Sunday, July 8, 2012

శనిగ్రహ సంబంధ వ్యాధులు, పరిహార క్రియలు..!








శనిగ్రహ సంబంధ వ్యాధులు, వాటి పరిహార క్రియలేంటో తెలుసుకోవాలని వుందా అయితే ఈ కథనం చదవాల్సిందే. వ్యాధులకు కారకుడు శని. చాలా వ్యాధులకు ఏదో రూపంలో శని సంబంధం కలగడం కనిపిస్తుంది.

పక్షపాతం, నొప్పులు, అస్తమా, లివర్ వ్యాధులు, నిమోనియా, దగ్గు, క్షయ, కిడ్నీ వ్యాధులు, గాల్ బ్లాడర్ వ్యాధులు, ఎముకలు. చర్మవ్యాధులు, కేన్సర్, టీబీ, వెంట్రుకలు, గోళ్ళకు సంబంధించిన వ్యాధులు మరియు లోపాలు శనిగ్రహలోపం వల్లే వస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా శనిగ్రహ ప్రభావంతో సేవకులతో వైరం, శరీర అవయవ లోపం, కోమాలోకి పోవడం, పిచ్చితనం, స్పర్శపోవడం, శరీరం క్షీణించడం ఇలా ఒకటేమిటి అన్ని వ్యాధులకు, కష్టాలకు, నష్టాలకు శనిగ్రహ దోషమే కారణమౌతుంది.

అర్దాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని గోచార కాల మందు శనిగ్రహదోషం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుచేత క్రియలు తప్పక అవలంబించాలి. శనివారం నాడు ప్రజాపతి, శని మంత్రాలను జపించి, నీలమణిని ధరించడం వలన శనిగ్రహ సంబంధ దోషం తొలగిపోతుంది.

నల్లని వస్త్రధారణ నల్లని వస్తువులు దానం చేయడం మంచిది. శ్రీ వేంకటేశ్వర స్వామి, హనుమంతుని ఆరాధనం, అయ్యప్ప స్వామి దీక్ష మంచి పరిహారాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.