Monday, March 25, 2013

ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... అందిరి దిష్టి.... !?








ఎవరివంకైనా అదే పనిగా ఎవరైనా చూస్తే... 'దిష్టి తగులుతుంది... అలా చూడకు' అంటారు. అంతేకాదు ఏదైనా ఊరి ప్రయాణం చేసి వచ్చినవారు దిష్టి తీయించుకుంటూ ఉంటారు. ఈ దిష్టి తీయటం అనేది మన పూర్వీకులు ఎప్పటినుంచో అనుసరిస్తున్న పద్ధతి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో దిష్టి ఎలా తీయాలన్నదానిని గురించి పెద్దలు ఇలా చెపుతారు.

దిష్టి తీసేటపుడు పిల్లల వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు దిష్టి తీయకూడదు. పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత కర్పూరం బిళ్ల వెలిగించి పై నుంచి క్రిందికి తిప్పి కర్పూరం వెలుగుతూ ఉండగానే బయటవేసేయాలి.

పెద్దవారు బయటనుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను తాకకూడదు. కాళ్లు చేతులు కడిగిన తర్వాత పిల్లలను దగ్గరకు తీసుకోవచ్చు. అదేవిధంగా అర్థరాత్రి, మిట్టమధ్యాహ్నం పిల్లలను బయట తిప్పకూడదు. నల్లటి కాటుకతో పెట్టే చుక్క దుష్ట శక్తులను ఇంటిలోనికి ప్రవేశించనీయదని విశ్వాసం కనుకనే చిన్నపిల్లలకు అరికాలిలో కాటుకతో నల్లని దిష్టి చుక్కను పెడతారు.