Tuesday, October 9, 2012

మీకు కుడికంటిలో పుట్టుమచ్చ ఉందా..?!







కుడికంటిలో పుట్టుమచ్చగలిగిన పురుషుడు అనుకోని ఆస్తులు అందుకుంటాడు. తలంచుకొనని భోగాలను అనుభవిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నాపు. ఆ మచ్చ నల్లగుడ్డికి కుడిభాగమున ఉన్నతో ఆ వ్యక్తి గొప్ప ధనవంతుడవుతాడు. మిత్రుల వల్ల సుఖమును కీర్తిని సంపాదిస్తాడు.

ఇదే మచ్చ నల్లగుడ్డునకు ఎడమ భాగమందు ఉంటే ఆ పురుషుడు విజయసౌశీల్యాది గుణములు కలిగివుంటాడు. మొత్తము మీద కుడికంటిలో పుట్టుమచ్చ ఎక్కడవున్నా సౌఖ్యమును, ధనమును, కీర్తిని కలుగజేస్తుంది.

అలాగే కుడికంటి రెప్పమీద మచ్చయున్నచో ఆ వ్యక్తికి అతిశయం ఎక్కువగా ఉంటుంది. కాని ఆనందమయ జీవితాన్ని గడుపుతాడు. అమిత భాగ్యభోగ్యములను అనుభవిస్తాడు. దైవశక్తితో పుణ్యకార్యములు చేయడంలో ముందుంటారు.

ఇంకా కుడికంటి రెప్ప లోపలి భాగమున పుట్టుమచ్చగలవారు ధనధాన్య సమృద్ధి కలిగియుందురు. అధిక సంఖ్యలో సేవకులను కలిగి వుండే వీరికి వాహన సౌఖ్యము కలుగునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.