Tuesday, November 20, 2012

గుప్పెడు పిస్తా పప్పుతో గుండెను ఒత్తిడి నుంచి కాపాడండి..!?







పిస్తాపప్పులను ప్రతిరోజూ తీసుకుంటే గుండెను ఒత్తిడి నుంచి కాపాడవచ్చునని సైంటిస్టులు అంటున్నారు. ప్రతిరోజూ గుప్పెడు పిస్తా పప్పులను తీసుకోవడం ద్వారా లోబీపీ, హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలోనూ పిస్తా పప్పులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు సూచిస్తున్నారు.

ఆధునిక యుగంలో బిజీ షెడ్యూల్ కారణంగా అనేకమంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇంకా ఒత్తిడి కూడా పెరిగిపోతోంది. ఫలితంగా హృద్రోగ వ్యాధులు కూడా ఎక్కువైపోతున్నాయని జర్నల్ హైపర్‌టెన్షన్ రచయిత డాక్టర్ షీలా వెల్లడించారు. అందుచేత ప్రతిరోజూ పిస్తా పప్పులను తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటును నియంత్రించవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.