Monday, July 9, 2012

శుభకార్యాలలో మామిడి ఆకులను ఎందుకు ఉపయోగిస్తారు..!?







పెద్దలు ముత్తైదువలను "దీర్ఘసుమంగళీ భవ" అని ఆశీర్వదిస్తుంటారు. వివాహమైన మహిళలు సౌభాగ్యాలతో, సుమంగళీగా వర్ధిల్లాలనే ఉద్దేశంతోనే ఈ ఆశీర్వచనంతో పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. ఓ మహిళకు నిండుతనాన్ని ఇచ్చేది మాంగళ్యం. అలాంటి మహిమాన్వితమైన మాంగళసూత్రాన్ని ఏ రోజు పడితే ఆ రోజు జ్యుయెల్లరీ షాపుల్లో కొనడం సరికాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వధువుకు స్వాతి నక్షత్రంతో కూడిన రోజున మంగళసూత్రం తీసుకుంటే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. మాంగళ్యాన్ని స్వాతి నక్షత్రంతో కూడిన రోజున చేయిస్తే లేదా కొనుగోలు చేస్తే ఆ వధువు సకల సంతోషాలతో, దీర్ఘసుమంగళిగా వర్ధిల్లుతుందని పురోహితులు చెబుతున్నారు.

మాంగళ్యం మాత్రమే గాకుండా స్వాతి నక్షత్రంతో కూడిన శుభదినాన శంకుస్థాపన, గృహప్రవేశం వంటి శుభకార్యాలను చేయడం మంచిదే. స్వాతి నక్షత్రంతో కూడిన రోజున శుభకార్యాలను జరుపుకుంటే సుఖమయ జీవితం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత సమాచారం