Monday, April 1, 2013

భోజనానికి లేవండి...!?







అన్నాదస్య మనుష్యస్య బలయోజోతుశాంశచ
కీర్తించ వర్థతే శస్వతత్రిషు లోకేషు పార్థివ


అన్నదానం వలన మూడు లోకాలలో కీర్తి, యశము, తేజస్సు బలం ప్రాప్తిస్తాయని అన్నారు. ఏదైనా న్యాయ మార్గంలో ఎక్కువగా అన్నసముపార్జన చేయాలి. ఆకలితో ఎవరైనా వస్తే... కులమత ప్రశ్న లేకుండా భోజనానికి రండి, వంట సిద్థంగా ఉన్నది అని చెప్పడం ఋషుల పద్ధతి. ఆనాడు వారు పాటించిన పద్ధతులనే మనకు ఓ వ్రతం వలె అందించారు.

మారుతున్న సమాజానికి తగ్గట్లు సంభాషణలు కూడా మారుతున్నాయి. భోజనానికి రండి అని పిలవడానికి బదులుగా భోజనం చేస్తారా...? అన్నం తింటారా...? అని కొందరు అమాయకంగా అడుగుతుంటారు. అలా కాక " భోజనానికి లేవండి" అని ఆకలితో వచ్చినవారిని ఆహ్వానించాలంటుంది శాస్త్రం. ఇలా నిర్మలమైన హృదయంతో అన్నదానం చేసినవారి ఇంట ఆహారలేమి సమస్య ఎట్టి పరిస్థితిలోనూ ఎదురవదు.