Thursday, November 15, 2012

పెసర పప్పు పొంగలిని ఏ దేవునికి నైవేద్యంగా పెట్టాలి!?







పొంగలిని శ్రీ సూర్య నారాయణ దేవునికి నైవేద్యంగా పెడితే మీ కంటి దోషాలు, హృదయానికి సంబంధించిన వ్యాధులు, చర్మవ్యాధులు త్వరగా నయం అవుతాయి. శ్రీ దుర్గాదేవికి పూజ చేసి పొంగలి నైవేద్యంగా పెడితే ఇంట్లో టెన్షన్, టార్చర్, స్ట్రెస్, మెంటల్ వర్రీ, హై బీపీ, క్లాషెస్, అంతర్గత గొడవలు, మహిళలకు సంబంధించిన వ్యాధులు రజస్వల రోగాలు, గర్భకోశ రోగాలు, ఉదర సంబంధిత సమస్యలు చాలా త్వరగా తగ్గిపోతాయి.

శ్రీ మహా గణపతికి పొంగలి నైవేద్యంగా పెడితే మీ అన్ని పనులు సులభంగా జరిగిపోతాయి. శ్రీ సుబ్రహ్మణ్యదేవునికి పొంగలి నైవేద్యంగా పెడితే భర్త, భార్య, పిల్లల మధ్య ఉండే గొడవలు నిలిచిపోతాయి. శ్రీలక్ష్మీ నారాయణ దేవునికి పొంగలి నైవేద్యంగా పెట్టి పూజ చేసేవారికి అన్ని పాపాలు తొలగిదేవునిపై భక్తి పెరుగుతుంది. తలచిన పనులు నెరవేరుతాయి.

శ్రీ బుధ గ్రహానికి పెసరపప్పు పొంగలి నైవేద్యంగా చేసి ప్రసాదాన్ని పంచి వారు కూడా తింటే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. శ్రీ సరస్వతి దేవికి పొంగలి నైవేద్యంగా పెట్టి పిల్లలకు పంచి తాముకూడా తింటే విద్యాభ్యాసంలో ఎటువంటి సమస్యలు లేకుండా, ఉత్తమ జ్ఞాపక శక్తితో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు.

రాధాకృష్ణ దేవునికి పొంగలి నైవేద్యంగా పెట్టి పశువులకు లేగ దూడలకు ప్రసాదం పెట్టి మరియు తాగేందుకు నీటిని ఇచ్చి తాము కూడా ప్రసాదాన్ని తింటే వివాహ సమయంలో వచ్చే అన్ని సమస్యలు తొలగిపోతాయి.

శ్రీ సత్యనారాయణ దేవునికి పొంగలి నైవేద్యం పెడితే అన్నిరకాల సమస్యలు తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మిదేవికి పొంగలి నైవేద్యం పెట్టి సుమంగళులకు పానకం తాంబూల దానం చేస్తే రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.