Wednesday, February 26, 2014

అబ్బాయే కావాలి.. అమ్మాయిలొద్దు బాబోయ్!: గర్భిణీ మహిళలు







నాకు అబ్బాయే కావాలని కోరుకునే వారిలో మహిళలే ముందున్నారని సర్వేలో తేలింది. అబ్బాయి పుట్టలేదని వేధించే అత్తలు, భర్తల తలనొప్పి తట్టుకోలేక మహిళల అబ్బాయిలే పుట్టాలని చాలా మంది మహిళలు అనుకుంటున్నారట.

అత్తల వేధింపులు కాస్త తక్కువైనా., మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్న తరుణంలో అమ్మాయిలు వద్దు బాబోయ్ అంటూ తల్లులు భయపడిపోతున్నారు.

చిన్నారి, బాలికల్ని కూడా కామాంధులు వదిలిపెట్టట్లేదని, అందుకే ఆడపిల్లలు మాకొద్దంటూ అనేక మంది మహిళలు భావిస్తున్నారట.

అయితే వైద్యులు మాత్రం మీకు అబ్బాయి పుట్టాలంటే ప్రారంభం నుంచే పోషకాహారం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. వేవిళ్లతో ఆహారాన్ని మానేయకూడదని, ముఖ్యంగా అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకుండా ఉండకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంచెం కొంచెంగా ఆహారాన్ని తీసుకుంటూ వుండాలి.

అంతేగాకుండా గర్భ ధారణ ప్రారంభంలో ఓ మహిళ తీసుకునే ఆహారమే గర్భస్థ శిశువు ఆడా, మగా అనేది నిర్ణయిస్తుందని వైద్యులు అంటున్నారు.

ఓ గర్భిణీ మహిళల గర్భధారణ నిర్ధారణ అయినప్పటి నుంచి పోషకాహారం తీసుకోవడం, తీసుకునే ఆహారంలో ఫాట్ అధికంగా ఉండేలా తీసుకుంటే తప్పకుండా అబ్బాయే పుడతాడని తాజా పరిశోధనలో తేలింది.

అదే లో ఫాట్ ఫుడ్, ఆహారాన్ని వేళకు తీసుకోని మహిళలకు ఆడపిల్లలే పుట్టే అవకాశాలు అధికంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. సో.. మీకు అబ్బాయి కావాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 


Monday, February 24, 2014

కాకికి అన్నం ఎందుకు పెట్టడం?








కాకి శనైశ్చరుని వాహనం. మనము భోజనం చేసేముందు అన్నము దేవునికి నివేదనం చేసి కాకికి పెట్టమని మన పెద్దలు శాస్త్రము చెపుతున్నది. కాకి శనైశ్చరుని వాహనము మరియు మన పితరులు కూడా
కాకి స్వరూపములో మనచుట్టూ తిరుగుతూ వుంటారు. కాకి యమలోక ద్వారమందు వుంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ వుంటుంది.

కాకికి అన్నము పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు ఆశ్వాసము చెంది మనకు అసీర్వాదములు ఇస్తారు. కాకి అపర కార్యాడులందు మరియు శ్రాద్ధ దినమందు అన్నము ముట్టకపోతే మన పితరులకు మనపై ఆగ్రహం లేక కోపం వుందనేది పెద్దల మాట. అందువల్లే కాకి అన్నము ముట్టే వరకు తాపత్రయపడి ముట్టిన తర్వాత భోజనం చేస్తారు.

గయలో మనం పిండాలను వేసే శిలకు పేరు కాక శిల అని పేరు ఆ శిలపై పిండాములు వుంచి మన పితరులను ప్రార్తిస్తే కాకి తానొక్కటే భుజించకుండా కావు కావు మని కేకలు వేసి తన వారినందరినీ చేర్చుకొని అన్నము తింటుంది. అంత గొప్ప వివేకము గల ప్రాణి కాకి. గరుడ పురాణం మరియు తదితర పురాణములు మన పితరులు కాక రూపములో భూలోక సంచారం చేస్తూ మనము సమర్పించే అన్నము తింటూ మనలను ఆశీర్వదిస్తారు..

కాకికి అన్నము పెట్టేదాని వలన కుటుంబమున అన్యోన్యత సఖ్యత కలిగి వుంటారు. శని దేవత వాహనం కాకి అందువల్ల మనకు శని అనుగ్రహం కూడా కలుగును. కాకి ఎవ్వరికీ హాని చేయని ప్రాణి మన చుట్టూ వుండే అశుద్దములను తొలగించటంలో మనకు సహాయ పడుతుంది కాబట్టి కాకికి అన్నం పెట్టడం అనే ఆచారం కూడా మన పెద్దలు ఏర్పాటు చేసారు .


Thursday, January 23, 2014

వయస్సు పైబడే కొద్ది స్త్రీల పిరుదుల సైజు పెరుగుతుంది ఎందుకని....!?






సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ మహిళల నడుం, పిరుదుల సైజు లేదా బరువు పెరుగుతుంది. ముఖ్యంగా 45 యేళ్లు పైబడిన స్త్రీలలో ఈ మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి ఎందుకని.?

సాధారణంగా ప్రతి మహిళ ఉన్నట్టుండి బరువు పెరగదు. ఇది క్రమేణా కనిపించే మార్పులు. అయితే, ప్రసవానికి ముందు లేదా తర్వాత మహిళల వక్షోజాలు పెరుగుతాయి. వక్షోజాల్లో పాలు వచ్చి చేరడం వల్ల వాటి సైజుల్లో తేడాలు కనిపిస్తాయి.

అలాగే, ఎక్కువ సమయంలో ఆఫీసుల్లో, గృహాల్లో కూర్చొనే మహిళలు, ఎక్కువ సార్లు సెక్స్‌లో పాల్గొనే స్త్రీల పిరుదులు పెరుగుతాయి. ఇవి శాస్త్రీయంగా కూడా పరిశోధకులు నిర్ధారించారు. వివాహానికి ముందు స్త్రీ పిరుదులకు, వివాహమైన నెలరోజుల తర్వాత మహిళ పిరుదుల్లో వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. అలాగే, గృహాల్లో ఎల్లపుడూ కూర్చొనివుండే మహిళల పిరుదులు, నడుం పెరుగుతాయని నిపుణులు చెపుతున్నారు. 

Sunday, January 19, 2014

ఒక కప్పు పెరుగుతో 20 తులసీ ఆకులను నమిలితే...!?





తులసి ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌ను నశింపజేసే శక్తి తులసీ ఆకులకు ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే తులసీ ఆకులు ఆస్తమా, కేన్సర్‌లకు చెక్ పెడుతుంది. తులసీ ఆకుల రసంలో మిరియాల పొడి చేర్చి తాగితే ఆస్తమా, కేన్సర్లు దరి చేరవు.

రోజూ 20 తులసీ ఆకులను నమిలితే కేన్సర్ ఫస్ట్ స్టేజ్‌ను నయం చేయవచ్చు. అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు పెరుగుతో 20 తులసీ ఆకుల్ని తీసుకుంటే కేన్సర్ నయం అవుతుంది. రోజూ తులసీ ఆకుల్ని నాలుగేసి నమిలితే కేన్సర్ దరిచేరదు.

ఇంకా తులసీ ఆకుల్ని రోజూ నమలడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇకపోతే.. ఎయిడ్స్‌కు తులసీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తి నశింపజేసే బ్యాక్టీరియానే ఎయిడ్స్‌కు కారణం. అందుచేత వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం తులసీ ఆకుల్లో ఉంది.

అలాగే బ్యాక్టీరియాలను నశింపజేసే శక్తి కూడా తులసీ ఆకులకు ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


Saturday, January 18, 2014

పులిపిరికాయలు... బొప్పాయి పాలతో రాలగొట్టండి...!





శరీరంపై చిన్నచిన్న పొక్కులుగా వచ్చే పులిపిరికాయలు కాస్త గట్టిగా కూడా ఉంటుంటాయి. ఈ పులిపిర్లు సాధారణంగా ముఖం, చేతులు, కాళ్లపై వస్తుంటాయి. ఇవి వైరస్ క్రిముల వల్ల కలుగుతాయి. వీటితో బాధ లేకపోయినప్పటికీ ముఖంపై వస్తే చూసేందుకు ముఖం వికృతంగా ఉంటుంది. వీటిని వదిలించుకునేందుకు ఆయుర్వేదంలో చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం...

బొప్పాయి చెట్టు పాలను పులిపిరికాయల మీద రాస్తూ వుంటే క్రమేపీ అవి రాలిపోతాయి. ఇంకా చిత్రమూలము వేరును నీటిలో అరగదీసి, ఆ గంధమును పులిపిరికాయల మీద రాస్తుంటే తగ్గుతాయి.

సబ్బు, సున్నము రెండూ సమపాళ్లలో కలిపి, పులిపిరికాయలపై అద్ది ఉంచుతుంటే కొన్ని గంటలలో ఇవి చర్మము నుండి ఊడిపోవడం జరుగుతుంది.



Friday, January 17, 2014

మహిళలూ బరువు తగ్గాలనుకుంటే.. సబ్జా గింజల్ని?





మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.

బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.

శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.

ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.