Tuesday, October 9, 2012

మీకు నవగ్రహదోషముందా? ఐతే 9సార్లు ప్రదక్షణ చేయండి?






దేవాలయాల్లోని నవగ్రహాల చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేయడం పరిపాటి. అయితే నవగ్రహ దోషమున్నవారు మాత్రమే నవగ్రహాలను తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేసుకోవాలని, మిగిలిన వారు ఒక్కసారి ప్రదక్షణ చేసుకుంటే సరిపోతుందని పురోహితులు అంటున్నారు.

ఇంకా "ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ నవగ్రహాలను ఒక్కసారి ప్రదక్షణ చేసుకుంటే చాలునట. అయితే తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేసినా మంచిదేనని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే మీ జాతకం ప్రకారం ఏ గ్రహ ప్రభావం మీపై ఉందనే విషయాన్ని తెలుసుకుని, ఆ గ్రహానికి అనుకూలమైన పూజలు చేయడం, మంత్రాలు పఠించడం శ్రేయస్కరం. నవగ్రహ ప్రభావంలో ఏ గ్రహదశ మీపై ఉందనే విషయాన్ని తెలుసుకుని, ఆ గ్రహానికి అధిపతి అయిన భగవానుడిని పూజించడం ద్వారా మంచి జరుగుతుందని విశ్వాసం.

ఇందులో శనిగ్రహాన్ని గురించి చెప్పాలంటే..? శనివారం పూట నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా ఈతిబాధలు దూరమవుతాయి. ఇదేవిధంగా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఏలినాటి శని, అష్టమ శని, శని దశాకాలంతో ఏర్పడే అశుభ ఫలితాలను శనివారం శనీశ్వరునికి చేసే పూజ ద్వారా తప్పుకుంటాయని పురోహితులు సూచిస్తున్నారు.