Thursday, February 10, 2011

భరణీ నక్షత్రమా..? అయితే స్త్రీలపై మోజు లేనట్లే నటిస్తారు.!







భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులు స్త్రీలపై మోజు లేనట్లే నటిస్తారని జ్యోతిష్కులు అంటున్నారు. ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు అందంగానూ, ఇతరులను కట్టి పడేసే ఆకర్షిత ఛాయను కలిగి ఉంటారు. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకోవడంలో భరణీ నక్షత్ర జాతకులు అందెవేసిన చేయి.


ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే నోటితో అంత కఠినంగా విమర్శిస్తారు. విలాస, అధునాతన వస్తువులను కొనుగోలు చేయడంలో ముందుంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలకే పెద్దపీట వేస్తూ.. తమ వైఖరిలో ఏ మాత్రం మార్పు తెచ్చుకోరు. దీనివల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించడానికి ఆటంకాలు ఎదురవుతాయి.


అందుచేత ఈ జాతకులు ప్రతి నిత్యం మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పూజ చేయడం వల్ల మంచి జరుగుతుందని జోతిష్య శాస్త్రం అంటోంది. ఇంకా.. వీరికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ కూడా వాళ్లపైనే ఎక్కువగా ఉంటుంది.


సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉండే వీరిని వాణిజ్యంలో భాగస్వాములుగా చేర్చుకునే వారికి మంచి ఫలితాలుంటాయి. అంతేగాకుండా భరణీ నక్షత్ర జాతకులు సలహాదారులుగా గొప్పగా రాణిస్తారు. అనేకుల జీవనాభివృద్ధికి సహకరించే ఈ జాతకులు వృద్ధాప్యంలో సుఖించడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించుకుంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.