Friday, November 16, 2012

మహాశివరాత్రి రోజున శివుడికి సమర్పించాల్సిన పుష్పాలు...!








ముక్కంటికి ఏ ఒక్క పువ్వునైనా మనస్ఫూర్తిగా, భక్తితో సమర్పించిన భక్తులకు 80 కల్పాల వరకు దుర్గతి కలగదని పురాణాలు చెబుతున్నాయి. పెరటిలో పూసిన పూలు పూజిస్తే శాశ్వతంగా శివసన్నిధిలో నివాసం లభిస్తుంది. శివునికి అడవిలో పూచిన పూలంటే అమితమైన ఇష్టం. శివునకు సమర్పించే ఏ పువ్వుకైనా తొడిమ తప్పకుండా ఉండాలి.

ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజున బిల్వదళములతో శివుణ్ణి పూజించినట్లైతే కైలాసవాసం లభిస్తుంది. అలాగే దర్భపూలతో పూజిస్తే స్వర్ణలాభం కలుగుతుంది.

తెల్లని మందారాలతో అర్చిస్తే అశ్వమేధం చేసిన ఫలం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజున తామరలతో శివుడిని పూజిస్తే పరమపదగతి కలుగుతుంది. అలాగే గన్నేరుపూలు శివునకు ఏ సమయంలోనైనా సమర్పించవచ్చు. మల్లెలను రాత్రిపూట, జాజిపూలను మూడోవజామునందు ఈశ్వరునకు సమర్పిస్తే శుభఫలితాలుంటాయి.

అలాగే శివుడిని మహాశివరాత్రి రోజున ఎలా దర్శించాలంటే..!

ముందుగా గణేశుని, ఆ తర్వాత శివునిని అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరుని, చివరిగా పార్వదేవిని దర్శించాలి. శివదర్శనం కూడా ఆషామాషీగా నంది వెనుక నిలబడి చేయరాదు.

నందీశ్వరుడి కుడిచెవి వద్ద మీ ముఖాన్ని వంచి ఎడమచేసతి చూపుడు బ్రొటన వేళ్ళతో నందీశ్వరుని చెవులపై అర్థవృత్తంలో వుంచి కుడిచేతిని నందీశ్వరుని పృష్టం లేదా ఫచ్చభాగములో (తోక) అరచేయి మొత్తం అనేలా ఉంచి, నంది కుడిచెవిలో ముమ్మార్లు., నందికేశా శివదర్శనం కోరుతున్నాను అనుగ్రహించు స్వామి అని చెబుతూనే ఎడమచేతి అర్థవృత్తంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశం గుండా శివలింగాన్ని దర్శించాలి.

ఇలా చేస్తేనే శివ లింగదర్శనం అవుతుంది. కానీ నేరుగా స్వామిని వీక్షించినది దర్శన ఫలాన్ని ఇవ్వదని పురోహితులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రదక్షణ చేసే ముందు పనవట్టధార బయటకు వెళ్లే ప్రదేశం నుంచే ప్రదక్షణను ప్రారంభించడం మర్చిపోరాదు. గణేశ ఆలయం ప్రత్యేకించి వుంటే మూషికవాహనం వద్ద నుంచి ప్రదక్షణ ప్రారంభించాలి.