Wednesday, November 21, 2012

నీళ్లు తాగి హార్ట్ ఎటాక్‌ని దూరం చేసుకోండి..!!?







దాహమేసినప్పుడు కాకుండా మంచి నీళ్లని ఒక పద్దతిలో తాగితే కొన్ని రకాల లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

* తొంబైశాతం హార్ట్ ఎటాక్‌లు తెల్లవారు ఝామునే వస్తాయట. రాత్రి పడుకునే ముందు ప్రతిరోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగితే ఈ ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.

* నీళ్లు తాగడం మంచిదని తెలుసు కాని వాటికి ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోకండి.

* నిద్రలేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగితే శరీరంలోని అవయవాలన్నీ చురుకుగా పనిచేస్తాయట.

* భోజనానికి అర గంట సమయం ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆహారం బాగా జీర్ణమవుతుంది.

* స్నానానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే రక్త పీడనం (బీపీ) తగ్గుతుంది.

దీన్ని బట్టి ఆహారానికి ఒక క్రమశిక్షణ ఎలా అవసరమో మంచినీళ్లు తాగే విషయంలోనూ అలాంటి క్రమశిక్షణ పాటించాలని తెలుస్తోంది.