Thursday, February 10, 2011

జ్యేష్ట నక్షత్రమా... శృంగారంపై మక్కువ ఎక్కువ







జ్యేష్ట నక్షత్రములో జన్మించిన జాతకులు తమ భాగస్వాములతో అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.


ఈ నక్షత్రపు అధిదేవత ఇంద్రుడు కావడంతో ఈ జాతకులు శృంగారంపై ఎక్కువ మక్కువ చూపుతారు. కొందరికి సంతాన నష్టం కలుగుతుంది. అయినప్పటికీ సంతాన ప్రాప్తికి, వంశవృద్ధికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.


ఇది బుధ గ్రహ నక్షత్రము కావడంతో తెలివితేటలుగా ప్రవర్తించే ఈ జాతకులు, చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి, లోపాలను ఎత్తుచూపుతారు. తమ రహస్యాలను కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. విమర్శలు సహించలేరు. ఎదుటివాళ్ళు సరదాగా చేసే వ్యాఖ్యలు కూడా తమను కించపరచడానికేనని భావిస్తారు.


తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందవేసిన చేయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోరు. సందర్భానుసారంగా అభిప్రాయాలను మార్చుకుంటారు. సాంకేతిక వైద్య విద్యలలో రాణించే వీరికి, విదేశాల పట్ల మోజు, విహారయాత్ర పట్ల ఆసక్తి ఉంటుంది.


విశేషమైన దైవభక్తి కలిగి ఉండే ఈ నక్షత్ర జాతకులు వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం చాలా బాగుంటుంది. నమ్మిన స్నేహితులు కూడా వీళ్ళని మోసం చేయాలని ఎదురు చూస్తుంటారు.


ఈ జాతకులు ప్రతి బుధవారం బుధగ్రహ భగవానుడిని నువ్వుల నూనె దీపం పెడితే ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్కులు అంటున్నారు. బుధవారం నవగ్రహాలను తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేసి పేదలకు అన్నదానం చేస్తే దోషాలు తొలగిపోతాయని వారు చెబుతున్నారు.