Thursday, January 5, 2012

తాబేళ్లు ఇంట్లోకి ప్రవేశిస్తే అనర్థమా.....!?






ఇళ్ళల్లో చేపలు పెంచడంతో పాటు ప్రభుత్వం అనుమతిస్తే నక్షత్ర తాబేళ్లను కూడా పెంచవచ్చు. కానీ మీ ఇంట్లో మీకై మీరు తాబేళ్లను పెంచడంలో తప్పులేదు. అయితే తాబేలు దానంతట అదే ఇంట్లోకి ప్రవేశిస్తే మాత్రం అపశకునమే అంటున్నారు జ్యోతిష్యులు. అలా తాబేలు మీ ఇంట్లోకి వస్తే ఏదో అనర్థం జరుగనుందనే విషయాన్ని చెప్పేందుకే వస్తుందని గమనించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

విష్ణు భగవానుడి దశావతారంలో రెండోది కూర్మావతారం. కూర్మం తాబేలు ప్రతిరూపమే అవుతుంది. తాబేలు తనను ఎవరూ ఎదురించలేని రీతిలో తనకు తాను రక్షణను కలిగివుంటుంది. అన్నీ జంతువులు వర్షం కురిస్తే చినుకులు పడని ప్రదేశానికి వెళ్లి తలదాచుకుంటాయి. అయితే తాబేలు మాత్రం ఇందుకు విరుద్ధం.

తన చర్మాన్ని పైకప్పులో దాచుకుని అలాగే ఉండిపోతుంది. శరీరాన్ని గూడుగా మలుచుకునే తాబేలు ఎన్నో సమస్యలను ధీటుగా ఎదుర్కొంటుంది. అందుచేత ఇళ్లళ్లో తాబేళ్లను మీరే పెంచుకుంటే ఏమీ కాదు. కానీ అదే ఇంటిలోకి ప్రవేశిస్తే అనర్థాలు, సమస్యలు తప్పవు. ఏదైనా ఓ గృహంలోకి తాబేలు ప్రవేశిస్తే వారి జీవితంలో పురోగతి ఉండదు.

అంతేకాదు.. తాబేలు ప్రవేశించిన వెంటనే ఆ ఇంటిలో నివసించే వారికి ఇబ్బందులు తప్పవు. ఇంకా ఆ ఇంటి యజమాని ఆ గృహాన్ని ఖాళీ చేసి మరో ఇంటికి వెళ్లడం చేయాలని జ్యోతిష్య నిపుణుల మాట. అయితే అదే ప్రాంతంలో ఉంటే మాత్రం ఇక్కట్లు అధికం. అందుకే తాబేలును అపశకునమే అని చెప్పాలి. మొత్తానికి ఇంట్లోకి తాబేలు ప్రవేశిస్తే జరగబోయే పరిణామాలను ముందస్తు హెచ్చరించినట్లు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.