Wednesday, February 26, 2014

అబ్బాయే కావాలి.. అమ్మాయిలొద్దు బాబోయ్!: గర్భిణీ మహిళలు







నాకు అబ్బాయే కావాలని కోరుకునే వారిలో మహిళలే ముందున్నారని సర్వేలో తేలింది. అబ్బాయి పుట్టలేదని వేధించే అత్తలు, భర్తల తలనొప్పి తట్టుకోలేక మహిళల అబ్బాయిలే పుట్టాలని చాలా మంది మహిళలు అనుకుంటున్నారట.

అత్తల వేధింపులు కాస్త తక్కువైనా., మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్న తరుణంలో అమ్మాయిలు వద్దు బాబోయ్ అంటూ తల్లులు భయపడిపోతున్నారు.

చిన్నారి, బాలికల్ని కూడా కామాంధులు వదిలిపెట్టట్లేదని, అందుకే ఆడపిల్లలు మాకొద్దంటూ అనేక మంది మహిళలు భావిస్తున్నారట.

అయితే వైద్యులు మాత్రం మీకు అబ్బాయి పుట్టాలంటే ప్రారంభం నుంచే పోషకాహారం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. వేవిళ్లతో ఆహారాన్ని మానేయకూడదని, ముఖ్యంగా అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకుండా ఉండకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంచెం కొంచెంగా ఆహారాన్ని తీసుకుంటూ వుండాలి.

అంతేగాకుండా గర్భ ధారణ ప్రారంభంలో ఓ మహిళ తీసుకునే ఆహారమే గర్భస్థ శిశువు ఆడా, మగా అనేది నిర్ణయిస్తుందని వైద్యులు అంటున్నారు.

ఓ గర్భిణీ మహిళల గర్భధారణ నిర్ధారణ అయినప్పటి నుంచి పోషకాహారం తీసుకోవడం, తీసుకునే ఆహారంలో ఫాట్ అధికంగా ఉండేలా తీసుకుంటే తప్పకుండా అబ్బాయే పుడతాడని తాజా పరిశోధనలో తేలింది.

అదే లో ఫాట్ ఫుడ్, ఆహారాన్ని వేళకు తీసుకోని మహిళలకు ఆడపిల్లలే పుట్టే అవకాశాలు అధికంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. సో.. మీకు అబ్బాయి కావాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.