Tuesday, April 9, 2013

ఇంద్ర మాల'ను ధరిస్తే.. మీకు దుస్సాధ్యమేదీ లేదు....!?






రుద్రాక్ష అంటే.. మహాశివుని నేత్రం అని శివపురాణం పేర్కొంటోంది. ఇలాంటి రుద్రాక్ష మాలలను ధరించడం వల్ల మనస్సు ప్రశాంతతో పాటు.. ఆయురారోగ్యాలు కలుగుతాయని మన పురాణాలు చెపుతున్నాయి.

అయితే ఈ రుద్రాక్ష మాలలను ధరించే ముందు అవి ఖచ్చితమైన ముఖాలను కలిగివున్నాయా? లేదా నిజమైన రుద్రాక్షలేనా అనే విషయాన్ని నిర్థారించుకోవాలి


* ఏకముఖి రుద్రాక్ష : ఇది శివుని ప్రతిరూపం. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరతాయి. 

* ద్విముఖి : అర్థనారీస్వరతత్వానికి సంకేతం. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది. 

* త్రిముఖి : ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుందని చెప్పారు. 
 
* చతుర్ముఖి : బ్రహ్మకు ప్రాతినిథ్యం వహిస్తుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. 

 
* పంచముఖి : గుండె జబ్బులున్నవారికి మంచిది. పాము కాటు నుంచి రక్షణ
కలుగుతుంది.
 
* షణ్ముఖి : కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి. 

 
* సప్తముఖి : కామధేనువుకి ప్రతీక. అకాల మరణం దూరంగా ఉంటారు. 

 
* అష్టముఖి : విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

 
* నవముఖి : భైరవునికి ప్రతీక. దీన్ని ఎడమ చేతికి ధరిస్తే మేలు కలుగుతుంది. 

 
* దశముఖి : దీన్ని ధరించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

 
* ఏకాదశముఖి : 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది.

 
* ద్వాదశముఖి : 12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.

 
* త్రయోదశముఖి : 13కామధేవునికీ, కార్తికేయునికీ ప్రతీక. పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.

 
* చతుర్ధశముఖి : 14 ముఖాలు. ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను.

 
* పంచదశముఖి : 15ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.

 
* షోడశముఖి : 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.


* సప్తదశముఖి : 17దీని వలన సంపద కలుగుతుంది.
 
* అష్టాదశముఖి : 18 ముఖాలు. ఇది భూమికి తార్కాణం.

 
* ఏకోన్నవింశతిముఖి :19 ఇది సాక్షాత్తూ నారాయణుడికి సంకేతం.

 
* వింశతిముఖి : 20 ముఖాలు. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతంగా చెపుతారు. 

 
* ఏకవింశతిముఖి : 21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతా
యి .