Thursday, November 29, 2012

దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టడమెందుకు.....!?






దేవాలయాలలో రకరకాలుగా ఉంటాయి. ఆ గంటలు వివిధ రకాల ఫలితాలను కలుగజేస్తుంటాయి. అవి ఆరు విధాలుగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

1. ధ్వజస్తంభం దగ్గర (దీనిని బలి అంటారు) పక్షులకు ఆహారాన్ని పెట్టే సమయంలో ఒక తీరుగా మ్రోగించే గంట.

2. స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు మ్రోగించే గంట.

3. దేవుడికి మేలుకొలుపు పాటలను పాడేటప్పుడు పాటకూ, పాటకూ మధ్య ఒక తీరుగా మ్రోగించే గంట.

4. ఆలయాన్ని మూసే వేళలలో మ్రోగించే గంట.

5. మండపంలో ఒక తీరుగా మ్రోగించే గంట. అయితే దేవుడికి ఎదురుగా మండపంలో ఉన్న గంటను హారతి ఇచ్చేటప్పుడు మ్రోగించకూడదు.

మండపంలోని గంట దేవుడిని దర్శిస్తున్న వ్యక్తి చెవిలో "ఓం"కార ధ్వనిని ఉపయోగించే గంట. ఆ ఓంకారనాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోలోపల వింటూ దైవాన్ని దర్శించాలి. అనుకరణ ధ్వని అంటే గంట కొట్టాక కొంతసేపటి వరక వచ్చే "ఊ" అని వినిపించే శబ్దం అన్నమాట.

ఆ తర్వాత కొట్టేది హారతి గంట. దేవతలనందరినీ ఆహ్వానిస్తున్నామని, దేవుడంటే పట్టని వారెవరైనా ఉంటే దాపుల నుండి తొలగిపోవాల్సిందిగా కోరుతున్నామని, గంటకొడుతున్న సమయంలో ఆ దైవాంశ విగ్రహంలోకి చేరినప్పుడు ఉన్న రూపాన్ని హారతి వెలుగులో ఆలయంలో చూపడం జరుగుతుందని తెలుపుతుంది ఈ హారతి గంట. అందువల్ల హారతి ఇచ్చే సమయంలో దేవుడిని ప్రత్యక్షదైవాంశ చేరిన రూపంగా దర్శించాలి.