Friday, May 4, 2012

వెజిటేబుల్ మ్యాగీ మసాలా......!?








పిల్లలు మరియు పెద్దలు అతి ఇష్టంగా తినే ఫేవర్ డిష్ మ్యాగీ. ఇది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను లేదా సాయంత్రపు స్నాక్ గాను తింటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, స్కూల్ కు వెళ్ళే పిల్ల, టీనేజర్స్ ఎక్కువగా మ్యాగిని ఎక్కువగా ఇష్టపడుతారు. మ్యాగిని ముఖ్యంగా ఒంటరిగా జీవించే వారు ఎక్కువగా చేసుకొంటుంటారు. ఎందకంటే అతి సులభంగా త్వరగా తయారయ్యేది బ్రేక్ ఫ్యాస్ట్, లచ్, డిన్నర్, స్నాక్ గా రుచికరంగా ఉండేది మ్యాగీయే కదా...మరి కొంచెం వెరైటీగా వెజిటేబుల్ మిక్స్ చేసి మీరు కూడా తయారు చేసి చూడండి...

కావలసిన పదార్థాలు:-

మ్యాగీ: 2packets(200grms)
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
క్యాప్సికమ్: 1(కట్ చేసినవి)
క్యారెట్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
టమోటో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పన్నీర్: 3-4(చిన్న ముక్కలు)
పచ్చిమిర్చి: 4-5(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
అల్లం: చిన్న ముక్క(తురుముకోవాలి)
జీలకర్ర: 1/2tsp
ఓరిగానో: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tsp
నీళ్ళు: 2cups


తయారు చేయు విధానం:-

1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడయ్యాక, అందులో జీలకర్ర వేసి వేయించాలి.


2. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, వెల్లులిపాయలు వేసి రెండు నిముషాల పాటు వేగనివ్వాలి.


3. ఇప్పుడు అందులోనే క్యాప్సికమ్ మరయు క్యారెట్ ముక్కలు వేసి ఐదు నిముషాల పాటు మీడియం మంట మీద వేయించుకోవాలి.


4. తర్వాత అందులోనే పన్నీర్ ముక్కలు, పచ్చిమిర్చి మరియు టమోటో వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఓరిగానో వేసి ఉడికించాలి. సరిపడానీళ్ళు పోసి మరగనివ్వాలి.


5. అంతలోపు ప్యాకెట్ లోని మ్యాగీని తీసి పొడి పొడిగా లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దాన్ని మీద మ్యాగీ మసాలా(మ్యాగీప్యాకెట్ తో పాటు ఇచ్చిఉంటారు)ను చిలకరించాలి.


6. ఇప్పుడు ఈ మ్యాగీని వెజిటేబుల్ ఉడుకుతున్న పాన్ లో వేసి మీడియం మంట మీద రెండు నిముషాల పాటు ఉడికించాలి. నీరుంత చిక్కబడి మ్యాగీ రెడీ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే వెజిటేబుల్ మ్యాగీ మసాలా రెడీ...దీన్ని టమోటో కెచప్ తో వేడి వేడి గా సర్వ్ చేయాలి..