Monday, October 8, 2012

బుధగ్రహాధిపత్యంలో జన్మించిన జాతకులైతే..?







బుధగ్రహాధిపత్యంలో జన్మించిన జాతకులు ఆధ్యాత్మిక ధ్యాసను కలిగి ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా విజ్ఞానం, కావ్యరచన, జ్యోతిష్య రంగాల్లో రాణిస్తారు. శాంత స్వభావం, విష్ణుభక్తి, సుందర స్వరూపం, పెద్దల పట్ల మర్యాద, నాటకములు, రజోగుణాన్ని కలిగి ఉంటారు. బుధగ్రహ నాయకుడైన బుధుడు ఆకుపచ్చ రంగు పట్ల ప్రీతిని కలిగి ఉంటాడు.

అంతేకాకుండా బుధగ్రహాధిపత్యంలో జన్మించిన జాతకులు ఎల్లప్పుడు స్థిర నిర్ణయంలో ఉంటారు. సత్య ప్రవర్తన, వినయం వంటి గుణాలను కలిగి ఉంటారు. దీనితో పాటు పుస్తకములు రాయడం, వేదాంతం, గుమాస్తా ఉద్యోగాల్లో స్థిరపడతారు. కొందరు న్యాయవాదులుగా ఉంటారు.

ఇకపోతే.. న్యాయానికి ప్రాణాన్ని ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉండే వీరు ఇతరుల సలహాలను సూక్ష్మంగా గ్రహిస్తారు. అయితే ఇతరులు ఇచ్చే సలహాల్లో మంచి చెడులను ఆలోచించి వాటిని పాటిస్తారు. బుధగ్రహాధిపత్యములో పుట్టిన జాతకులు ఆకుపచ్చ రంగులను కలిగిన దుస్తులను ధరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.