Friday, November 30, 2012

దేవునికి వెన్న అలంకారాలను ఎందుకు చేస్తారు....!?







దేవునికి వెన్న అలంకారాలను ఎందుకు చేస్తారని మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి. మనిషి తాను ఎంత బుద్ధిమంతుడైనప్పటికీ కాలం, పరిస్థితి, సందర్భం, సన్నివేశాలతో తన పనుల్లో ఎంత శ్రమించి ప్రయత్నించినప్పటికీ విజయం దక్కపోతే అప్పుడు దైవాన్ని నమ్ముతాడు.

తన పనుల్లో విజయం సాధించినప్పుడు దేవునికి మొక్కులు చెల్లించి కానుకలు సమర్పిస్తాడు. తన పనులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ వెన్న కరిగేంత సమయంలో తన పనులు కూడా పూర్తవుతాయన్న భావనతోనే భక్తులు దేవునికి వెన్నతో అలంకారాలు చేయిస్తారు. తద్వారా దైవ బలంతో పనులు పూర్తయ్యాయని భావిస్తారు.

ఇక దేవునికి అలంకరించిన వెన్నను తినకూడదట..!
దేవునికి అలంకరించిన వెన్నను ఏ కారణంచేత కానీ వంటకు ఉపయోగించకూడదు. లేదా తిండి పదార్థంగా తినకూడదు. దేవునికి దీపాలకు ఈ వెన్నను ఉపయోగించరాదు. ప్రసాదంగా అందిన వెన్నను ఇతరులకు ప్రసాదరూపంలో అందించవచ్చు. అలా అందుకున్న వారు దానిని దీపాలకు ఉపయోగించమని చెప్పి, తినవద్దని చెప్పాలి. పిల్లలకు కూడా తినేందుకు ఇవ్వవద్దని పండితులు చెబుతున్నారు.