Friday, June 8, 2012

సిట్రస్ పండ్లలో పుష్కలంగా వుండే "సి" విటమిన్...!!?






సిట్రస్ పండ్లలో పుష్కలంగా విటమిన్ "సి" ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మపండు, ద్రాక్ష, ఆరెంజ్ వంటి నీటిశాతం అధికంగా గల పండ్లలో ఆరోగ్యానికి కావాల్సిన 'సి' విటమిన్ పుష్కలంగా ఉంది. ఈ 'సి' విటమిన్ ద్వారా శరీరానికి కావాల్సిన యాంటియోక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.

ఈ పండ్లలో శరీరానికి మంచి చేసే పీచు, కొవ్వు పదార్థాలు ఉన్నాయి. సిట్రస్ పండ్లలో పొటాషియంతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఇతరత్రా న్యూట్రీషన్లు ఉన్నాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సిట్రస్ పండ్లలో కొవ్వు శాతం తక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక రోజూ ఒకగ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగితే కెలోరీల శాతాన్ని తగ్గిస్తూ శరీరాన్ని బ్రిస్క్‌గా ఉంచుతుంది. అలాగే ఒక పండును జ్యూస్‌గా కాకుండా అలాగే తీసుకుంటే శరీరంలో రక్తప్రసరణను స్థిరంగా ఉంచుతుందని వైద్యులు చెపుతున్నారు.