Thursday, August 15, 2013

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .....!







మిత్రులందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ! మన దేశాన్ని బ్రిటీషు పాలన నుండి విముక్తి చేయుటకు ఎందరో మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారు. వారందరిని ఎప్పటికి మనం మరచిపోకూడదు. ఈరోజు మనం స్వతంత్ర భారత దేశం లో హాయిగా ఉన్నాము అంటే అది వారి పుణ్యమే ! మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులకు, శత్రు దేశాలు మన దేశాన్ని ఆక్రమించకుండా సరిహద్దులో పోరాటం చేసి వీర మరణం పొందిన జవాన్లకు ఈ సందర్భంగా నివాళులర్పిద్దాం ! వారి నుంచి స్పూర్తి పొందుదాం !

మన భారత దేశానికి ప్రపంచంలోనే ఎంతో కీర్తి ఉంది. అన్నీ మతాలను, సంస్కృతులను సహనంతో అంగీకరించే పుణ్యభూమి మనది. ఎంతో మంది దండయాత్రలు చేసి మన సంపదను దోచుకుని, సంస్కృతిని నాశనం చేయాలని చూసినా మన భారత దేశంలో ఇంకా సంస్కృతి/ సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని కాపాడే బాధ్యత మనదే ! వేద భూమి, పుణ్య భూమి, కర్మ భూమి అయిన భారత దేశంలో పుట్టినందుకు గర్విద్దాం ! భారత దేశ కీర్తిని నలుమూలల చాటుదాం !

జై హింద్ ! భారత్ మాతా కి జై ! వందే మాతరం !