Wednesday, June 12, 2013

పెళ్ళికి ముందే గర్భం ధరించి, ఆపై వివాహం చేసుకుంటే.....!?







స్త్రీలు ప్రేమించి, ఆకర్షణలకు గురై వివాహానికి ముందే గర్భం ధరించి తరువాత ఏదో ఒకరకంగా దాన్ని తొలగించుకొని, ఇంకొక వ్యక్తిని పెళ్ళిచేసుకుంటే వచ్చే సకల పాపములు ఆ వ్యక్తి వంశానికి చుట్టుకుంటాయి.

ఇంటికి వచ్చే కోడలి కన్య అయితే ఇంటికి మహాలక్ష్మీ వస్తుందని భావిస్తుంటారు. మెట్టినింట కన్యలు అడుగుపెడితే ఆ గృహము సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. ఆ తర్వాత చేసుకున్న వ్యక్తితో పిల్లలు కలిగినప్పటికీ వారు పరిపూర్ణ వంశస్థులవ్వరు. ఇటువంటి తప్పు చేసిన స్త్రీ దోషపరిహారార్థం ఓ మాసం పాటు ఒంటిపూట భోజనంతో మహాశివుణ్ణి ఆరాధించాలి.

తన తప్పును క్షమించమని భగవంతుడిని కోరుకుంటే ఆ స్త్రీకి దోషం పోతుంది. భర్తతో కలిసే రోజూ పూర్తి ఉపవాసం ఉండి కలిస్తే కొంత దోషం పోతుందని మన పురాతన తాళపత్ర గ్రంధాలు చెబుతున్నాయి.