Thursday, November 15, 2012

కుమారస్వామి ఆలయాన్ని ఆరుసార్లు ప్రదక్షణలు చేస్తే..!?








కుమార స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు. కృత్తికా అనేది ఆరువారాలతో కూడిన నక్షత్రమండలం. ఈ కారణంగా కృత్తికా నక్షత్రంలో పుట్టిన కుమార స్వామిని షణ్ముఖుడని పిలుస్తారు. ఇందులో "షట్" అనే శబ్ధం శత్రు, రోగ, రుణ విమోచనాత్మకం అని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కుమారస్వామి ప్రత్యేక ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆయన ఎదురుగా వున్న మయూరవాహనం నుంచి ప్రారంభించి ముందుగా ఆరు ప్రదక్షణాలు చేయాలి.

ఇలా చేయడం వలన భక్తులకు వుండే అనారోగ్యం, అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆరు ప్రదక్షణల అనంతరం స్వామిని స్తుతించి మరలా విడిగా మరొక సారి ప్రదక్షణ చేయాలి. ఇలా చేసినట్లైతే నిరుద్యోగులకు ఉద్యోగలాభం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి.

అలాగే కుమార స్వామికి షష్టి తిథి, కృత్తికా నక్షత్రమన్నా చాలా ఇష్టమట. ఇంకా వారముల్లో మంగళవారం ప్రీతికరమైనరోజు. కృత్తికానక్షత్రం రోజున పాము పుట్టకు నాగమూర్తి ప్రతిమలను పుట్టపై విడిచి, పాలు, కోడిగుడ్డును నైవేద్యంగా సమర్పించితే సంతాన సర్పదోషాలు, వంధ్యా దోషాలు, అవివాహితులకుండే కుజదోషాలు నివృత్తి అవుతాయి. గర్భంధరించని వివాహితులకు గర్భధారణ కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.