Wednesday, October 30, 2013

దీపావళి: తులసీకోట ముందు తొలుత దీపాలు వెలిగిస్తే....!?






దీపావళి నాట ఏ ఇంట సమృద్ధిగా దీపాలు వెలుగుతాయో.. ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీ దేవి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి పుణ్యదినమైన దీపావళి రోజున సాయం సంధ్యాకాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు తొలుత దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయి.

శ్రీమహాలక్ష్మి అష్టోత్తరశతనామాలతో, సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వసంపన్న శక్తివంతురాలుగా భావించి, నివేదన చేసి, పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయటం వల్ల కాలి అందియలు ఘల్లుఘల్లుమని మహాలక్ష్మి ఇంట ప్రవేశిస్తుందని ఐతిహ్యం.

అందుచేత దీపావళి రోజున శుచిగా స్నానమాచరించి పూజాకార్యక్రమాలు పూర్తి చేసి, దీపాలు తప్పకుండా వెలిగించాలని పురోహితులు అంటున్నారు. ఇంకేముంది.. దీపావళి రోజున దీపాలంకరణతో లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోండి..... మరి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.