సెక్స్ చేసే సమయంలో మంటలను నివారిస్తాయి. అప్పటికప్పుడు అటువంటి చముర్లు లేకపోతే బాడీ లోషన్ వాడండి. బాడీ లోషన్ తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే పనికి వస్తుంది.

సుగంధాలను స్నానంలో వాడకండి :-

విపరీతమైన సుగంధాలను వెదజల్లే సబ్బులను లేదా ఇతర సుగంధ ద్రవ్యాలు స్నానం చేసేటప్పుడు వాడడం మానేయండి. స్నానం చేసిన తర్వాత శరీరం పరీమళాలతో సువాసనలను వెదజల్లాలనే కోరికను తగ్గించుకోండి. ఈ సుగంధ ద్రవ్యాలు తేమను శరీరం నుంచి, ముఖ్యంగా యోని నుంచి తొలగిస్తాయి. అందువల్ల యోని మంటల సమస్యను ఎదుర్కునేవారు స్నానం చేసేటప్పుడు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండడం మంచిది.

మంచినీళ్లు తాగండి :-

శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోవడం వల్ల కూడా యోని డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి తగినంతగా మంచినీళ్లు తాగండి. మంచినీళ్లే కాకుండా తరుచుగా జ్యూస్, కొబ్బరి నీళ్ల వంటివి తీసుకోవడం మంచిది.

డాక్టర్‌ను సంప్రదించండి :-

ఆ నివారణ మార్గాల ద్వారా కూడా సమస్య పరిష్కారం కాకపోతే డాక్టర్‌ను సంప్రదించండి. యోనిలో ఇన్‌ఫెక్షన్ వల్ల సాధారణ మార్గాల్లో మంటలు తగ్గకపోవచ్చు. అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. ఈ ఇన్‌ఫెక్షన్ శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల లేదా కండోమ్స్ వల్ల సంభవించవచ్చు.
పొడి యోని వల్ల మహిళలకు మంటలు పుట్టడమే కాకుండా పురుషుడికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. పురుషాంగం కూడా మంట పుడుతుంది.