Wednesday, August 1, 2012

మళ్ళీ మళ్లీ తినాలనిపించే వెజిటేబుల్ సమోసా.......!?









ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా.. చల్లగా కాదు చలిచలిగా ఉండి.. వేడి వేడిగా ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తుంటుంది. లేదా వేడి వేడి మసాల ఛాయ్ తాగాలనిపిస్తుంది. వర్షకాలంలో ఇటువంటి ఆలోచనలు రావడం సహజం అంతే కాదు వీటిని తీసుకొని వర్షాకాలంలో బద్దకాన్ని వదిలి రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది.


ముఖ్యంగా వర్షాకాలంలో వేడి వేడిగా తయారు చేసుకొనేవి, సమోసాలు లేదా పకోడా. మరి ఈ వర్షాకాలంలో ఒక స్పెషల్ సమోసా తినాలిపిస్తుంటే.. ఈ వెరైటీ వెజిటేబుల్ సమోసా తయారు చేసి తింటూ వర్షంలో ఎంజాయ్ చేయండి...

కావలసిన పదార్థాలు:

బంగాళదుంప: 3-4(ఉడికించి పొట్టుతీసి, చిదిమి పెట్టుకోవాలి)
క్యాబేజ్: 1cup(చిన్న తరిగి ఉడికించుకోవాలి)
పన్నీర్: 50grms(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్: 1/2cup(చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించినవి)
పచ్చిబఠానీ: 1/2cup(ఉడికించినవి)
పచ్చిమిర్చి: 6-8(చిన్నగా కట్ చేసినవి)
జీడిపప్పు: 5-6
గరం మసాలా: 1tsp
ఆంచూర్(డ్రై మ్యాంగో పౌడర్): 1/2sp
ఉప్పు: రుచికి సరిపడా


పిండి కలుపుకోవడానికి:
మైదా: 2cups
నూనె: 3cups
ఉప్పు: చిటికెడు
జవైన్: 1/2tsp(అవసరమైతేనే)
నీళ్ళు: 2cups


తయారు చేయు విధానం:

1. ముందుగా పెద్ద బౌల్ తీసుకొని అందులో పిండకి తీసుకొన్న పదార్థాలన్నింటినీ వేసి, నీళ్ళు చేర్చి చపాతీ పిండిలా మృధువుగా కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాత పిండి మీద తడి వస్త్రం కప్పి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.


2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పొటాటో, క్యాప్సికమ్, క్యాబేజ్, పచ్చిబఠానీ, మరియు పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా కలుసుకోవాలి.


3. అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా చిలకరించి, గరం మసాలా, ఆంచూర్ అన్ని వేసి మరికొంచెం మృదువుగా కలుపుకోవాలి. స్టఫింగ్ మసాలా మరికొద్దిగా కారంగా ఉండాలనుకొంటే అందులోనే కారం పొడిని వేసి మిక్స్ చేసుకోవచ్చు.


4. తర్వాత ముందుగా కలిపి పెట్టుకొన్న చపాతీ పిండిని కొద్దికొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చపాతీలా వత్తకొని మద్యకు కట్ చేసి డైమండ్ షేప్ లో మడచుకోవాలి.


5. తర్వాత అందులో ముందుగా తయారు చేసుకొన్ని స్టఫింగ్ మసాలా ఒకటి లేదా ఒకటిన్న చెంచా పెట్టి అంచులను మడిచి నూనె లేదా నీటితో అంచులను పూర్తిగా కవర్ అయ్యేలా వత్తుకోవాలి. లేదంటా లోపల ఉన్న మిశ్రమం బటకు వచ్చి నూనె అంతా పాడవుతుంది. ఇలా అన్ని తయారు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.


6. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌమీద పెట్టి అందులో సరిపడా నూనె వేసి బాగా కాగిన తర్వాత మంట తగ్గించి అందులో చుట్టిపెట్టుకొన్న సమోసాను ఒక్కొక్కటే నూనెలోకి విడవాలి. నూనెలో బాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ సమోసా రెడీ. దీన్ని టమోటో కెచప్ లేదా చిల్లీ సాస్ తో ఒక కప్పు టీ లేదా కాఫీతో సర్వ్ చేయండి కూల్ కూల్ ఈవెనింగ్ ను ఎంజాయ్ చేయండి...