Saturday, December 1, 2012

సూర్యాస్తమయం తర్వాత ఇంట్లోని వస్తువులను ఇతరులకిస్తే..!?






 సూర్యాస్తమయం తర్వాత ఇంట్లోని వస్తువులను ఇతరులకు ఇస్తున్నారా అయితే ఇక జాగ్రత్త పడండి. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లోని ధనం కానీ, ఇతర లోహ సంబంధ పాత్రలను, పనిముట్లను పొరపాటున కూడా ఇతరులను ఇవ్వకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

సంప్రదాయం ప్రకారం పూర్వకాలం నుంచి సూర్యడు అస్తమించిన తర్వాత బయటివారికి డబ్బులు గానీ, ఇతర లోహ సంబంధ పాత్రలను, పనిముట్లను పొరపాటున కూడా ఇచ్చేవారు కాదు.

కంటికి కనిపించని కొన్ని మహత్తర శక్తులు గృహాల్లో నివసిస్తూ ఉంటాయి. ఇవి సూర్యాస్తమయం దాటిన తర్వాత బీరువాలో ఉండే ధనాన్ని, ఇంట్లో ఉండే ఇనుప పరికరాలను, చివరకు వంట పాత్రలను కూడా అవహించి ఉంటాయి.

ఆ విధంగా గృహస్తుకు మేలు చేసే అదృశ్య శక్తులు ఆవరించి ఉన్న వస్తువుల్ని లేదా ధనాన్ని ఇతరులకు సూర్యాస్తమయం తర్వాత ఇచ్చినట్లయితే ఆ వస్తువుతో పాటు గృహస్తుకి మంచి చేసే శక్తులు బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లోని ధనాన్ని, లోహసంబంధిత వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.