Thursday, November 22, 2012

రోజూ పది గ్రాముల డార్క్ చాక్లెట్ తీసుకుంటే..!?






పది గ్రాములు వరకు చాక్లెట్లు తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందని యూరప్ ఆహార భద్రత సమాఖ్య అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోనే చాక్లెట్ల ఉత్పత్తిలో బారీ కల్లేబట్ అనే సంస్థ ప్రఖ్యాతి చెందింది. ఈ సంస్థ నుంచే నెస్లే, కోకో వంటి ఉత్పత్తులను సప్లై చేస్తోంది.

ఈ సంస్ధ యూరోపియన్ ఫుడ్ సేఫ్టి అథారిటీకి వద్ద సమర్పించిన నివేదికలో పది గ్రాముల డార్క్ చాక్లెట్‌ను రోజూ తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ క్రమబద్ధీకరించడంతో పాటు హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని ల్యాబ్ రిపోర్ట్ ద్వారా తేలినట్లు పేర్కొంది.

ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో చాక్లెట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదని తేలింది. ఇంకా కొన్ని అధికారిక పరిశోధనల్లో డార్క్ చాక్లెట్లలో వైద్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని తెలియవచ్చింది.

తాజాగా కల్లేబట్ నివేదికను పరిశీలించిన యూరోపియన్ ఫుడ్ సేఫ్టి అథారిటీ డార్క్ చాక్లెట్లతో ఒబిసిటికీ చెక్ పెట్టడంతో పాటు గుండె సంబంధిత రోగాలను కూడా నయం చేస్తోందని ప్రకటించింది.