Sunday, March 31, 2013

సముద్రంలో ఎప్పుడు స్నానం చేయకూడదు.....!?







సాధారణంగా ఆదివారమో, శెలవు దినమో వస్తే చాలు సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లాలనిపిస్తుంది. అక్కడ కాసేపు సేదతీరితే వారం అంతా పడ్డ కష్టం ఇట్టే మాయమవుతుంది మరి. అంతేకాదు, ఇంట్లో పిల్లలు ఉన్నా, లేక చుట్టాలు వచ్చినా అత్యధికంగా వెళ్లే చోటు బీచే.

బీచ్‌కు వెళ్లగానే, అక్కడి చల్లని గాలి, ఆహ్లాదం కలిగించే వాతావరణం ఉత్సాహం తెప్పిస్తుంది. అలల్లో ఆడుకునే పిల్లలు, ఎగిసి పడే కెరటాలు మనను ఊరికే ఉండనిస్తాయా? రా...రామ్మని పిలుస్తుంటాయి. అంతే మనం కూడా చిన్నపిల్లలాగా వెళ్లి ఆటలు ఆడేస్తుంటాము.

అయితే సముద్రంలో ఆటలు, స్నానాలు తదితరాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. వాటికి కొన్ని నియమాలుఉన్నాయి. ఇల్లాలు గర్భంతో ఉన్న సమయంలో సముద్రుడిని(సముద్రం) తాకకూడదట. అలాగే మంగళవారం, అమావాస్యలు ఒకే రోజున వస్తే అప్పుడు కూడా సముద్రం జోలికి వెళ్లకూడదట.

అంతేకాదు, ఆదివారం, పౌర్ణమి రోజులు కలిసి వస్తే చల్లని వెనెల్లో స్నానాలు చేసేస్తుంటారు చాలా మంది. కానీ శాస్త్ర రీత్యా ఇది మంచిది కాదట. కనుక ఈ రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో సముద్రంలో ఆటలాడుకుంటూ సంతోషంగా గడపవచ్చు. 



ఏ దిశలో కూర్చుని భుజించాలి.....!?







మనిషికి శక్తినిచ్చేది ఆహారం. ఈ ఆహారాన్ని వివిధ రకాలుగా వివిధ రుచులతో తయారు చేసుకుంటాం. ఆయా దేశాలు, ప్రాంతాల ఆచారం బట్టి ఆహారాన్ని తయారు చేసుకుంటుంటాం. అంతే కాదు, అవి ఎంతో శుభ్రంగానూ, ఆరోగ్యకరంగా ఉండాలని భావిస్తాం.

అయితే ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని ఆలోచించామా? పూర్వ కాలంలో అయితే పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడంలేదు. టేబుల్‌ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.

తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. పడమర వైపు కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట. దక్షిణం వైపు కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట. అంతేకాదు, ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.

ఉత్తరం వైపు కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట. టేబుల్‌పైన అయినా సరే, పీట వేసుకుని భుజించే సమయంలోనైనా సరే ఈ దిశలలో కూర్చోవడం ద్వారా సకల శుభాలూ కలుగుతాయి.


Saturday, March 30, 2013

అమ్మవారిని ఎప్పుడు స్తుతించాలి.....!?







సాధారణంగా సోమవారం శివునికి, మంగళవారం అమ్మవారికి, గురువారం సాయినాధునికి అంటూ ఇలా మనం పూజలు జరుపుతాం. అయితే అమ్మవారిని ఎప్పుడు స్తుతించాలి అంటే మాత్రం శుక్రవారం అని టక్కున చెప్పేస్తాం.

అయితే ఇది నిజమో కాదో మనకు తెలియదు కానీ, అమ్మవారిని పూజించేందుకు మంచి రోజులు మంగళవారం, పౌర్ణమి రోజులే. ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మవారిని స్తుతిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల అమితంగా నమ్ముతారు. అందుకే ప్రతి పౌర్ణమి, మంగళవారాల్లో అన్ని అమ్మవారి ఆలయాలు కిటకిటలాడుతాయి మరి.

ఇంకో విషయం ఏమిటంటే సాధారణంగా ఇంట్లో సుబ్రమణ్యస్వామి ఫొటోలను పెట్టుకునేటప్పుడు గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన చేతిలో ఉండే శూలపు మొన తలకు నేరుగా ఉండే లాంటి ఫొటోలను పెట్టకూడదట. మరి ఈ జాగ్రత్తలు పాటించి అమ్మవారిని పౌర్ణమి, మంగళవారాల్లో స్తుతించి లాభాలను పొందండి. 



అభ్యంగన స్నానాలు ఎప్పుడు చేయాలి....!?






పూర్వకాలంలో ఒళ్లంతా నూనెలు రాసుకుని, మర్దన చేసుకుని, నూనె ఇంకేంత వరకు ఆరబెట్టుకుని పెద్దకాగుతో కాచిన వేడినీళ్లతో చక్కగా అభ్యంగన స్నానాలు చేసేవారు. ప్రస్తుత ఆధునిక కాలంలో అవి దూరమయ్యాయి. ఎప్పుడో శుభకార్యాల సమయాల్లో మాత్రమే వీటిని పాటిస్తున్నారు.

వారానికి ఓ సారి తప్పకుండా అభ్యంగన స్నానాలు చేయడం మంచిదని వైద్యులు కూడా అంటున్నారు. వెచ్చని నూనెతో మర్దన చేసుకుని తలంటుకునే ఈ అభ్యంగన స్నానాలను కొంత మంది మాత్రం పాటిస్తూనే ఉన్నారు.

అయితే ఈ అభ్యంగన స్నానాలు చేసేటప్పుడు కొన్నినియమాలు పాటించాల్సి ఉంటుంది. వారాలను చూసుకుని, తెలుసుకుని చేయడం ద్వారా శుభాలు జరుగుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

సోమవారం నాడు ఈ స్నానాలు చేయడం ద్వారా ఇంట్లో కొత్త వస్తువులు చేరతాయి. మంగళవారం మాత్రం ఇలాంటివి మంచివి కావు. మంగళవారం స్నానాలు చేయడం ద్వారా ఇంటికి అరిష్టాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది.

అలాగే బుధవారం నాడు ఈ అభ్యంగన స్నానాలు చేయడం ద్వారా విద్యాభివృద్ధి జరుగుతుంది. గురువారం అభ్యంగన స్నానాలతో మేధస్సు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.

శుక్రవారం ఈ అభ్యంగన స్నానాలు చేయడంతో పేరుప్రతిష్టలు కలుగుతాయి. శనివారం ఈ స్నానాలు చేయడం ద్వారా సకల సంపదలు ప్రాప్తిస్తాయి. ఆదివారం ఈ స్నానాలు చేయడంతో సౌందర్యం నశిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది.


Friday, March 29, 2013

ఆధ్యాత్మికత అంటే ఏమిటి.....!?







ఆధ్యాత్మికత... అంటే అసలు ఏమిటి? దైవ చింతన. అంటే ఏ మతంలో ఉంటే ఆ మత దేవుళ్లు, దేవతలను పూజించడం ఆధ్యాత్మిక అని అనుకుంటారు చాలా మంది. అందుకే ఓ దేవుడిని ఎంచుకుని ఆయననే పూజిస్తుంటాం కదా.

అయితే ఈ మతాలకు అతీతంగా భక్తిని ఏర్పరుచుకోగలిగితే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సాధించినట్టవుతుంది. మత వర్గాల చర్చ ముగింపుతోనే ఆధ్యాత్మిక చింతన ప్రారంభమవుతుంది. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక స్థితిని చేరుకోగలము. ఓ వ్యక్తి అభివృద్ధి చెందడానికి మొదటి అడుగు మతంగా చెప్పవచ్చు

ఎప్పుడైతే ఈ మతకట్టుబాట్లను వదిలి ముందుకు సాగుతాడో అప్పుడే అతనికి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముక్తి మార్గానికి బాట ఈ ఆధ్యాత్మిక చింతన. దీనిని కూడా దాటితేనే ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోగలము. ఈ దశ ఉన్నతమైనది. ఈ లక్ష్యాన్ని సాధిస్తే జీవితం సార్థకమవుతుంది



   

నిజమైన దైవం ఎక్కడుంటుంది...!?






ఈ ప్రపంచంలో నిజమైన దైవం ఎక్కడుంటుంది? అంటే కొంత మంది "పేదవారి"లో అంటారు. మరి కొంత మంది "మానవత్వం, జాలి, దయ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉంటాడు" అని సమాధానమిస్తారు. అయితే దీనికి ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస ఏమి చెప్పారో తెలుసా...?

ఓ భక్తుడు దేవుడి గురించి ఏమని భావిస్తాడు? నీవు నా యజమాని, నేను నీ సేవకుడను, నీవు తల్లైతే నేను నీ బిడ్డను, నీవు సర్వస్వం, కానీ నేను నీలో ఓ అంశం మాత్రమే. అని భావిస్తాడు, అంతే కాదు నమ్మి, ఆ విధంగానే ఆచరిస్తుంటాడు. అయితే దేవుడిని భక్తితో పూజించని వారు కూడా ప్రపంచంలో ఉన్నారు కదా. మరి వారిలో దేవుడు ఉండడా? అంటే... దేవుడిని నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు... ఇలా ప్రతి ఒక్క జీవిలోనూ దేవుడుంటాడు.

మనసు అనే అద్దంపై దేవుడి ప్రతిబింబం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ అద్దంపై కామ, క్రోధ, మద, మాత్సల్య, ద్వేషం అనే పొరలు ఆవరించి ఉంటాయి. వీటిని శుభ్రం చేస్తే అద్దంలో అందంగా దేవుడి ప్రతిబింబం కనిపిస్తుంది. అని దైవ ఉనికిని వివరించారు రామకృష్ణ పరమహంస.
  

Thursday, March 28, 2013

ఎవరు గొప్ప.....!?







నువ్వు గొప్పా? నేను గొప్పా? నువ్వు పెద్దా? నేను పెద్దా? అనే పోటీ అనాది నుంచి వస్తున్నదే. అలాగే ఇదే పోటీ ఓ సారి మానవుని చేతిలో ఉండే ఐదు వేళ్ల మధ్య నెలకొంది.

నువ్వు గొప్పా నేను గొప్పా అని చేతి వేళ్లు తమలో తాము వాదులాడుకోవడం ప్రారంభించాయి. అప్పుడు మొదటి వేలు "నేను లేకుండా మిగిలిన నాలుగు వేళ్లు ఏమీ చేయలేవు కాబట్టి నేనే గొప్ప" అని అన్నది. ఇది విన్న చూపుడు వేలు "కాదు కాదు మంచి, చెడులను చూపేది నేనే కాబట్టి నేనే గొప్ప" అని అన్నది. "అన్నిటికంటే నేనే ఎత్తుగా ఉంటాను కాబట్టి నేనే గొప్ప అన్నది మధ్య వేలు"!

ఇది విన్న ఉంగరపు వేలు "లేదు ఇన్ని వేళ్లు ఉన్నా మనుషులు ఖరీదైన ఉంగరాలను నాకే తొడుగుతున్నారు కాబట్టి నేనే గొప్ప" అని అన్నది. ఇక మిగిలింది చిటికెన వేలు. దానికి ఏమి చెప్పాలో అర్థం కాలేదు. అన్నిటికన్నా పొట్టిగా ఉన్న చిటికెన వేలు దేవుని సన్నిధానంలో తన బాధను చెప్పుకుంది.

ఇది విన్న దేవుడు ఇలా అన్నాడు... "పొట్టిగా ఉన్నావని బాధపడకు! మనుషులు నన్ను ప్రార్థించే సమయంలో చేతిలోని వేళ్ల వరుసలో నీవే ముందుంటావు కదా? నీవే నాకు దగ్గరగా ఉంటావు కాబట్టి నువ్వే గొప్ప!" అని అన్నాడు దేవుడు. అంతే కదా! మరి ఎవరికి ఎన్ని గుణాలు, సంపద ఉన్నాయన్నది గొప్ప కాదు. దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామన్నదే ముఖ్యం. కాదాంటరా...!



వయ్యారి నడకలో పైచేయి ఎవరిది....!?











ఓ సారి అక్కచెల్లెళ్లయిన శ్రీదేవి, జేష్టాదేవీలకు తమలో ఎవరిది వయ్యారమైన నడక అని సందేహం వచ్చింది. నా నడకే అందంగా ఉంటుందంటే నాదేనని వాదులాడుకున్నారు. ఎవరిది వయ్యారి నడకో తేల్చుకోడానికి ఎవరినైనా అడగాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన నారద మహర్షిని న్యాయనిర్ణేతగా వ్యవహరించమన్నారు.

విషయం అర్థమైన నారదునికి ఏమి చేయాలో పాలుపోలేదు. ఇద్దరి నడకలు వయ్యారంగానే ఉన్నాయి. జేష్టాదేవీ నడక బాగుందంటే శ్రీదేవికి కోపం... శ్రీదేవి నడక బాగుందంటే జేష్టాదేవీకి కోపం...!

ఇలానే ఆలోచిస్తుండగా, నారద మునికి ఓ ఉపాయం తట్టింది. భూలోకంలో శిఖామణి అనే ఓ భక్తుడు ఉన్నాడు. అతను మీ ప్రశ్నకు సమాధానం చెప్పగలడు అని సూచించాడు నారదుడు.

దీంతో జేష్టాదేవీ, శ్రీదేవి భూలోకానికి పయనమయ్యారు. శిఖామణి ముందు నడిచి చూపించి తమ ప్రశ్నకు సమాధానం చెప్పమన్నారు. ఇద్దరి నడక వయ్యారంగానే ఉంది.

అయితే స్పష్టమైన నిర్ణయం చెప్పాలంటే ఓ వారం గడువు కావాలని శిఖామణి వారిని కోరాడు. దీనికి వారు సమ్మతించి అప్పటికి శాంతించారు.

ఏమి చెప్పాలో అర్థం కాలేదు శిఖామణికి ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చూపించాలి నారాయణా అని మనసులో ప్రార్థించాడు. అప్పుడు మెదిలింది ఓ ఆలోచన. అంతే వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు.

వారం రోజుల గడువు ముగియడంతో శ్రీదేవి, జేష్టాదేవీలు శిఖామణి వద్దకు వచ్చారు. అప్పుడు మాతా మీరు మరో మారు ద్వారం నుంచి లోపలకు, ద్వారం వైపునకు నడిచి చూపించాలని కోరాడు.

అలానే వాళ్లు కూడా చేశారు. అప్పుడు శిఖామణి ఇలా అన్నాడు. జేష్టాదేవీ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆమె నడక వయ్యారంగా ఉంటుంది. అలానే శ్రీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో ఆమె నడక వయ్యారంగా ఉంటుందని భక్తితో చెప్పాడు. 




Wednesday, March 27, 2013

కృష్ణుడి తలపై నెమలి పింఛం వెనుక... !?







చూడగానే ముద్దులొలికే మోముతో ప్రేమసాగరంలో ముంచే రూపంతో ఉండే శ్రీకృష్ణుడు మథురా నగరిలో దేవకీ, వసుదేవులకు జన్మించాడు. అయితే మామ కంసుడు చంపేస్తాడని భయపడిన తల్లిదండ్రులు బాలకృష్ణుని అక్కడి నుంచి రేపల్లెకు తీసుకువెళ్లి నంద, యశోదలకు అప్పగించారు.

ఎంతైనా రాజకుమారుడు కదా! ముఖంలోని గంభీరం, వెలుగు, రాజఠీవి ఎంత దాచినా దాగవుగా. అందమైన ఆ మోము చూసి ఆకర్షితులుకాని వారు ఉండరు.

బాల్యంలో శ్రీకృష్ణుడి లీలలు అంతా ఇంతా కాదు. తనను సంహరించేందుకు వచ్చిన అనేక మంది రాక్షసులను వెన్నదొంగ అవలీలగా అంతమొందించాడు. తన మిత్రులతో ఆడుకునే సమయంలో ఎదురైన అనేక అపాయాలను సులభంగా తప్పించాడు.

దీనితో సంతోషించిన మిత్ర బృందం కృష్ణుని తమ బృందానికి నాయకుడిగా చేశారు. తమ ప్రియమైన మిత్రునికి ఏదైనా చేయాలని వారు భావించారు.

వెంటనే అక్కడ తిరుగుతున్న నెమలిని పట్టుకున్నారు మిత్రులు. వారు ఎందుకు పట్టుకున్నారో అర్థం చేసుకున్న ఆ నెమలి వారికి సహకరించింది.

ఓ పింఛాన్ని తీసుకుని కృష్ణుని కిరీటంలో అలంకరించారు మిత్రులు. ఏదో చిన్నప్పుడు స్నేహితులు తలపై పెట్టిన పింఛం అప్పట్నుంచీ కృష్ణునికి ఓ ఆభరణంగా మారిపోయింది. 



Tuesday, March 26, 2013

మీ కారుకి దిష్టి తీయండి .....!?






కొత్త వాహనం కొన్న తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవం ఆలయం వద్ద పూజ చేయిస్తారు. అలాగే పలు చోట్ల తిరిగిన వాహనానికి దిష్టి తీసే విధానమేమిటో తెలుసుకుందాం. మీ కారును శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత నాలుగు నిమ్మకాయలను నాలుగుచక్రాల కింద పెట్టి తొక్కించాలి.

అదేవిధంగా నల్లటి గుడ్డలో ఆవాలు, నువ్వులు మూటగా కట్టి దానిపై కర్పూరం పెట్టి వెలిగించి తొమ్మిదిసార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేసేముందు నల్లటి తాడుతో పటికను కట్టి నాలుగు నిమ్మకాయలతో మధ్యలో మిరపకాయలను గుచ్చి కారు ముందటి భాగంలో దండగా వేయాలి. సహజంగా కారును శివాలయంలో పూజ చేయించటం ఉత్తమం.



 

సకల దోషాలను హరించే గోపూజ .....!?







పూర్వం సాధువులు అధికంగా గోవు (ఆవు)కు పూజలు జరుపుతుండేవారు. వివిధ మఠాల పీఠాధిపతులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి సాధువులందరూ ఇష్టపడి చేసే పూజ గోపూజ. త్రిమూర్తులు, సకల దేవతలు గోవుమాతపైనే కొలువై ఉన్నట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

దేవలోక గోవు పటాన్ని గమనించినట్లైతే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు చూడవచ్చు. అందువల్లనే ఇప్పుడు కూడా చాలా మంది గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తుంటారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండటం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు.

విజ్ఞాన పరంగా చూసినట్లైతే గోవు పంచితం క్రిమి సంహారిగాను (రసాయ పదార్థం) ఉపయోపడుతుంది. అంతేకాకుండా గోవు ఇచ్చే పాలు తల్లితో పాటు శ్రేష్టంగా ఉండటం గమనించవచ్చు. గోవు శాఖాహారిగాను, సాధు జంతువుగా ఉన్నందునే కాకుండా, అది మనకు ఉపయోగకారిగా ఉన్నందునే దాన్ని మన గృహాల్లో పెంచుకుంటున్నాము.

కామోద్రేక్తంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. అంటే గోవును పూజించడం మాత్రమే కాకుండా గోవును దేవాలయానికి దానంగా ఇవ్వడం, గోవు వలన మనకు సిద్ధించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా గోపూజతో సమానమేనని పండితులు భావిస్తున్నారు.

అలాగే దేవ రహస్యాన్ని కనుగొనే మహత్మ్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అందువల్లే గోపూజకు శాస్త్రాల్లో కీలక ప్రాముఖ్యత సంతరించుకుంది. 


Monday, March 25, 2013

ఇరుగు దిష్టి... పొరుగు దిష్టి... అందిరి దిష్టి.... !?








ఎవరివంకైనా అదే పనిగా ఎవరైనా చూస్తే... 'దిష్టి తగులుతుంది... అలా చూడకు' అంటారు. అంతేకాదు ఏదైనా ఊరి ప్రయాణం చేసి వచ్చినవారు దిష్టి తీయించుకుంటూ ఉంటారు. ఈ దిష్టి తీయటం అనేది మన పూర్వీకులు ఎప్పటినుంచో అనుసరిస్తున్న పద్ధతి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో దిష్టి ఎలా తీయాలన్నదానిని గురించి పెద్దలు ఇలా చెపుతారు.

దిష్టి తీసేటపుడు పిల్లల వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు దిష్టి తీయకూడదు. పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత కర్పూరం బిళ్ల వెలిగించి పై నుంచి క్రిందికి తిప్పి కర్పూరం వెలుగుతూ ఉండగానే బయటవేసేయాలి.

పెద్దవారు బయటనుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను తాకకూడదు. కాళ్లు చేతులు కడిగిన తర్వాత పిల్లలను దగ్గరకు తీసుకోవచ్చు. అదేవిధంగా అర్థరాత్రి, మిట్టమధ్యాహ్నం పిల్లలను బయట తిప్పకూడదు. నల్లటి కాటుకతో పెట్టే చుక్క దుష్ట శక్తులను ఇంటిలోనికి ప్రవేశించనీయదని విశ్వాసం కనుకనే చిన్నపిల్లలకు అరికాలిలో కాటుకతో నల్లని దిష్టి చుక్కను పెడతారు.





Sunday, March 24, 2013

పూర్వజన్మ పాపాలకు ఇప్పుడు పూజలెందుకు...!?







"ఒకరికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు... చెడు మాత్రం చేయవద్దు" అని పెద్దల వచనం.ఇలా అకారణంగా పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో పట్టిపీడిస్తుందన్నారు. అంతేకాదు గత జన్మలో చేసిన ఇటువంటి పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాలని చెప్పారు. అయితే కొందరు మాత్రం గత జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని ప్రశ్నిస్తుంటారు.

దీనికి పెద్దలు ఇలా చెప్పారు... పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ రోగమొస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దానిపని అది చేస్తూ వుంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.

అలాగే పూర్వ జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో పూర్వ జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి.



Saturday, March 23, 2013

nitya sandesam








నగ్రహ ప్రదక్షిణతో దోష నివారణ ....!?








మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహలస్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది. గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. వాటిని బట్టే మానసిక పరిస్థితి, ఆరోగ్యం ఆధారపడి వున్నాయి.

నగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. చాలామందికి ఈ పద్దతులు గురించి అవగాహన వుండదు. అవి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

నవగ్రహ ప్రదక్షిణ సమయంలో తీసుకోవలసిన మెలకువలు
సాధారణంగా నవగ్రహాలలో సూర్యుడి విగ్రహం మధ్యలో తూర్పు దిక్కున వుంటుంది. ఆలయంలోకి ప్రవేశించే వారు సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్లి ఎడమ వైపు నుండి (అంటే చంద్రుడి వైపు నుండి) కుడి వైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి.

ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.

చాలా మంది ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలను ముట్టుకుని మరీ నమస్కారాలు చేస్తుంటారు. కానీ అది తప్పు. విగ్రహాలను తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. దీక్ష తీసుకున్నవారుగానీ, ముఖ్యమైన పూజలు నిర్వహించేవారు గానీ అభ్యంగన స్నానం చేసి మడి దుస్తులు ధరిస్తే అప్పుడు విగ్రహాలు తాకవచ్చు.

ప్రార్థనలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం. 



Friday, March 22, 2013

కర్తవ్యమే భవిష్యత్ సూచిక ....!?








రోడ్డుపై వెళ్తున్న ఓ బాటసారి హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయి అపస్మారక స్థితిలో అలాగే కూలబడ్డాడు. అయితే ఆ దారిలో వెళ్తున్న ఏ ఒక్కరు కూడా అతన్ని సమీపించేందుకు ప్రయత్నించలేదు. తమ పనులు తాము చూసుకోసాగారు. అందులో కొంతమందేమో బాగా తాగి పడిపోయాడని భావించారు.

అయితే చివరగా అటువైపే వెళ్తున్న ఓ సాధారణ వ్యక్తి అతగాడి పరిస్థితికి జాలిపడ్డాడు. అతడిని సమీపించి అతని నాడిని పరీక్షించి ముఖం మీద నీళ్లు చల్లి, ఓ గుక్కెడు నీళ్లు తాగించాడు. కాసేపటికి సొమ్మసిల్లి పడిపోయిన బాటసారికి తెలివొచ్చింది. వెంటనే తనను కాపాడిన వ్యక్తికి పదేపదే ధన్యవాదాలు తెలుపుకున్నాడు.

సరైన సమయంలో ఆదుకున్నందుకు గాను తగినంత బహుమతి కోరాల్సిందిగా సూచించాడు బాటసారి. నేను మీకు ఏమి చేయాలో దయచేసి చెప్పాల్సిందిగా తనకు సాయం చేసిన వ్యక్తిని మళ్లీ అడిగాడు. దానికా వ్యక్తి నేను డబ్బు కోసమో లేదా ఏ స్వలాభం కోసమో మీకు సాయం చేయలేదని సావధానంగా సమాధానమిచ్చాడు. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ఈ పని చేశానని వివరించాడు.


కానీ బాటసారి మాత్రం వదలలేదు. ప్రతిఫలంగా ఏదో తీసుకోందే తన మనసు తృప్తి చెందదని విజ్ఞప్తి చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఇలా అన్నాడు. "ప్రకృతిని ఓ సారి చూడండి, అద్భుతమైన వృక్షాలు, అందమైన పక్షులు, పచ్చటి ఆకులు, నీలిరంగులోని ఆకాశాన్ని చూడండి. అవి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతృప్తినిస్తాయి. కానీ ప్రతిఫలంగా అవి ఏమీ తీసుకోవు. నిజంగా మీరు నాకు ప్రతిఫలం ఇవ్వదలుచుకుంటే... ఇదే విధమైన సేవను మరొకరికి అవసరమైనప్పుడు చేయాల"ని బాటసారికి సూచించాడు. మీరు నాకిచ్చే ప్రతిఫలం అదే అని తెలిపాడు.

ఆ మాటలకు విస్తుపోయి చూసిన ఆ బాటసారి కనీసం పేరైనా చెప్పాలని ఆ వ్యక్తిని కోరాడు. "సేవకులకు భగవద్గీతలో ఎలాంటి పేరు లేదు. నేనెవరు.. నా పేరేంటి అన్నది ఇక్కడ విషయం కాదు. మీకు సాయం చేసే ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది అది చాలు" అని ఆ బాటసారికి చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు.

భగవద్గీతలోని కర్మయోగంలో ఈ అంశాన్ని పార్థుడికి శ్రీకృష్ణుడు బోధించడం తెలిసిందే కదా. దీని అర్ధం... ఎలాంటి సంబంధాలు లేకున్నా... ప్రతిఫలాన్ని ఆశించకుండా మన కర్తవ్యాలను స్వచ్ఛందంగా నిర్వర్తించాలి. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లయితే.. వారి వారి వ్యక్తిగత భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నియంత్రించవచ్చు. కనుక కర్తవ్యమే భవిష్యత్ సూచిక.



lifeplans, savings,









lifeplans, savings,












lifeplans, savings,









Thursday, March 21, 2013

మన స్వభావాన్ని బట్టే మన ఆలోచనలుంటాయి : రామకృష్ణపరమహంస







ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఆదమరచి నిద్రపోతున్నాడు. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోడ్డు మీదుగా ఒక దొంగ వెళుతూ అతణ్ణి చూశాడు. బహుశా రాత్రి ఎక్కడో కన్నం వేసుంటాడు. దోచుకున్న సోమ్మంతా మోయలేక ఇక్కడిలా పడి ఉంటాడనుకున్నాడు.

కొద్దిసేపటికి ఒక తాగుబోతు ఆ దారిన వెళుతూ పడుకున్న మనిషిని చూశాడు. బహుశా తప్పతాగి పడి ఉంటాడనుకున్నాడు. మరికొంతసేపటికి అదేమార్గంలో ఒక సాధువు వెళుతూ నిద్రపోతున్న ఆ మనిషిని చూశాడు. బహుశా ఈ మనిషి దైవధ్యానంలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. అందుకే ఒళ్ళుతెలియని స్థితిలో ఇలా పడుకుని ఉన్నాడు. ఎంత అదృష్టవంతుడు! అనుకున్నాడు.

మన స్వభావాన్నిబట్టే మన ఆలోచనలుంటాయి. వ్యతిరేకదృష్టితో మనం ప్రపంచాన్ని చూసినప్పుడు అంతా వ్యతిరేకంగానే కనిపిస్తుంది. అందువల్ల మనసు అశాంతికీ, అల్లకల్లోలానికీ లోనవుతుంది. అలాకాక ఎదుటివారిని అనుకూల దృష్టితో చూడండి, అప్పుడు మనసు ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉంటుందంటారు శ్రీరామకృష్ణపరమహంస. 

 

Wednesday, March 20, 2013

బలం లేని సమయంలో పంతాలకి వెళ్ళవద్దు : వేమన







నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమికాని తన బలిమి కాదయా!

అన్నసత్యం విస్మరించకూడదు. అందుకే అనువుగాని చోట ప్రజలు తమ ఆధిక్యం ప్రకటించుకోకూడదు. వాళ్లు కొద్దిగా తగ్గివుంటే తప్పులేదు. అంత కొండసైతం అద్దంలో కొద్దిగానే కనబడుతుంది. అనువుగానివేళ - విజయుడిమ్ము దప్పి విరటుని కొలవడా? కనుకనే సమయం వచ్చేదాకా తగ్గాలి. బలిమి లేనివేళ పంతాలు చెల్లవు బలిమి సంతరించుకోవాలి. 



 

Saturday, March 16, 2013

తేనెను నీటిలో కలుపుకుని తాగితే బొజ్జ తగ్గిపోతుందట!







కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారిని ఆధునిక కాలంలో ఊబకాయం వేధిస్తోంది. ఊబకాయంతో బొజ్జ పెరిగిపోతుందే అని బాధపడుతున్నారా.. అయితే తేనెను నీటిలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడున తాగితే... రెండే నెలల్లో మీ బొజ్జ తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తేనెను టీ, కాఫీల్లో తీసుకుంటే అలసట తొలగిపోతుంది. తేనెలోని గ్లూకోజ్ రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. తద్వారా గుండెపోటు వ్యాధులు దరిచేరవు. కంటి జబ్బులు, చర్మ సంబంధిత వ్యాధులు కూడా తేనె వాడకంతో నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే అల్లం రసంతో తేనెను కలిపి కాస్త వేడిచేసి ఆరబెట్టాలి. ఈ రసాన్ని తినేందుకు ముందు ఒక స్పూన్, సాయంత్రం ఒక టేబుల్ స్పూన్‌ వేడినీటితో కలుపుకుని తాగితే 40 రోజుల్లో పొట్ట తగ్గిపోతుంది.

ఇక అనాస పండులో కూడా పొట్టను తగ్గించే గుణం ఉంది. అనాసపండు ముక్కల్ని, వోం పొడితో నీళ్లలో రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం ఆ రసాన్ని పరగడుపన తాగితే మీ పొట్ట తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.