Tuesday, November 27, 2012

శీఘ్ర స్కలనం జరుగుతోందా...!?







శీఘ్ర స్ఖలన సమస్యకు అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే పురుషులు శీఘ్ర స్కలనం సమస్యను అధిగమించి, తన మహిళా భాగస్వామికి తగిన సంతృప్తిని అందించే విధంగా రతిక్రీడను కొనసాగించగలరు. కామోద్రేకానికి భంగం కలగకుండా శీఘ్ర స్కలనం జరగకుండా జాగ్రత్త పడవచ్చు.

బ్రేకులు ఇవ్వడం...

తొందరగా స్కలనం జరిగిపోతే స్త్రీలకు కూడా అసంతృప్తి కలుగుతుంది. దాన్ని నియంత్రించాలంటే సంభోగ వేగంపై దానిపై నియంత్రణ సాధించాలి. క్లైమాక్స్ చేరుకోవడంపై నియంత్రణ అవసరం. సంయోగ క్రియ జరుపుతున్నప్పుడు స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు కాసేపు ఆగండి. అంటే, కాస్తా బ్రేకులు వేయాలన్న మాట.

ఫోర్‌ప్లేకు ఎక్కువ సమయం కేటాయించండి

స్త్రీపురుషులు ఇద్దరు ఫోర్‌ప్లే ఇష్టపడుతారు. ఈ చర్య మహిళలను ఉద్రేకంలోకి తీసుకుని పోతుంది. సంయోగం కోసం తహతహలాడేట్లు చేస్తుంది. పురుషుడికి అంగస్తంభన కోసం నిమిషం కూడా పట్టదు. వెంటనే సంభోగ క్రియను ప్రారంభించి కొద్ది నిమిషాల్లో పూర్తి చేయవచ్చు లేదంటే, గంట వరకు కూడా సాగించవచ్చు. స్త్రీలకు భావప్రాప్తి ఆలస్యంగా జరుగుతుంది. ప్రతి రోజూ ఎక్కువ సేపు ఫోర్‌ప్లే చేస్తే లైంగిక క్రియ ఆనందాన్నిస్తుంది. ముఖరతికి కూడా ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

లైంగిక క్రియను మేనేజ్ చేయండి

పైన ఉండి సెక్స్ చేసే వ్యక్తికి సంయోగ క్రియను నియంత్రించడానికి వీలవుతుంది. సంభోగం సందర్భంగా స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు వేగాన్ని తగ్గించండి లేదా కాసేపు ఆపండి. ఇది అత్యంత సౌకర్యమైంది కూడా. కొద్ది రతిక్రీడ వేగాన్ని పెంచి, ఆ తర్వాత తగ్గించవచ్చు. ఇది గమ్మత్తుగా ఉంటుంది కూడా. మీకే కాకుండా మీ మహిళా భాగస్వామికి కూడా ఇది హాయిగా ఉంటుంది.

భాగస్వామి ఒప్పుకోలుతోనే...

ఇద్దరి అంగీకారం మేరకు, అంటే ఇద్దరికి భావప్రాప్తి కలిగిందని అనుకున్నప్పుడు రతిక్రీడను విరమించడానికి స్కలనం జరిగేలా చూసుకోవాలి. రతిక్రీడ జరుపుతూనే ఆమెను మాటల్లోకి దించి ఎలా చేయాలి, ఎంత సేపు కావాలి, ఇంకా కావాలా అంటూ అడుగుతూ వెళ్లండి. ఆమె సమాధానాలను బట్టి రతిక్రీడను మీ నియంత్రణలో ఉంచుకోండి. దీనివల్ల ఇరువురు ఒకేసారి భావప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది.