Sunday, November 25, 2012

రతిక్రీడ ఇచ్చే అద్భుత ప్రయోజనాలు....! ?






రతిక్రీడలో దొరికేది ఆనందం ఒకటే అనుకునేవారికి మరో శుభవార్తగా అది అందించే అదనపు ప్రయోజనాలు ఎలా వుంటాయో కూడా చూడండి. రతిక్రీడలాచరించటం పెద్దలకు మంచిదే. ఆ రతిక్రీడలను రోజూ క్రమం తప్పకుండా ఆచరిస్తే మరీ మంచిది. లైంగిక చర్యలు మీకు మంచి నిద్ర పట్టించటమే కాదు, ఒత్తిడినుండి ఉపశమనం ఇస్తాయి. కేలరీలు ఖర్చు చేస్తాయి. తరచుగా రతి చేయడం వలన ఇంకా అనేక లాభాలున్నాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇటీవల చేసిన ఒక పరిశోధనలో వారానికి రెండు సార్లుపైగా చేసే రతి పురుషులలో నెలకొకసారి చేసే వారిలోకంటే కూడా గుండెపోటు తక్కువగా వచ్చే అవకాశాలుంటాయట.
నొప్పులు తగ్గిస్తుంది. రతి చేయటానికి తలనొప్పి అని చెపుతున్నారా? అవసరంలేదు. స్కలనం జరిగితే చాలు మీలోని ఆక్సీటోసిన్ అనే హార్మోను అయిదు రెట్లు అధికమైఎండోర్ఫిన్లను రిలీజ్ చేసి నొప్పులను, బాధలను దూరం చేస్తుంది.


రోగ నిరోధకత పెంచుతుంది. రతి క్రమం తప్పకుండా చేస్తే శరీరంలోని రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుంది. శరీరం ధృఢంగా వుండిజలుబు, జ్వరం వంటి ఏ వ్యాధి త్వరగా రాకుండా వుంటుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది. కుటుంబసమస్యలతో సతమతమవుతుంటే, ఒక్కసారి బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టి శ్రమించండి. మీ మూడ్ మార్చటమేకాదు, ఒత్తిడి తగ్గి అదివరకు కంటే కూడా సంతోషంతో సమస్యలు ఎదుర్కొంటారు.


జీవితకాలం పెంచుతుంది. స్కలనం జరిగితే, రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్లు మీలో రోగనిరోధకతను పెంచి కణాలను రిపేర్ చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి. వారానికి రెండుసార్లు స్కలించిన పురుషులు అధికకాలం జీవిస్తారని పరిశోధనలు చెపుతున్నాయి.


రక్తప్రసరణ అధికమవుతుంది. రతిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. మంచి రక్తం అన్ని అవయవాలకు, కణాలకు అందుతుంది. చెడు రక్తం తొలగించబడుతుంది.


నిద్ర ముంచుకు వచ్చేస్తుంది. రతిక్రీడ తర్వాత మీరు పోయే నిద్ర ఎంతో విశ్రాంతినిస్తుంది. మంచి నిద్రగల రాత్రి మిమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా వుంచుతుంది.


శారీరక ఫిట్ నెస్ అధికమవుతుంది. జిమ్ కు వెళ్ళ నవసరం లేదు. మీ ఫిట్ నెస్ మీ బెడ్ రూమ్ లోనే. అందులోనూ ఇద్దరికి కలిపి వచ్చేస్తుంది. శరీరంలో కొవ్వు కరిగి మంచి శారీరక రూపం ఏర్పడుతుంది. అరగంట చేసే రతిలో 80 కేలరీలు వరకు ఖర్చవుతాయట.


మీలోని ఈస్ట్రోజన్ మరియు టెస్టోస్టిరోన్ హార్మోన్ స్ధాయిలు పెరుగుతాయి. మీ కండరాలు, ఎముకలు మెరుగుపడి గుండె ఆరోగ్యంగా వుంటుంది. కొల్లెస్టరాల్ నియంత్రించబడుతుంది. మహిళలలో ఈస్ట్రోజన్ వారిని గుండెజబ్బులనుండి దూరం చేస్తుంది.