Friday, March 29, 2013

నిజమైన దైవం ఎక్కడుంటుంది...!?






ఈ ప్రపంచంలో నిజమైన దైవం ఎక్కడుంటుంది? అంటే కొంత మంది "పేదవారి"లో అంటారు. మరి కొంత మంది "మానవత్వం, జాలి, దయ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉంటాడు" అని సమాధానమిస్తారు. అయితే దీనికి ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస ఏమి చెప్పారో తెలుసా...?

ఓ భక్తుడు దేవుడి గురించి ఏమని భావిస్తాడు? నీవు నా యజమాని, నేను నీ సేవకుడను, నీవు తల్లైతే నేను నీ బిడ్డను, నీవు సర్వస్వం, కానీ నేను నీలో ఓ అంశం మాత్రమే. అని భావిస్తాడు, అంతే కాదు నమ్మి, ఆ విధంగానే ఆచరిస్తుంటాడు. అయితే దేవుడిని భక్తితో పూజించని వారు కూడా ప్రపంచంలో ఉన్నారు కదా. మరి వారిలో దేవుడు ఉండడా? అంటే... దేవుడిని నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు... ఇలా ప్రతి ఒక్క జీవిలోనూ దేవుడుంటాడు.

మనసు అనే అద్దంపై దేవుడి ప్రతిబింబం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ అద్దంపై కామ, క్రోధ, మద, మాత్సల్య, ద్వేషం అనే పొరలు ఆవరించి ఉంటాయి. వీటిని శుభ్రం చేస్తే అద్దంలో అందంగా దేవుడి ప్రతిబింబం కనిపిస్తుంది. అని దైవ ఉనికిని వివరించారు రామకృష్ణ పరమహంస.