Monday, October 8, 2012

గ్రహణం సమయంలో భోజనం చేయకూడదా...?








గ్రహణం  సమయంలో ఆహార పదార్థాలు తీసుకోకూడదని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెపుతున్నారు. గ్రహణ సమయంలో సూర్యరశ్మి నుంచి విషపూరితమైన కిరణాలు వస్తాయి కనుక ఆ పదార్థాలను భుజించకూడదు.

సంక్రాంతి పండుగ రోజు కావడమే కాక, సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ గ్రహణం చోటుచేసుకుంటున్నందువల్ల దోషపూరితం అని జ్యోతిష శాస్త్రవేత్తలు అంటున్నారు. పంచభూతాలలో ఒకటైన వాయువు గ్రహణ సమయంలో విషపూరితమవుతుంది కనుక ఆ సమయంలో భోజనం చేయకూడదని జ్యోతిష శాస్త్రజ్ఞులు చెపుతున్నారు.

గ్రహణ సమయంలో ఈశ్వర ఆరాధన చేయడం వలన దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ముగిసిన తర్వాత వెండి నాగదేవత ప్రతిమకు పూజ చేసి బ్రాహ్మణులకు దానాది కార్యక్రమాలను చేస్తే గ్రహణం వలన కలిగి దుష్ఫలితాలను తగ్గించుకొనవచ్చు.