Tuesday, October 9, 2012

గడ్డము మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతుడవుతారట..!







పురుషులకు గడ్డము మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతుడవుతారట. ఇతరులను ఆకర్షించే ఛాయ, వాక్చాతుర్యాన్ని కూడా కలిగివుంటారట. చాలా కీర్తివంతుడవుడు కూడా అవుతాడు.

అలాగే గడ్డమునకు కుడిభాగమున పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది. ఇంకా పదిమందిచేత మంచివాడనిపించుకుంటాడు. అయితే ఆ మచ్చే గడ్డమునకు ఎడమవైపు ఉంటే మాత్రం విద్యావిహీనుడవుతాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అలాగే గడ్డమునకు కుడి, ఎడమ వైపుల గాకుండా గడ్డమునకు మధ్యగా పుట్టుమచ్చ ఉంటే మంచి ఫలితాలనిస్తుంది. గడ్డమునకు మధ్యగా పుట్టుమచ్చ కలిగిన వ్యక్తి ధనవంతుడయి న్యాయంగా ప్రవర్తించుకొంటాడు. ఇంకా గడ్డమునకు కిందిభాగమున పుట్టుమచ్చ వున్నచో సంగీత సాహిత్యముల్లో గట్టివాడవుతాడని పురోహితులు చెబుతున్నారు.