Sunday, October 7, 2012

మూడో తేదీన పుట్టారా? ఐతే ఒంటరితనం అంటే ఇష్టపడరట!







మూడవ తేదీన పుట్టిన జాతకులకు తీవ్రంగా శ్రమించి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మూడవ సంఖ్య బృహస్పతికి సంబంధించినది. అందుచేత ఈ సంఖ్యలో పుట్టిన జాతకులు ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చడంలో వెనుకడుగు వేయరు. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

ఎప్పుడూ బిజీబిజీగా కనిపించే ఈ జాతకులు ఆధ్యాత్మికం, కళలపట్ల ఆసక్తి కలిగివుంటారు. వీరికి స్నేహితులు, బంధువుల వలయం ఎక్కువ. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడరు. పెద్దలను గౌరవించడం, ఇతరులను ఆప్యాయంగా పలకరించడం వీరినైజం. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటు వారికి తమ వంతు సహాయం చేస్తారు.

కుటుంబ సభ్యుల ఆనందాన్ని కోరుకునే ఈ జాతకులు, మతపెద్దలుగా, పురోహితులుగా, ప్రొఫెసర్లు, బ్యాంకర్స్, సైంటిస్టులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌, నటులుగా రాణిస్తారు. కానీ అత్యాశ పడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సుఖవంతమైన జీవితం గడుపుతారని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇక మూడవ సంఖ్యలో జన్మించిన జాతకులకు కలిసి వచ్చే సంఖ్యలు : 1, 2, 9
కలిసిరాని సంఖ్యలు : 5, 6
అదృష్టాన్నిచ్చే రోజు : గురువారం
అనుకూలించే రంగు : పసుపు
అదృష్ట రత్నం : ఎల్లో సప్పైర్ లేదా టోపాజ్
వాణిజ్యానికి, వివాహానికి 3, 5, 6, 7, 9, అనే సంఖ్యలు అనుకూలిస్తాయి. ఇంకా మూడవ సంఖ్యలో జన్మించిన జాతకులు బంగారు వస్తువులు ధరించడం ఉత్తమమని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.