Thursday, July 5, 2012

కుడికన్ను-ఎడమ కన్ను అదిరితే ఏం జరుగుతుంది....!!?








ముఖ్యమైన కార్యములు తలపెట్టినప్పుడు, ఏదేని ఒక విషయమును గురించి ఆలోచించువేళ, కొత్త పనిని ప్రారంభించినప్పుడు శకునాలను చూడటం పరిపాటి. అలాగే మేలు జరిగినా, కీడు జరిగినా కళ్లు అదరడం ద్వారా ముందుగా పసిగట్టవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

పురుషునికి కుడికన్ను, స్త్రీకి ఎడమ కన్ను అదిరితే మేలు, లాభము చేకూరుతుంది. అలాగే పురుషునికి ఎడమకన్ను, స్త్రీకి కుడి కన్ను అదిరితే కీడు-ఆపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు. రెండుకన్నులు ఒకేమారు అదురుట స్త్రీ పురుషుల కిరువురికి శుభసూచకము.

ఇంకా క్రింది పెదవి భాగము అదిరితే భోజనసౌఖ్యము, గడ్డము అదిరిన లాభము-ఇతరుల ద్వారా సహాయ సహకారాలు, కుడిచెక్కిలి ధనప్రాప్తి, ఎడమచెక్కిలి-చోరబాధలు, కుడి భుజములదిరితే భోగసంపదలు వంటి ఫలితాలుంటాయి.

అలాగే ఎడమ భుజము అదిరితే కీడు, కష్టములు, రొమ్ము అదిరిన ధనలాభము, ధైర్యము, అరచేయి అదిరిన సంతాన ప్రాప్తి, గౌరవము కలుగుతుందని పండితులు అంటున్నారు.