Showing posts with label happy independence day. Show all posts
Showing posts with label happy independence day. Show all posts
Thursday, August 15, 2013
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .....!
మిత్రులందరికి
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ! మన దేశాన్ని బ్రిటీషు పాలన నుండి
విముక్తి చేయుటకు ఎందరో మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారు.
వారందరిని ఎప్పటికి మనం మరచిపోకూడదు. ఈరోజు మనం స్వతంత్ర భారత దేశం లో
హాయిగా ఉన్నాము అంటే అది వారి పుణ్యమే ! మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన
స్వాతంత్ర సమరయోధులకు, శత్రు దేశాలు మన దేశాన్ని ఆక్రమించకుండా సరిహద్దులో
పోరాటం చేసి వీర మరణం పొందిన జవాన్లకు ఈ సందర్భంగా నివాళులర్పిద్దాం ! వారి
నుంచి స్పూర్తి పొందుదాం !
మన భారత దేశానికి ప్రపంచంలోనే ఎంతో
కీర్తి ఉంది. అన్నీ మతాలను, సంస్కృతులను సహనంతో అంగీకరించే పుణ్యభూమి
మనది. ఎంతో మంది దండయాత్రలు చేసి మన సంపదను దోచుకుని, సంస్కృతిని నాశనం
చేయాలని చూసినా మన భారత దేశంలో ఇంకా సంస్కృతి/ సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని
కాపాడే బాధ్యత మనదే ! వేద భూమి, పుణ్య భూమి, కర్మ భూమి అయిన భారత దేశంలో
పుట్టినందుకు గర్విద్దాం ! భారత దేశ కీర్తిని నలుమూలల చాటుదాం !
జై హింద్ ! భారత్ మాతా కి జై ! వందే మాతరం !
Labels:
happy independence day


