Sunday, April 7, 2013

దిష్టి తగులుతుందేమో... జాగ్రత్త....!?






దిష్టి... దీనిని విశ్వసించని వారంటూ లేరని చెపితే అతిశయోక్తి కాదేమో. దిష్టి తగలకుండా ఉండేందుకు మన పెద్దలు రకరకాల విధానాలను చెప్పారు. వాటిలో కొన్నింటిని ఒకసారి చూద్దాం...

కొత్తగా ఇంటిని నిర్మించిన తర్వాత ఖచ్చితంగా దిష్టి బొమ్మను పెట్టాలి. బజారులో దొరికే రాక్షసుని తలకాయ( దిష్టి బొమ్మ)ను ఇంటి ముందు భాగంలో తగిలించాలి. అలాగే నిర్మాణంలో ఉన్న ఇళ్లకైతే దిష్టి బొమ్మను గడ్డితో మనిషి ఆకారంలో తయారు చేసి అందరికీ కనిపించేలా భవనం పైభాగంలో వేలాడదీయాలి.

అదేవిధంగా ఇంటి లోపలికి వచ్చే ప్రధాన ద్వారంపైన లోపలివైపు గోడపైన లక్ష్మీదేవి చిత్ర పటాన్ని ఉంచండి. మనం బయటకెళుతున్నప్పుడు లక్ష్మీ దేవి లోపలికి వస్తుందని విశ్వాసం. ఇంటివెనుక ఆంజనేయ స్వామి బొమ్మ ఉంచాలి. హనుమంతుడు తన తోకతో దుష్ట శక్తులను చుట్టి విసిరివేస్తాడు. అలాగే వాకిలి వద్ద గణపతి ఫోటోను ఉంచండి. గణపతి తన తొండముతో శక్తులను విసిరికొడతాడు.