Showing posts with label Food. Show all posts
Showing posts with label Food. Show all posts

Thursday, November 22, 2012

బాసుందీని ఎలా తయారు చేయాలో తెలుసా...!?







బాసుందికి కావలసిన పదార్థాలు:
పాలు : ఒక లీటరు (ఫుల్ క్రీమ్)
పంచదార: 3/4 కప్పు
బాదామ్ పేస్ట్ : పావు కప్పు
యాలకుల పొడి : అర టీ స్పూన్

తయారుచేసే విధానం:
పాలను బాగా మరిగి సగం అయ్యే వరకు కలియబెడుతూ ఉండండి. తర్వాత చక్కెరను, బాదాం పేస్ట్‌ను పాలలో వేసి కలగలపండి. పంచదార కరిగిన తర్వాత పొయ్యి నుంచి మరిగిన పాలను దించండి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత బాదాంను సన్నగా తరగి వడ్డించండి. 


Friday, November 2, 2012

టమోటో సూప్-వింటర్ స్పెషల్....!?








వింటర్ లో చలి... గిలి... ముఖ్యంగా ఆహారం మీద ఆసక్తిని తగ్గిస్తుంది. వేడి వేడిగా ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి అనిపస్తుంటుంది. అయితే సరిగ్గా ఆహారం తీసుకోక పోవటం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికో చక్కని పరిష్కారం సూప్. వేడి వేడిగా ఓ కప్పు సూప్ తాగితే నీరసమూ ఎగిరపోతుంది. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. సూప్ ఒత్తిడిని తొగించి హృదయాన్ని తేలికపరుస్తుంది. ఆహారాన్ని తీసుకోవాలనే ఆత్రుతను రేపుతుంది. మరీ అలాంటి సూప్ ను ఓసారి ట్రై చేసి చూడండి...

కావలసిన పదార్థాలు:

టమాటాలు: 8
నీళ్లు: 4cups
మిరియాల పొడి : 1tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం:

1. ముందుగా టమాటోలను శుభ్రంగా కడిగి, రెండు విజల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

3. ఇప్పుడు ఈ మిశ్రమానికి నీటిని కలిపి స్టౌ మీద పెట్టాలి. బాగా మరుగుతుండగా మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అల్లం , వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి.

4. మంట తగ్గించి మరో పది నిమిషాల పాటు మరిగించి దించేసుకోవాలి. పుదీనా చల్లుకుని వేడి వేడిగా సేవిస్తే చాలా రుచిగా ఉంటుంది. అంతే టమోటో సూప్ రెడీ...


చలి.. గిలి...ఆలూ మిర్చీ బజ్జీ.. భలే భలే.....!?








స్పైసీ మిర్చీ బజ్జీ ఇండియన్ హాట్ స్నాక్. ఈవినింగ్ స్నాక్స్ లో అతి త్వరగా, సులభంగా తయారు చేసుకొనేది ఈ మిర్చీబజ్జీయే .వర్షాకాలంలో సన్నని వర్షపు జల్లుల మధ్య వేడి వేడి మిర్చీ బజ్జీ భలే రుచిగా ఉంటుంది. మిర్చీ బజ్జీ అంటే ఇష్టపడని వారుండరు. అయితే కొంత మంది మాత్రం పచ్చిమర్చిని తినడానికి బయపడుతుంటారు. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, సి, మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. బంగాళా దుంపలో పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే సి విటమిన్ కూడా అధికమే.

కావలసిన పదార్థాలు:

బజ్జీ పచ్చిమిర్చి (పొడవైనవి): 20
బంగాళాదుంపలు: 1/4kg
కారం: 1tbsp
గరం మసాలా: 1tbsp
చాట్ మసాలా: 1tsp
కొత్తిమీర తరుగు: 1tbsp
ఉప్పు: రుచికి తగినంత
పిండికోసం:
శెనగపిండి: 250grms
బేకింగ్ సోడా: 1tsp
కారం: 1tsp
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: రుచికి తగినంత


1. ముందుగా పచ్చిమిర్చిని మంచినీళ్ళలో వేసి బాగా కడికగి ఒక ప్లేట్ లోనికి తీసుకొని, తడి ఆరిన తర్వాత ఒక సైడ్ మద్యకు పొడవుగా కట్ చేసి మద్యలో నుండి మిర్చీలోని గింజలను తొలగించి పక్కన పెట్టుకోవాలి.

2. బంగాళాదుంపలకు ఉడికించి తర్వాత పొట్టుతీసి చిదిమి పెట్టుకోవాలి. దానికి కారం, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు, గరం మసాలా మరియు ఉప్పు చేర్చి అన్నింటినీ బాగా కలగలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని (మిర్చి సంఖ్య)20 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో మిశ్రామన్ని డలుగా లేదా మిర్చి పొడవుగా చేత్తో రుద్దుకోవాలి.


3. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకొన్న మిర్చీలోనికి బంగాళాదుంప మిశ్రమాన్ని ఒక్కో మిర్చిలోపల పెట్టాలి. ఇలా అన్ని మిర్చీలు నింపుకొని పక్కన పెట్టుకోవాలి.


4. ఇప్పుడు బజ్జీలను వేయడానికి బజ్జీ పిండిని తయారు చేసుకోవాలి. అందుకు మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో శెనగపిండి, కారం, ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి పిండిని జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.


5. పది నిమిషాల తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి, నూనె పోసి వేడయ్యాక స్టఫ్డ్ మిర్చినీ శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగే నూనె లోవేసి దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి, ప్లేట్ లోనికి తీసుకొని కోకన్ చట్నీ లేదా పుదీనా చట్నీతో హాట్ హాట్ గా సర్వ్ చేయాలి.



పొటాటో స్నాక్.....!?









పొటాటో స్నాక్స్ ఇతర స్నాక్స్ కంటే ప్రత్యేకమైనవి. పొటాటో స్నాక్స్ ను చూడగానే నోరూరుతుంది. క్రిస్పీగా, టేస్టీగా ఉండే పొటాటో స్నాక్స్ పిల్లలూ, పెద్దలూ అందరూ ఇష్టపడతారు. అందుకే పొటాటో స్నాక్స్ రెసిపీ తెలుసుకుందాం. ....

కావలసిన పదార్థాలు:
 
గోధుమ పిండి : 2 cups
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 10
బంగాళాదుంపలు: 1/2kg
నెయ్యి : 2tbsp
అల్లం: చిన్న ముక్క
ఉప్పు: రుచికి తగినంత


తయారు చేయు విధానం:

1. ముందుగా గోధుమ పిండి జల్లించుకుని నీళ్ళు, ఉప్పు వేసి, పూరీ పిండిలా ముద్దగా చేసుకోవాలి.


2. తర్వాత బంగాళాదుంపలు ఉడికించి, పొట్టుతీసి, చిదుముకోవాలి.


3. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం నూరి ముద్దచేసుకోవాలి. గోధుమపిండిలో బంగాళాదుంపల ముద్ద, ఉల్లి, మిర్చిల ముద్ద, ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.


4. ఇప్పుడు ఈ పిండిని చిన్న ఉండలుగా తీసుకుని, నచ్చిన ఆకృతిలో వత్తుకుని ఎర్రగా వేయించాలి. ఈ పొటాటో స్నాక్స్ ఎంత రుచిగా ఉంటాయో, తయారుచేయడం అంత సులువే.



Wednesday, August 1, 2012

మళ్ళీ మళ్లీ తినాలనిపించే వెజిటేబుల్ సమోసా.......!?









ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా.. చల్లగా కాదు చలిచలిగా ఉండి.. వేడి వేడిగా ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తుంటుంది. లేదా వేడి వేడి మసాల ఛాయ్ తాగాలనిపిస్తుంది. వర్షకాలంలో ఇటువంటి ఆలోచనలు రావడం సహజం అంతే కాదు వీటిని తీసుకొని వర్షాకాలంలో బద్దకాన్ని వదిలి రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది.


ముఖ్యంగా వర్షాకాలంలో వేడి వేడిగా తయారు చేసుకొనేవి, సమోసాలు లేదా పకోడా. మరి ఈ వర్షాకాలంలో ఒక స్పెషల్ సమోసా తినాలిపిస్తుంటే.. ఈ వెరైటీ వెజిటేబుల్ సమోసా తయారు చేసి తింటూ వర్షంలో ఎంజాయ్ చేయండి...

కావలసిన పదార్థాలు:

బంగాళదుంప: 3-4(ఉడికించి పొట్టుతీసి, చిదిమి పెట్టుకోవాలి)
క్యాబేజ్: 1cup(చిన్న తరిగి ఉడికించుకోవాలి)
పన్నీర్: 50grms(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్: 1/2cup(చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించినవి)
పచ్చిబఠానీ: 1/2cup(ఉడికించినవి)
పచ్చిమిర్చి: 6-8(చిన్నగా కట్ చేసినవి)
జీడిపప్పు: 5-6
గరం మసాలా: 1tsp
ఆంచూర్(డ్రై మ్యాంగో పౌడర్): 1/2sp
ఉప్పు: రుచికి సరిపడా


పిండి కలుపుకోవడానికి:
మైదా: 2cups
నూనె: 3cups
ఉప్పు: చిటికెడు
జవైన్: 1/2tsp(అవసరమైతేనే)
నీళ్ళు: 2cups


తయారు చేయు విధానం:

1. ముందుగా పెద్ద బౌల్ తీసుకొని అందులో పిండకి తీసుకొన్న పదార్థాలన్నింటినీ వేసి, నీళ్ళు చేర్చి చపాతీ పిండిలా మృధువుగా కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాత పిండి మీద తడి వస్త్రం కప్పి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.


2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పొటాటో, క్యాప్సికమ్, క్యాబేజ్, పచ్చిబఠానీ, మరియు పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా కలుసుకోవాలి.


3. అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా చిలకరించి, గరం మసాలా, ఆంచూర్ అన్ని వేసి మరికొంచెం మృదువుగా కలుపుకోవాలి. స్టఫింగ్ మసాలా మరికొద్దిగా కారంగా ఉండాలనుకొంటే అందులోనే కారం పొడిని వేసి మిక్స్ చేసుకోవచ్చు.


4. తర్వాత ముందుగా కలిపి పెట్టుకొన్న చపాతీ పిండిని కొద్దికొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చపాతీలా వత్తకొని మద్యకు కట్ చేసి డైమండ్ షేప్ లో మడచుకోవాలి.


5. తర్వాత అందులో ముందుగా తయారు చేసుకొన్ని స్టఫింగ్ మసాలా ఒకటి లేదా ఒకటిన్న చెంచా పెట్టి అంచులను మడిచి నూనె లేదా నీటితో అంచులను పూర్తిగా కవర్ అయ్యేలా వత్తుకోవాలి. లేదంటా లోపల ఉన్న మిశ్రమం బటకు వచ్చి నూనె అంతా పాడవుతుంది. ఇలా అన్ని తయారు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.


6. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌమీద పెట్టి అందులో సరిపడా నూనె వేసి బాగా కాగిన తర్వాత మంట తగ్గించి అందులో చుట్టిపెట్టుకొన్న సమోసాను ఒక్కొక్కటే నూనెలోకి విడవాలి. నూనెలో బాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే వెజిటేబుల్ సమోసా రెడీ. దీన్ని టమోటో కెచప్ లేదా చిల్లీ సాస్ తో ఒక కప్పు టీ లేదా కాఫీతో సర్వ్ చేయండి కూల్ కూల్ ఈవెనింగ్ ను ఎంజాయ్ చేయండి...



Tuesday, July 3, 2012

దమ్ ఆలూ......!?








 శాకాహారం మాత్రంమే ఎక్కువగా ఇష్టపడే వారు..  శాఖాహారంలో  ఇష్టమైన ఆహారం ఆలూ దమ్. ఆలూ దమ్ ఇండియన్ ఫుడ్ లో అత్యంత ప్రాచుర్యం పొందినది. ఆలూ దమ్ ను బేబీ పొటాటో, పచ్చిబటానీలతో తయారు చేస్తారు.  దమ్ ఆలూ మీకోసం...

 కావలసిన పదార్థాలు:
ఆలూ(బంగాళదుంపలు): 1/2kg
నీళ్ళు: 2cups
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి లేదా నూనె: వేయించడానికి సరిడా
నెయ్యి: 1cup
ఉల్లిపాయ: 1
టమోటో గుజ్జు: 4tbsp
పెరుగు: 1cup
వేడి నీళ్ళు: 4tbsp
మిరియాలు:
గరం మసాలా: 1tsp
లవంగాలు: 4
బిర్యాని ఆకు: 4
మిరియాలు: 1/2tsp
యాలకులు: 4
చెక్క: చిన్న ముక్క
మసాలా కోసం:
ఉల్లిపాయ: 1
వెల్లుల్లిపాయలు: 6-8
అల్లం: చిన్న ముక్క
గసగసాలు: 1tsp
ధనియాలు: 1tbsp
జీలకర్ర: 1tsp
ఎండు మిర్చి: 2
పసుపు: 1tsp
జాపత్రి: చిన్న ముక్క
జాజికాయ: చిన్న ముక్క


తయారు చేయు విధానం:

1. ముందుగా బంగాళాదుంపలకు పై పొట్టు తీసి, ఉప్పు నీటిలో రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి.


2. రెండు గంటల తర్వాత పొట్టు తీసి పొడి వస్త్రంతో తేమను పూర్తిగా తుడిచి పక్కన పెట్టుకోవాలి.


3. తర్వాత పాన్ లో నూనె లేదా నూనె లేదా నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో బంగాళదుంపలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి.


4. తర్వాత వేరొక పాన్ లో తగినంత నూనె వేసుకొని, వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.


5. అంతలోపు మసాల కోసం సిద్దం చేసుకొన్న పదార్ధాలన్నింటిని మిక్సీ జార్ వేసి మెత్తని పేస్ట్ ను తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగే ఫ్రై చేయాలి.


6. పది నిమిషాల తర్వాత అందులో టమోటో గుజ్జు, పెరుగు, ఉప్పు, బాగా మిక్స్ చేయాలి.


7. తర్వాత అందులో వేయించి పెట్టుకొన్ని ఆలూ(బంగాళదుంప), కొద్దిగా వేడి నీళ్ళు పోసి మీడియం మంట మీద మరో ఐదు 5నిమిషాల పాటు ఉడికించుకోవాలి.


8. చివరగా ఈ దమ్ ఆలూ మీద మిరియాలపొడి మరియు గరం మసాలా చల్లి రెండు మూడు నిమిషాల తర్వాత దించేసుకోవాలి. అంతే దమ్ ఆలూ రెడీ.



Tuesday, June 5, 2012

స్వీట్ లస్సీ తయారు చేయడం ఎలా..!!?








కావలసిన పదార్థాలు :-

చల్లటి, తియ్యని పెరుగు - 140 గ్రా,
పంచదార సిరప్ - 25 ఎం.ఎల్,
చిలికిన పెరుగు, పిస్తా పలుకులు - గార్నిష్ కోసం,

తయారు చేసే విధానం :

పెరుగును బాగా చిలికి 10 ఎం.ఎల్ చల్లని నీళ్లు పోసి కలపాలి. దీంట్లో పంచదార సిరప్ వేసి రుచిని బట్టి కలుపుకోవాలి. కర్వ్ చేసే ముందు పైన చిలికిన పెరుగు, పిస్తా పప్పు పలుకులు గార్నిష్ చేయాలి.


Saturday, June 2, 2012

గ్రీన్ పీస్ చాట్... ..!?






బఠాణీల్లో మాంస కత్తులు మాంసాహార పోషకాలకు సరిసమానం అని చెప్పవచ్చును. వీటి లో పీచు పదార్ధము ఎక్కువ. బటానిలోని సి-విటమిన్ శరీర వ్యాధినిరోధక శక్తిని పెంపొందితుంది ... కాన్సర్ రాకుండాను, కీళ్ళ జబ్బులు రాకుండా కపుడుతుంది . . . యాన్తి ఆక్షి డెంట్ గా కానాల స్ఖీనతను తగ్గిస్తుంది. రక్తకణాల... ముఖ్యము గా ఎర్ర రక్త కణాలూ అభివృద్దికి దోహదపడి.. రక్తహీనతను రాకుండా కాపాడును. ప్రోటీన్లు పుస్కలముగా ఉన్నందున శరీర కండరాలను అభివృద్ధి చేయును .

కావలసిన పదార్థాలు:

తెల్ల లేద పచ్చిని బఠాణీలు: 1/2kg
పచ్చిమిర్చి: 6-8
చాట్ మసాలా: 1tsp
టమోటో: 2
పెప్పర్(మిరియాలు) పౌడర్: 1tsp
ఉల్లిపాయలు: 2
కొత్తిమీర తరుగు: 1cup
నిమ్మరసం: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp


తయారు చేయు విధానం:

1. ముందుగా తెల్లని లేదా పచ్చని బఠాణీలు ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టి, తర్వాత ఉడికించి పక్కన పెట్టుకోవాలి.


2. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.


3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికించిన బఠాణీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఛాట్ మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, కారం వేసి కలపాలి.


4. చివర్లో నిమ్మరసం పిండితే చాలు. దీన్ని సర్వింగ్ ప్లేట్ లో పెట్టి చుట్టూ గుండ్రంగా, చక్రల్లా కోసిన టమోటో ముక్కలతో అలంకరించి పిల్లల ముందు పెడితే క్షణాల్లో ప్లేట్లు ఖాళీ చేస్తారు.. అఫ్ కోర్స్ పెద్దలైనా సరే.....



వెజిటేబుల్ ఇడ్లీ...!?







కావలసిన పదార్ధాలు
ఇడ్లీ రవ్వ: 1cup
ఉద్దిపప్పు: 1cup
క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యారెట్ : 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బీన్స్ : 1/4cup(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర తురుము: 2tbsp
అల్లం: చిన్న ముక్క(తురుము)
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 1tsp


తయారు చేయు విధానం

1. ముందుగా ఇడ్లీ పిండిని తయారు చేసుకోవాలి. అందుకు ఒక్క రోజూ ముందుగా ఉద్దిపప్పును నీటిలో 3-4 గంటసేపు నానబెట్టి, తర్వాత మెత్తగా గ్రైడ్ చేసి, రుబ్బుకొన్న పిండిలో ఇండ్లీ రవ్వను, కొద్దిగా ఉప్పు చేర్చిబాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.


2. మరుసటి రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసే ముందుగా క్యారట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చిల ను శుభ్రమైన నీటిలో కడిగి ఒక ప్లేట్ లోనికి తీసి పెట్టుకోవాలి.


3. తర్వాత వీటంన్నింటిని ఒక్కొక్కొటీ సపరేట్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా కడిగి, సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.


4. అల్లం కూడా పై పొట్టు తీసి, కడిగి తర్వాత తురుమి పెట్టుకోవాలి. లేదా (పచ్చిమిర్చి, అల్లం కు కొద్దిగా ఉప్పు చేర్చి మిక్సీలో రఫ్ గా గ్రైడ్ చేసి వేసుకోవచ్చు)


5. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకొన్న అన్ని వెజిటేబుల్స్ ను వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.


6. తర్వాత ఇడ్లీ గిన్నెలకు నెయ్యి రాసి వెజిటేబుల్ మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్స్ లో రౌండ్ గా అమర్చుకొని, దాని మీద ఇడ్లీ పిండిని పోసి నింపుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్ లో నింపుకొన్న తర్వాత ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి.


7. అంతే పది నిమిషాల తర్వాత ఇడ్లీ స్టాండ్ క్రిందికి దింపుకొని ఇడ్లీలకు కొద్దిగా నెయ్యి రాసి తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్స్ లో హాట్ హాట్ గా సర్వ్ చేయాలి. ఈ న్యూట్రియట్ బ్రేక్ ఫాస్ట్ ఇంటిల్లిపాదికి ఆరోగ్యకరం. ఇడ్లీకి మీకు ఇష్టమైన కారమైన చట్నీతో సర్వ్ చేస్తే భలే టేస్ట్ గా ఉంటాయి.



Friday, June 1, 2012

పొటాటో కట్ లెట్....!?







మన ఇళ్లలో చాలా మంది బంగాళదుంప ‘ఆరోగ్యానికి' మంచిది కాదని చెబుతుంటారు, కాని స్వచ్ఛమైన బంగాళదుంపలు అత్యధిక కార్బొహైడ్రేట్లను కలిగి ఆరోగ్యానికి మంచి చేకూరుస్తాయి. రకరకాల వంటకాలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. కూరగాను, చిప్స్ గాను, వేపుడు కూరగాను, ఇతర కూరలలోను, చికెన్‌, మటన్‌ వాటితో కలిపి గాని వాడితే మంచి రుచిగా ఉంటయి. ఇవి రుచింకే కాదు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజలవణాలు ఉన్నాయి. . . ఉదా : విటమిన్‌ సి , పొటాషియం , ఐరన్‌ , బి-కాంప్లెక్ష్ మున్నగునవి.

కావలసిన పదార్థాలు:

పొటాటో(బంగాళదుంప): 4
బ్రెడ్ స్లైస్: 6(చివరలు కట్ చేసి పొడిపొడిగా చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తమీర-పుదీనా తరుగు: 2tbsp
గరం మసాలా: 1/2tsp
ధనియా పౌడర్: 1tsp
బియ్యం పిండి: 3tsp
ఆమ్ చూర్ పౌర్(ఎండిన మామిడి పొడి): 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా బంగాళదుంపలను కావలసిన సైజులో కట్ చేసుకొని కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి.


2. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ను క్రిందికి దింపుకొని బంగాళదుంపల్లోని నీరు వంపేస్ అవసరం అయితే చల్లటి నీటిని పోసి, బంగాళా దుంపలు చల్లారిన తర్వాత బంగాళదుంపలకు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బంగాళాదుంపను చిదిమి బౌల్ లో వేసి అందులో మిగిలి పదార్థాలను కూడా చేర్చి, అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి.

4. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసుకొని, తర్వాత అరచేతిలో పెట్టి గుండ్రంగా వడ సైజులో వత్తుకోవాలి.

5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక బంగాళదుంప కట్ లెట్స్ ను అందులో కాగే నూనె వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ రెండు వైపులా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి.

6. అంతే పొటాటో కట్ లెట్ రెడీ. హాట్ హాట్ కట్ లెట్ సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే ఈవెనింగ్ హంగర్ గాన్....


టమోటో ఊరగాయ....!?






టమోటా అంటే ఇష్టం లేదని ఎవ్వరంటూరు. ఎర్రగా దోరగా నిగనిగలాడతూ చూడగానే ఇట్టే ఆకట్టుకుంటుంది. కొందరు వండేదాక అగడమాఅంటూ అలాగే తినేస్తారు. దీనితో చేయని వంటకం లేదు. కూర, చారు, పప్పు, పచ్చడి, జామ్ , జ్యూసు, కెచప్, సాస్ ... ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. మరీ టమోటో ఊరగాయతో కొంచె వెరైటీ టేస్ట్ రుచిచూద్దాం. టమోటోను తీసుకోవడం వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం...టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాల్లో సిట్రిక్ ఆమ్లం ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది.

టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది. రోగనిరోధక టమోటా తక్కువ కేలరీలు గల టమోటాలు చర్మం, కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7 శాతం వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది.

కావలసిన పదార్థాలు:
 
టమోటోలు: 1/2kg
నూనె: 1/4ltr
కారం: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
మెంతులు: 1/2tsp
ఆవాలు: 3tbsp
చింతపండు: కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు: 8-10


1. ముందుగా టమోటాల నీటిలో వేసి శుభ్రం చేసి, ప్లేట్ లోనికి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత పొడి బట్టతో తుడిచి తేమను పూర్తిగా తొలగించి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి చితగొట్టి దోరగా వేయించుకోవాలి వెంటనే అందులో టమోటో ముక్కలు, చింతపండును వేయాలి. తక్కువ మంట మీద టమోటోల్లోని తేమంతా పూర్తిగా పోయేదాకా బాగా మగ్గించాలి. 


3. ఇప్పుడు మెంతుల్ని దోరగా వేయించి.. మెత్తగా పొడి చేసుకోవాలి. మెంతి పొడి తనగినంత ఉప్పు కారం, కలిపి మరో ఐదునిమిషాలుంచాలి. 


4. వీటితో టమోటో బాగా గట్టిపడుతూ మగ్గిన తర్వాత దింపే ముందు ఆవపిండి కలిపితే సరిపోతుంది. నోరూరించే ఇస్టాంట్ టమోటో ఊరగాయ రెడీ. ఇది ఒక వారం రోజల పాటు నిల్వ ఉంటుంది. ప్రిజ్ లో పెట్టుకొంటే పదిహేను రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, వైట్ రైస్, పరోటాకి సూపర్ కాంబినేషన్.



Wednesday, May 16, 2012

వెజ్ పావ్ బాజీ.....!??







ఫాస్ట్‌ ఫుడ్‌ అనేది మన సంస్కృతి కాదు. ఇది పాశ్చాత్య ఆహార విధానం. అయితే.. పానీపూరీ, చాట్‌, పావ్‌ బాజీ వంటి ఉత్తరభారతీయ ఉపాహారాలు.. కాలగమనంలో ఫాస్ట్‌ఫుడ్‌ కేటగిరీలోకి వెళ్లాయి. అలాగే.. తెలుగు నాట మిర్చీబజ్జీ, ఆలూబజ్జీ, ఎగ్‌ బోండా వంటి కొన్ని రకాల చిరుతిళ్ళను ఫాస్ట్‌ ఫుడ్‌ కేటగిరీలో చేర్చవచ్చు. మహారాష్ట్ర విషయానికి వస్తే.. అక్కడ వడ పావ్‌ కు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. వెస్టర్న్‌ కల్చర్‌ నుండి వచ్చిన పిజ్జా, బర్గర్‌లు సంపన్నులకు చాలా ఏళ్ళతరబడి నుండే సుపరిచితం.. ఇప్పుడు బర్గర్ల సంస్కృతి మధ్యతర గతి వర్గాలను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. వర్షాకాలం, శీతాకాలంలో.. ఈ తరహా ఆహారపదార్థాలకు విపరీతమైన క్రేజ్‌ లభిస్తుంది. చాలా ఫేమస్ ఐటం ఈ పావ్ భాజీ. ఈ మసాలాపొడి రెడీగా ఉంటే పావుగంటలో ఇంట్లోనే చేసెయ్యొచ్చు. అన్ని కూరగాయలతో ఎంతో రుచిగా ఉండే ఈ డిష్ ని పిల్లలూ చాలా ఇష్టపడతారు.

కావలసిన పదార్ధాలు:
పావ్: ఒక పాకెట్
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2-4
కరివేపాకు: రెండు రెమ్మలు
టమాటాలు: 3
ఉప్పు, కారం: రుచికి సరిపడా
పసుపు: 1/2tsp
పావ్ భాజీ మసాలా: 2tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tsp
కొత్తిమీర: ఒక కట్ట
నిమ్మకాయ: ఒకటి
నూనె: సరిపడా
నెయ్యి : 2tbsp
ఆలూ(బంగాళదుంప): 3
కారట్, కాప్సికం, కాలిఫ్లవర్, పచ్చిబటానీ, కాబేజ్, బీన్స్: 1cup(అన్నీ కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసినవి)


తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.


2. ఇప్పుడు సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి బాగా మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, పావ్ భాజీ మసాలా వేసి నూనె తేలేవరకూ వేయించాలి.


3. ఇప్పుడు తరిగిన కూరగాయలు అన్నీ వేసి రెండు నిమిషాలు వేయించి తగినంత ఉప్పు, నీళ్ళు పోసి, మూతపెట్టి అయిదారు విజిల్స్ రానివ్వాలి.


4. కక్కర్ క్రిందికి దింపుకొని స్టీం(ఆవిరి)అంతా పోయాక ఉడికిన కూరగాయలని మెత్తగా మెదిపి రెండునిమిషాలు కూర చిక్కబడేవరకూ ఉడికించి కొత్తిమీర చల్లి దింపెయ్యాలి.


5. తర్వాత పావ్ ని మధ్యకి కట్ చేసి నెయ్యి వేడి చేసి పేనం పై కొంచెం వేయించాలి. వేడివేడిగా పావ్ లను కూరతో సర్వ్ చేస్తే ఘుమఘుమలాడే పావ్ భాజీ ఊరిస్తుంది.


సర్వ్ చేసేటప్పుడు కూరలో నిమ్మరసం పిండి కొత్తిమీర తరగును గార్నిష్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.



Monday, May 7, 2012

పొటాటో మిక్స్చర్......!?









కావలసిన పదార్థాలు:-
 
బంగాళదుంప తరుము: 2cups
కార్న్ ఫ్లేక్స్: 1cup
పల్లీలు: 1/2cup
కరివేపాకు: రెండు రెమ్మలు
బఠాణీలు: 1/2cup
ఎండుమిర్చి: 4-6
పసుపు : చిటికెడు
కారం: 2tsp
ధనియాలపొడి: 2tsp
మిరియాలపొడి: 1tsp
పంచదార: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా


తయారు చేయు విధానం:-

1. ముందుగా బంగాళదుంపలను తీసి కొద్దిగా లావుగా తురిమి పెట్టుకోవాలి.


2. తర్వాత ఈ తురుమును నీళ్లలో వేసి కడిగి ఆరనివ్వాలి. తర్వాత నూనెలో వేసి కరకరలాడేలా వేయించాలి.


3. అలాగే పల్లీలు, బఠాణీలు కూడా వేయించి పెట్టుకోవాలి.


4. చివరగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయించుకోవాలి.


5. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేయించి పెట్టుకొన్నవన్నీ వేసి కారం, ధనియాలపొడి, మిరియాలపొడి, పంచదార, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. అంతే పొటాటో మిక్స్చర్ రేడీ.



పొటాటో కట్ లెట్








మన ఇళ్లలో చాలా మంది బంగాళదుంప ‘ఆరోగ్యానికి' మంచిది కాదని చెబుతుంటారు, కాని స్వచ్ఛమైన బంగాళదుంపలు అత్యధిక కార్బొహైడ్రేట్లను కలిగి ఆరోగ్యానికి మంచి చేకూరుస్తాయి. రకరకాల వంటకాలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. కూరగాను, చిప్స్ గాను, వేపుడు కూరగాను, ఇతర కూరలలోను, చికెన్‌, మటన్‌ వాటితో కలిపి గాని వాడితే మంచి రుచిగా ఉంటయి. ఇవి రుచింకే కాదు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజలవణాలు ఉన్నాయి. . . ఉదా : విటమిన్‌ సి , పొటాషియం , ఐరన్‌ , బి-కాంప్లెక్ష్ మున్నగునవి.

కావలసిన పదార్థాలు:

పొటాటో(బంగాళదుంప): 4
బ్రెడ్ స్లైస్: 6(చివరలు కట్ చేసి పొడిపొడిగా చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4-6(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తమీర-పుదీనా తరుగు: 2tbsp
గరం మసాలా: 1/2tsp
ధనియా పౌడర్: 1tsp
బియ్యం పిండి: 3tsp
ఆమ్ చూర్ పౌర్(ఎండిన మామిడి పొడి): 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం:

1. ముందుగా బంగాళదుంపలను కావలసిన సైజులో కట్ చేసుకొని కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి.


2. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ను క్రిందికి దింపుకొని బంగాళదుంపల్లోని నీరు వంపేస్ అవసరం అయితే చల్లటి నీటిని పోసి, బంగాళా దుంపలు చల్లారిన తర్వాత బంగాళదుంపలకు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బంగాళాదుంపను చిదిమి బౌల్ లో వేసి అందులో మిగిలి పదార్థాలను కూడా చేర్చి, అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి.

4. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసుకొని, తర్వాత అరచేతిలో పెట్టి గుండ్రంగా వడ సైజులో వత్తుకోవాలి.

5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక బంగాళదుంప కట్ లెట్స్ ను అందులో కాగే నూనె వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ రెండు వైపులా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి.

6. అంతే పొటాటో కట్ లెట్ రెడీ. హాట్ హాట్ కట్ లెట్ సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే ఈవెనింగ్ హంగర్ గాన్....



పన్నీర్ పకోడ....!?








కావలసిన పదార్థాలు:-
పన్నీర్: 250grms
బంగాళదుంప: 1
బ్రెడ్ స్లైసులు: 2
పచ్చిమిర్చి: 6-8
కొత్తిమీర తరుగు: 1/2cup
కారం: 1tsp
పసుపు: చిటికెడు
ఉల్లిపాయలు: 1
ఉప్పు: రుచికి తగినంత
శనగపిండి: 100grms
వాము: చిటికెడు
జీలకర్రపొడి: చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
నూనె: వేయించడానికి తగినంత


తయారు చేయు విధానం:-
1. ముందుగా పనీర్‌ ను సన్నని స్లైసులుగా కట్ చేసుకోవాలి.

2. తర్వాత బ్రెడ్ సైడ్స్ తీసేసి, త్రికోణాకారంలో కట్ చేయాలి.


3. ఇప్పుడు శనగపిండిలో వాము, ఉప్పు, నీరు వేసి జారుగా కలపాలి.


4. బంగాళదుంపను ఉడికించి, గరిటతో చిదమాలి. పచ్చిమిర్చి, కారం, పసుపు, జీలకర్రపొడి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.


5. తర్వాత పాన్ లో నూనె పోసి, వేడయ్యాక బ్రెడ్ స్లైస్‌ కు పనీర్ స్లైసులను రెండువైపులా పెట్టి, అదమాలి.


6. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా చేత్తో తీసుకొని, పనీర్ మీదుగా ఉంచి, శనగపిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే పన్నీర్ పకోడ రెడీ. పుదీనా చట్నీతో లేదా టొమాటో సాస్‌ తో సర్వ్ చేస్తే చాలా చురిగా ఉంటుంది.



Sunday, May 6, 2012

రవ్వ దోసె....!?







కావలసిన పదార్థాలు:
బియ్యం పిండి: 1cup
మైదా: 1cup
సూజి(రవ్వ): 1cup
శెనగపిండి: 1/4(అవసరమనుకొంటేనే)
పచ్చిమిర్చి: 4-6
కరివేపాకు: రెండు రెమ్మలు
క్యారెట్ తురుము: 1tbsp
జీలకర్ర: 1/2tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: సరిపడా 

తయారు చేయు విధానం:

1. ముందుగా పచ్చిమిర్చిని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకును కూడా కట్ చేసి పెట్టుకోవాలి.

2. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, మైదా, సూజి(సన్న రవ్వ), శెనగపిండి, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కరివేపాకు తురుము, జీలకర్ర పొడి, ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి(అప్రాక్సిమేట్ గా ఒక ఆరు కప్పులు)దోసె పిండిలా జారుడుగా కలుపుకోవాలి. 

3. ఇప్పుడు పది పదిహేను నిమిషాల తర్వాత స్టౌ వెలిగించి, దోసె పాన్ పెట్టి వేడయ్యాక దోసె పోసుకొని పాన్ పూర్తిగా దోసెను రౌండ్ గా దిద్దుకొని పైన కొద్దిగా నూనె చల్లుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ తక్కువ మంట మీద కాల్చుకోవాలి.

4. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని మీకు ఇష్టమైన చట్నీ మరియు సాంబార్ తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.


Saturday, May 5, 2012

కొబ్బరి చట్నీ - మసాలా గారెలు.....!?









కావాల్సిన పదార్థాలు: -
ఉద్దిపప్పు: 1cup
మిరియాలు: 1tsp
పచ్చిమిర్చి: 3-6
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా


తయారు చేయు విధానం:-


1. ముందుగా ఉద్దిపప్పును నీళ్ళలో వేసి రెండు నుండి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి.


2. ఉద్దిపప్పు నానని తర్వాత మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్ళు చేర్చి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.


3. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం కూడా మిక్సీలో వేసి గరుకుగా (తొక్కులా)గ్రైడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు ఆకులను నీటిలో శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.


4. తర్వాత ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకొన్న ఉద్దిపప్పు ముద్ద, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు తరుగు వేసి రుచికి సరిపడా ఉప్పు చేర్చి బాగా కలుపుకోవాలి.(మిరియాలను కొద్దిగా వేయించుకొని వేసుకోవాలి)


5. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. ఇప్పుడు ఉద్దిపప్పు మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోనికి తీసుకొని ఉండగా చేసి ఎడమ చేయి అరచేతిలో పెట్టి వడలాగా తట్టుకొని మద్యలో రంధ్రం చేసుకొని వేడినూనెలోని మెళ్లిగా వదలాలి.


6. గారెలను రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకొని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే మసాలా గారెలు రెడీ. వీటిని అలాగే వేడి వేడిగా సర్వ్ చేయాలి. లేది కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవాలి.



Friday, May 4, 2012

వెజిటేబుల్ మ్యాగీ మసాలా......!?








పిల్లలు మరియు పెద్దలు అతి ఇష్టంగా తినే ఫేవర్ డిష్ మ్యాగీ. ఇది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను లేదా సాయంత్రపు స్నాక్ గాను తింటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, స్కూల్ కు వెళ్ళే పిల్ల, టీనేజర్స్ ఎక్కువగా మ్యాగిని ఎక్కువగా ఇష్టపడుతారు. మ్యాగిని ముఖ్యంగా ఒంటరిగా జీవించే వారు ఎక్కువగా చేసుకొంటుంటారు. ఎందకంటే అతి సులభంగా త్వరగా తయారయ్యేది బ్రేక్ ఫ్యాస్ట్, లచ్, డిన్నర్, స్నాక్ గా రుచికరంగా ఉండేది మ్యాగీయే కదా...మరి కొంచెం వెరైటీగా వెజిటేబుల్ మిక్స్ చేసి మీరు కూడా తయారు చేసి చూడండి...

కావలసిన పదార్థాలు:-

మ్యాగీ: 2packets(200grms)
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
క్యాప్సికమ్: 1(కట్ చేసినవి)
క్యారెట్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
టమోటో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పన్నీర్: 3-4(చిన్న ముక్కలు)
పచ్చిమిర్చి: 4-5(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
అల్లం: చిన్న ముక్క(తురుముకోవాలి)
జీలకర్ర: 1/2tsp
ఓరిగానో: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tsp
నీళ్ళు: 2cups


తయారు చేయు విధానం:-

1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడయ్యాక, అందులో జీలకర్ర వేసి వేయించాలి.


2. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, వెల్లులిపాయలు వేసి రెండు నిముషాల పాటు వేగనివ్వాలి.


3. ఇప్పుడు అందులోనే క్యాప్సికమ్ మరయు క్యారెట్ ముక్కలు వేసి ఐదు నిముషాల పాటు మీడియం మంట మీద వేయించుకోవాలి.


4. తర్వాత అందులోనే పన్నీర్ ముక్కలు, పచ్చిమిర్చి మరియు టమోటో వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఓరిగానో వేసి ఉడికించాలి. సరిపడానీళ్ళు పోసి మరగనివ్వాలి.


5. అంతలోపు ప్యాకెట్ లోని మ్యాగీని తీసి పొడి పొడిగా లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దాన్ని మీద మ్యాగీ మసాలా(మ్యాగీప్యాకెట్ తో పాటు ఇచ్చిఉంటారు)ను చిలకరించాలి.


6. ఇప్పుడు ఈ మ్యాగీని వెజిటేబుల్ ఉడుకుతున్న పాన్ లో వేసి మీడియం మంట మీద రెండు నిముషాల పాటు ఉడికించాలి. నీరుంత చిక్కబడి మ్యాగీ రెడీ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే వెజిటేబుల్ మ్యాగీ మసాలా రెడీ...దీన్ని టమోటో కెచప్ తో వేడి వేడి గా సర్వ్ చేయాలి..



వెజిటేబుల్ ఛాట్......!?









 వెజిటేబుల్ ఛాట్ చాలా రుచికరమైన ఆహార పదార్ధం. దీనిని తయారు చేయడం కూడా తేలిక. శెనగపపిండి, మామిడికాయ తురుము పచ్చిమిర్చితో చేసే వెరైటీ ఈవినింగ్ స్నాక్, బెజిటేబుల్ ఛాట్. సాయంత్రం వేళ ఒక కప్పు కాఫీతో ఈ వెజిటేబుల్ ఛాట్ భలే రుచిగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు:-
బంగాళాదుంపలు: 2(ఉడికించి పై పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి)
కీరా: 1(ముక్కలుగా చేసుకోవాలి)
ఛాట్ మసాలా: 1tsp
పెరుగు: 1cup
స్వీట్ చట్నీ: 4-5
దానిమ్మ గింజలు: 1cup
మొక్కజొన్న గింజలు: 1cup
పకోడాకి కావలసిన కొన్ని వస్తువులు:
శనగపప్పు: 150grms
మామిడికాయ తురుము: 1/2cup
పచ్చిమిర్చి: 3(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నూనె: వేయించడానికి సరిపడ
ఉప్పు: రుచికి తగినంత


తయారు చేయు విధానం:-
1. ముందుగా శనగపప్పును రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత నానినబెట్టుకొన్ని శెనగపప్పును నీళ్లు పోయకుండా మెత్తగా రుబ్బుకోవాలి.

2. తర్వాత ఈ పిండిలో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు కలిపాలి.


3. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలు గా చేసుకొని మామిడి తురుములో దొర్లించి నూనెలో వేయించుకోవాలి.


4. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో చాట్ కు సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని వేసి, అందులోనే ముందుగా వేయించి పెట్టుకొన్న పకోడీలను వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.


5. ఇప్పుడు వీటిపైన పెరుగు, ఛాట్ మసాలా చల్లాలి. సర్వ్ చేసే ముందు కావాలనుకుంటే కొద్దిగా పెరుగు, కొత్తిమీర తరుగు వేసి అందించాలి.



Thursday, May 3, 2012

వెన్నజంతికలు(మురుకులు)......!?








శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో జరుపుకోనే మహిళలకు అతి ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వత్రం. ఈ పండుగ పర్వదినానా మహాలక్ష్మికి ఇష్టమైన తీపి రుచులతో, పిండి వంటలు కూడా చేసి నైవేద్యం సమర్పిస్తారు. కాని ఎక్కువగా చేసుకునేది, అందరికి ఇష్టమైన పిండివంట ఏంటి?అంటే జంతికకే ఎక్కువ ఓట్లు పడతాయంటే అతిశయోక్తి కాదుకదా. ప్రతి తెలుగువారింట ఈ జంతికల గొట్టం ఉండి తీరాల్సిందే మరి. ఇవి తయారు చేసుకున్న తర్వాత దాదాపు పదిరోజులు నిల్వ ఉంటాయి. బియ్యంపిండితో చేస్తాం కాబట్టి ఆరోగ్యరిత్యా కూడా ఎటువంటి చెడు చేయదు. కాని దంతసిరి కాస్త బలంగా ఉండాలి. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు.

 కావలసిన వస్తువులు :-

బియ్యం: 3cups
మినప్పప్పు : 1cup
పుట్నాలపప్పు: 1/4cup
ఉప్పు: రుచికి తగినంత
వెన్న లేదా డాల్డా: 2tbsp
నువ్వులు: 1tbsp
కారంపొడి : 2tbsp(రుచికి తగినంత)
జీలకర్ర : 1/2 tsp
నూనె -వేయించడానికి


1. ముందుగా బియ్యం కడిగి , అరగంట పాటు నానబెట్టి, వడగట్టి నీడలోబట్టపై వేసి ఆరనివ్వండి. పూర్తిగా అరిన తర్వాత దోరగా, కమ్మని వాసన వచ్చేవరకు నిధానంగా వేయించుకోవాలి.

2. ఇందులో మినప్పప్పు, పుట్నాలపప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఈ పిండిలో తగినంత ఉప్పు, కారం, నువ్వులు, జీలకర్ర, వెన్నలేదా డాల్డా కరిగించి వేయాలి. (వెన్న తెల్లది వాడాలి. ఉప్పు వేసినది కాదు) మొత్తం బాగా కలపాలి. చేతితోవెన్న బాగా కలిసేట్టుగా చేయాలి.


3. తరవాత కొద్దికొద్దిగా నీరు కలుపుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. తడిగుడ్డ కప్పి ఉంచాలి. పదినిమిషాల తర్వాత పిండిని బాగా మర్దించి మృదువుగా చేయాలి.
4. ఇప్పుడు జంతికల గొట్టంలో మీకు కావలసిన, ఇష్టమున్న రంధ్రాలున్న బిళ్లను పెట్టి, పిండి నింపి ఒక తడిగుడ్డ లేదా ప్రాస్టిక్ పేపర్ మీద గుండ్రంగా జంతికలు వత్తుకోవాలి.


5. తర్వతా స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో జంతికలు మెల్లిగా వేయాలి, మీడియం మంట మీద నిదానంగా బంగారు రంగు వచ్చేవరకు రెండువైపులా వేయించుకోవాలి. దీనివల్ల లోపలివరకు కాలుతుంది. నూనెనుండి తీసి పేపర్ మీద వేయండి. కొద్దిసేపు తర్వాత చల్లారాక డబ్బాలోవేసి దాచుకోండి.


6. అంతే జంతికలు రెడీ. కాస్త శ్రమపడితే రుచికరమైన, నోట్లో వేసుకోగానే కరిగిపోయే జంతికలు సిద్దమవుతాయి.