Friday, March 29, 2013

ఆధ్యాత్మికత అంటే ఏమిటి.....!?







ఆధ్యాత్మికత... అంటే అసలు ఏమిటి? దైవ చింతన. అంటే ఏ మతంలో ఉంటే ఆ మత దేవుళ్లు, దేవతలను పూజించడం ఆధ్యాత్మిక అని అనుకుంటారు చాలా మంది. అందుకే ఓ దేవుడిని ఎంచుకుని ఆయననే పూజిస్తుంటాం కదా.

అయితే ఈ మతాలకు అతీతంగా భక్తిని ఏర్పరుచుకోగలిగితే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సాధించినట్టవుతుంది. మత వర్గాల చర్చ ముగింపుతోనే ఆధ్యాత్మిక చింతన ప్రారంభమవుతుంది. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక స్థితిని చేరుకోగలము. ఓ వ్యక్తి అభివృద్ధి చెందడానికి మొదటి అడుగు మతంగా చెప్పవచ్చు

ఎప్పుడైతే ఈ మతకట్టుబాట్లను వదిలి ముందుకు సాగుతాడో అప్పుడే అతనికి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముక్తి మార్గానికి బాట ఈ ఆధ్యాత్మిక చింతన. దీనిని కూడా దాటితేనే ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోగలము. ఈ దశ ఉన్నతమైనది. ఈ లక్ష్యాన్ని సాధిస్తే జీవితం సార్థకమవుతుంది