Showing posts with label Navagrahas. Show all posts
Showing posts with label Navagrahas. Show all posts
Saturday, October 19, 2013
Tuesday, April 2, 2013
నవగ్రహాలు ఇలా కూడా ఉంటాయి....!!?
నవగ్రహాలు ఇలా కూడా ఉంటాయి అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? నిత్యం మనం వెళ్లే దేవాలయాల్లో నవగ్రహాలు వివిధ దిశలను చూస్తున్నట్టుగా చదరపు ఆకారంలో ఉంటాయి కదా. అయితే కొన్ని దేవాలయాల్లో మాత్రం ఆశ్చర్యపడే రీతిలో నవగ్రహాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం!
తమిళనాడులోని తిరువారూరులో ఉన్న త్యాగరాజర్ ఆలయం, మధురై సమీపంలో ఉన్న కారియాపట్టి వైదీశ్వరన్ ఆలయాల్లో ఒకే వరుసలో నవగ్రహాలు కనిపిస్తాయి. అంటే ఒక గ్రహం తర్వాత ఇంకోటి అన్నట్టుగా వరుసలో ఉంటాయి. వీటి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
అంతేకాదు, నవగ్రహాలు ఒకే దిశ వైపు ముఖం ఉండే భంగిమలు తమిళనాడులో ఉన్న గున్రకుడి శణ్ముగ నాదర్ ఆలయంలో కనిపిస్తాయి. ఈ ఆలయంలో నవగ్రహాలు ఒకే వైపు ఉండడం చూపరులను ఆశ్చర్యపరుస్తాయి.
తమిళనాడులోని తిరుక్కరుకావూర్‌లోని కర్పరచ్చకాంబికై ఆలయంలో నవగ్రహాలన్నీ ఒకే దిశవైపు తిరిగి ఉంటాయట. అంటే మధ్యలో ఉండే సూర్య గ్రహానికి అభిముఖంగా మిగిలిన గ్రహాలు చుట్టూ ఉంటాయి. విష్ణు మూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు ఇవి మనకు తెలిసిన విషయాలే.
అయితే ఇంకో విషయం ఏమిటంటే నవగ్రహాలకు మంత్రాలు పఠించడం, ధ్యానం చేయడం అంటే చాలా ఇష్టమట. మరి ఆలస్యమెందుకు ఈ ఆలయాలను సందర్శించి నవగ్రహాలను ధ్యానించి లాభం పొందండి.
Labels:
Navagrahas
Saturday, March 23, 2013
నగ్రహ ప్రదక్షిణతో దోష నివారణ ....!?
మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహలస్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది. గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. వాటిని బట్టే మానసిక పరిస్థితి, ఆరోగ్యం ఆధారపడి వున్నాయి.
నగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. చాలామందికి ఈ పద్దతులు గురించి అవగాహన వుండదు. అవి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
నవగ్రహ ప్రదక్షిణ సమయంలో తీసుకోవలసిన మెలకువలు
సాధారణంగా నవగ్రహాలలో సూర్యుడి విగ్రహం మధ్యలో తూర్పు దిక్కున వుంటుంది. ఆలయంలోకి ప్రవేశించే వారు సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్లి ఎడమ వైపు నుండి (అంటే చంద్రుడి వైపు నుండి) కుడి వైపునకు 9 ప్రదక్షిణలు చేయాలి.
ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.
చాలా మంది ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలను ముట్టుకుని మరీ నమస్కారాలు చేస్తుంటారు. కానీ అది తప్పు. విగ్రహాలను తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. దీక్ష తీసుకున్నవారుగానీ, ముఖ్యమైన పూజలు నిర్వహించేవారు గానీ అభ్యంగన స్నానం చేసి మడి దుస్తులు ధరిస్తే అప్పుడు విగ్రహాలు తాకవచ్చు.
ప్రార్థనలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం.
Labels:
Navagrahas
Saturday, December 1, 2012
కుజదోష నివారణకు ఏం చేయాలంటే....!?
కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాళి రోజు 9సార్లు 12 రోజులు పారాయణ చేసి వల్లీ, దేవసేనా అష్టోత్తర శతనామాలు ఒకసారి చదవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యమాలా మంత్రము రోజుకొకసారి 40 రోజులు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
అదీ కుదరకపోతే సుబ్రహ్మణ్య కవమ్ రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం 27 రోజులు పారాయణ చేయగలరు. అలాగే సుబ్రహ్మణ్య కరవలాంబ స్తోత్రం రోజుకు 80 సార్లు చొప్పు న 11 రోజులు పారాయణ చేయడం ఉత్తమం.
ఇకపోతే.. ఏడు మంగళవారములు ఉదయం ఆరు గంటల నుంచి ఏడుగంటల లోపున శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించడం కుజదోషాన్ని నివారించవచ్చు. ఏడు మంగళవారములు కుమార స్వామికి గానీ, నాగేంద్రస్వామి పుట్టకుగాని 70 ప్రదక్షిణలు చేయగలరు.
అలాగాకుంటే ఆదివారం ఖచ్చితముగా రాహుకాలములో సాయంత్రం 4-30 నుంచి ఆరు గంటలోపుగా నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేసి సుబ్రహ్మణ్యష్టకం పారాయణం చేయండి. నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు పుట్టమన్ను చెవికి కచ్చితముగా పెట్టుకోవాలి. పాలుపోయాలి. కొబ్బరికాయ కొట్టి రావాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అలాగే శనివారం ఉదయం 9-30 నుంచి 11 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 4-30 నుంచి ఆరు గంటల వరకు, సోమవారం ఉదయం 7-30 నుంచి 9-00 గంటల వరకు.. రాహుకాలములో అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన ఎర్రటి వత్తులతో చేసినట్లైతే చాలా మంచిది. ఇంకా కృష్ణాజిల్లాలోని మోపిదేవి క్షేత్రమును దర్శించి 70 ప్రదక్షిణములు చేసి వెండి సర్ప పడగను హుండీలో వేసి అభిషేకం చేయించుకొనవలెను.
Labels:
Navagrahas
Thursday, November 29, 2012
మహా శివభక్తుడైన "శని" అంటే ఎందుకంత భయం..!?
శనీశ్వరుడు మహాశివభక్తుడు. పరమేశ్వరుని వలె శనీశ్వరుడు కూడా భక్తుల కోరికలును తీర్చేవారేనని పండితులు అంటున్నారు. శని గ్రహం అంటే అందరికీ భయం. క్రూరుడనీ, కనికరం లేనివాడని, మనుషుల్ని ప్టుకుని పీడించే వారని అందరూ అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
జనానాం కర్మఫలోం గ్రహరూప జనార్దనః - అనే దానిని బట్టి వారి వారి కర్మానుసారం, ప్రజలకు వారికి తగ్గ ఫలాన్నిచ్చే వారు జనార్దనుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలితాలను ప్రజలకు అనుగ్రహిస్తుంటాడు. ఎవరు ఎలాంటి కర్మలు చేశారు వారికి లభించవలసిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్దనుడు ప్రధానమైన ఏడు గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పరచాడట.
ఆ కోర్టుకు అధ్యక్షుడే శనిదేవుడు. ఆ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శనిదేవుడిదేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే తమకేం చెడు జరిగినా ప్రజలు ముందు శనిని తిట్టుకుంటారు. కానీ శనీశ్వరుడి న్యాయస్థానంలో అందరూ ఒక్కటే. మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామరక్ష. ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు, పన్నెండో ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలిన నాటి శని ఆరంభమైనట్టే.
శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడుసార్లు, మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది. దానాలు, ధర్మాలు, సత్కాలక్షేపాలు, సత్కార్యాలు చేస్తే శని ఆ వ్యక్తికి మేలే చేస్తుంది. అన్ని గ్రహాలకు అధిపతి అయిన శనీశ్వరుని అనుగ్రహమే అందరికీ రక్ష అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Labels:
Navagrahas
Wednesday, November 14, 2012
బుధ, శుక్ర గ్రహాలకు ఆవు నేతితో అభిషేకం చేయిస్తే..!?
జ్యోతిష్యశాస్త్రానికి బుధుడు కారకుడు. అలాగే గణితానికి, విద్య తెలివితేటలు, పవిత్రత, విజ్ఞానము, జ్ఞాపకశక్తి వంటివి బుధుని కారకత్వములు. ఇక పేరు ప్రఖ్యాతలకు శుక్రుడు కారకుడు. గురువుతో కలిసి బుధుడు జ్యోతిష్యానికి ప్రధాన కారకుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి బుధ, శుక్ర గ్రహాలను పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
పరిశుభ్రమైన నీరు, కుంకుమపువ్వు, పచ్చకర్పూరం కలిపి దానితో బుధ, శుక్రగ్రహాలకు అభిషేకం చేయిస్తే శుభఫలితాలుంటాయి. ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, చెరకురసం, కొబ్బరిబొండా నీరు, చందనం వంటి వాటిని అభిషేకానికి వాడవచ్చు. ఇంకా విగ్రహం చుట్టూ వెలితి లేనంతగా పువ్వులతో అర్చన చెయ్యడం ఉత్తమం.
అలాగే శుక్ర, మంగళవారాల్లో గృహంలో శివపార్వతులు కలిసి వున్న ఫోటోను గానీ, ప్రతిమను గానీ ఉంచి పూజలు చేయాలి. ధూపాన్ని పాదాలకు, దీపం ముఖానికి చూపాలి. అన్నం, పళ్లు, కొబ్బరికాయ, పువ్వులు నీటిని నివేదనం చేసి తాంబులం, కర్పూర నీరాజనం చెయ్యాలి. ఆ తర్వాత శివపార్వతీలకు సంబంధించిన కీర్తనలు, స్తోత్రాలు గానం చెయ్యాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Labels:
Navagrahas
Tuesday, November 13, 2012
శనిగ్రహదోష నివారణకు నీలరత్నం ధరించండి ....!
శనిగ్రహదోష నివారణకు నీలరత్నం ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. జాతినీలం రత్నాన్ని పాలల్లో వేస్తే పాలవర్ణం కొద్దిగా నీలిరంగుగా మారుతుంది. శనిగ్రహ ప్రభావంచే శత్రువుల వల్ల, స్నేహితుల వల్ల మోసపోకుండా ఉండేందుకు నీలాన్ని ధరించాలి. నీలిరత్నంతో పాటు సప్తముఖి, షోడశముఖ రుద్రాక్షలను ధరిస్తే కూడా శనిగ్రహ దోష నివారణ జరుగుతుందని పురోహితులు చెబుతున్నారు.
శనిగ్రహ ప్రభావంచే దొంగలవల్ల భయాలు, దొంగతనాలు అట్టకట్టడం, వివాహంలో అపశృతులు, ఆటంకాలు, లోపాలు వంటివి కలుగుతాయి. ఈ శనిగ్రహ ప్రభావం నుంచి బయటపడటానికి నీలిరత్నాన్ని ధరించడం శ్రేయస్కరం.
ఇంకా శనిగ్రహ దోషం నుంచి తప్పుకోవాలంటే పెరుగు, పాలతో తిలకం చేసుకుని ధరించండి. నూతిలో పాలు పోయించడం, కాకులకు అన్నం పెట్టడం వంటి చేయాలి. దేవాలయంలో కర్పూరం దానం చేయండని పురోహితులు సూచిస్తున్నారు.
Labels:
Navagrahas
Friday, October 12, 2012
రాహువుకు ఏ భగవదారాధన మంచిదో తెలుసా..?!
నవగ్రహాల్లో రాహుగ్రహానికి దుర్గాపూజ, సరస్వతీ పూజ, కుమారీ పూజ, దుర్గాస్తోత్ర పారాయణ, దేవి భాగవత పురాణ పారాయణ చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మేధస్సు, శిరోపరిభాగం, గడ్డం అనే శరీర భాగాలకు రాహువు ప్రాతినిధ్యం వహిస్తాడు.
రాహువు పరిహార క్రియల విషయానికొస్తే.. శక్తిగలవారు దున్నపోతును దానం చేయవచ్చును. స్కందపురాణ, సుబ్రహ్మణ్య చరిత్రను మండల దీక్షతో పారాయణ చెయ్యాలి. నవగ్రహాల్లో రాహు గ్రహం వద్ద 18 వత్తుల దీపారాధన-గోధుమ రంగు వస్త్రదానం చేయడం మంచిది.
దుర్గాదేవి, సుబ్రహ్మణ్య ఆలయాల్లో మంగళవారం లేదా శనివారం నాడు పేదలకు అన్నదానం లేదా ప్రసాదాన్ని పంచిపెట్టడం మంచిది. రావిచెట్టుకు ప్రదక్షిణలు, రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కావున దుర్గాక్షేత్ర సందర్శన, సర్వక్షేత్రాలు (మోపిదేవి, తిరుత్తణి మొదలగునవి) సందర్శించడం మంచిది.
శ్రీకాళహస్తి, పెద కాకాని దేవాలయాల్లో 9సార్లు రాహుదోష నివారణ పూజ చేయించాలి. ఆదివారం రోజున మినపగారెలు లేదా మినుములతో చేసిన పదార్థాలను సాధువులకు పంచడం మంచిది. నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో నాగ ప్రతిష్టలు చేయించడం మంచిది. రాహువునకు 18వేల జపం చేయించి, ఐదు కిలోల 250 గ్రాముల మినుములు దానం చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, ఆర్థికవృద్ధి, వ్యాపారాభివృద్ధి. విద్యాభివృద్ధి వంటి శుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇంకా గ్రహణం రోజున కాని, అమావాస్య ఆదివారం రోజున కాని, శక్తిని బట్టి బంగారం లేదా వెండి సర్ప ప్రతిమను పడగ ఉండే విధంగా చేయించి దానం చెయ్యాలి. 18 శనివారాలు ఉపవాసం ఉంటూ, చివరి శనివారం రాహువుకు అష్టోత్తర పూజ, దుర్గాదేవికి కుంకుమ పూజ జరిపించాలి. దర్భలతో, ఆవునెయ్యి, తేనె హోమం చేయించడం శుభఫలితాలనిస్తుంది. మినపగారెలు, మినుములతో చేసిన పదార్థాలతో సద్భ్రాహ్మణోత్తమునికి ఆదివారం రోజు సంతృప్తికరంగా భోజనం పెట్టాలి.
ఇకపోతే.. సంఖ్యాశాస్త్ర ప్రకారం 04 సంఖ్య వారు రాహు సంఖ్య అవుతారు. 04 అంటే ఏ నెల, ఏ వారం, ఏ సంవత్సరంలో అయినా 4,13,22 సంఖ్యల వారు పై నివారణోపాయాలను పాటిస్తే సత్ఫలితములు పొందుతారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
Labels:
Navagrahas
బెల్లం కలిపిన నల్ల నువ్వులు కాకులకు ఆహారంగా పెడితే..!?
శనిగ్రహ దోష నివారణకు తమిళనాడులోని తిరునల్లార్ దేవస్థానాన్ని దర్శించుకుని శనిహోమం జరిపించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తిరునల్లార్ మాత్రమే గాకుండా మందపల్లి, సింగనాపూర్, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని శనైశ్వర ఆలయంలో శని త్రయోదశి నాడు అభిషేకం జరిపించడం శుభఫలితాలనిస్తుంది.
ప్రతిరోజూ మధ్యాహ్నం బెల్లం కలిపిన నల్లనువ్వులు కాకులకు ఆహారంగా పెట్టడం ద్వారా శనిగ్రహ ప్రభావంచే కలిగే ఈతిబాధలు, ఆర్థిక పతనం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగావకాశాలు చేజారిపోవడం వంటి దుష్ఫలితాల నుంచి తప్పుకోవచ్చు.
అలాగే శనిగ్రహ దోష నివారణకు హనుమంతుడిని ప్రతి శనివారం దర్శించుకుని నేతితో దీపమెలిగించడం మంచిది. ఇంకా శనివారం రోజున నువ్వుండలు కానీ, లేదా నువ్వులతో చేసిన ఏదైనా పిండివంటలను సాధువులకు దానం చేయండి.
పుష్యమి నక్షత్రం రోజున నల్లనువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి, రెండు కిలోల బియ్యం కూడా వేరే వస్త్రంలో మూటగా చుట్టి బ్రాహ్మణునికి దానం చేయండి. ఇలా చెస్తే శనిగ్రహ దోషాలచే కలిగే దుష్ఫలితాలు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా నీలిరంగు పువ్వులు, నల్లని వస్త్రాలు, నూనె దానం, స్టీల్ పాత్రలు దానం చేయాలి
"ఓం హ్రాం హనుమతే నమ:
ఓం నమో రామచంద్రాయ నమ:"
అనే మంత్రాలను ప్రతినిత్యం పఠించినట్లైతే శనిగ్రహ నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Labels:
Navagrahas
నాగపూజ, నాగశాంతి ఏ శుభ తిథుల్లో చేయాలంటే..!?
"అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః
భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్
సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్"
నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.
నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు.
అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు.
Labels:
Navagrahas
ఏలినాటి శని పీడిస్తోందా..? ఐతే ఇలా చేయండి..!
ఏలినాటి శని ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోవాలంటే ప్రతిరోజూ అన్నం తినేముందు కొంత భాగం కాకులకు వేయండి. ఇనుము, పెనం, సారాయి, నూనె దానం చెయ్యండి. రొట్టెముక్కల మీద నువ్వులనూనె వేసి, వీధి కుక్కలకు రాత్రిపూట ఆహారంగా పెడుతుంటే శనిగ్రహ దోషాలకు నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఏ లగ్నంవారికైనా, శనిగ్రహస్థితి బాగాలేకపోతే ప్రతినిత్యం మూడుసార్లు అంటే ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో కాలభైరవ స్తోత్రం పఠించాలి. పూర్తిగా నల్లని రంగు గల గుర్రం కాలికి కట్టిన నాడా తీసికొచ్చి, నువ్వులనూనెతో అభిషేకం చేసి శనిస్తోత్ర పఠనం చేసి, ఇంటి గుమ్మానికి కాని, తలుపుకుకానీ కొట్టడం శనిగ్రహ ప్రభావాన్ని తప్పిస్తుంది.
నల్ల నువ్వులు 8 సంఖ్య కొలత గల ఇనుము లేదా స్టీలు అరిటాకులో పోసి దక్షిణ తాంబూలాలు పెట్టి శనిగ్రహాన్ని విధివిధానంగా పూజించి, మధ్యాహ్నం ఒక గంటా, ఒక గంటా 3 నిమిషాల మధ్య నడివయస్సు బ్రాహ్మణుని ఆహ్వానించి పాద ప్రక్షాళ చేసి నమస్కరించి, పశ్చిమదిక్కుకు తిరిగి దానం చేయండి.
అలాగే నువ్వుండలు పిల్లలకు పంచడం, ఆవాలు కలిపిన గేదె పెరుగన్నం పెట్టడం కూడా శనిగ్రహ దోష నివారణలో ఒకటి. కాగా, శనిగ్రహానికి అధిష్టాన దైవం శ్రీ వేంకటేశ్వరుడు. శనివార నియమం పాటిస్తూ.. ప్రతిదినం ఆ స్వామిపూజ అభిషేకం చేయడం వల్ల శనిగ్రహదోశ నివారణ జరుగును.
ఇకపోతే.. ఇనుము లేదా స్టీల్ బిందెతో శుద్ధ జలాన్ని నింపి, అందులో నల్లనువ్వులు, మినుములు, నల్ల ఉమ్మెత్త వేర్లు, దర్భలు జమ్మి ఆకులు వేసి ఉంచాలి. ధనురాకారపు ముగ్గువేసి దానిపై దర్భలు పరచి ఈ బిందెలుంచాలి.
ఓం ఐం హ్రీం శ్రీ శనైశ్చరాయ నమః
ఓం భ్రాం భ్రీం భ్రౌం సః శనయే నమః
అనే శనిగ్రహస్తోత్ర మంత్రాన్ని పఠించి, ఈ బిందెలోని నీళ్ళతో శిరఃస్నానం చేయాలి. ప్రతి శనివారం ఇలా చేస్తే శనిగ్రహదోష నివారణ జరుగుతుంది. అలాగే శనిబాధా నివారణకు దగ్గర్లో గల ఆంజనేయుని దేవాలయాల్లో ప్రదక్షిణలు హనుమాన్ చాలీసా పఠనం, విఘ్నేశ్వరుని శరణువేడినా శనిబాధ పటాపంచలు కావడం తథ్యం.
ప్రతి శనివారం గరికెతో గణపతిని పూజించడం కూడా మంచిది. ఇంకా ప్రతి శనివారం సాయంసంధ్య వేళలో రాగి ప్రమిదలో ఆవునెయ్యి, ఆముదం, నువ్వుల నూనెల మిశ్రమంతో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి నమస్కరించినా శనిగ్రహ దోషాల నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Labels:
Navagrahas
Thursday, October 11, 2012
రాహుకేతు, సర్పదోషాలున్న జాతకులు ఏం చేయాలంటే!?
రాహు, కుజ, సర్పదోషాలున్నాయని జ్యోతిష్యులు చెప్పారా? అయితే నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి, నాగారాధన చేసేవారికి సర్పదోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
నాగరాజుకు పుట్టలో ఆవుపాలుతో పాటు కోడిగుడ్డు, చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, కర్పూర పువ్వులు, లడ్డూలు మున్నగునవి నివేదన చేయాలి. ఇలా చేస్తే సర్పదోషాలు తొలగిపోయి, శుభఫలితాలుంటాయని పురోహితులు అంటున్నారు.
నాగపూజ ఎలా చేయాలంటే..?
ఆ రోజు ఉదయం ఐదింటికే లేచి, శుచిగా స్నానమాచరించి, ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమను గానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి.
పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి.
పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో "ఓం నాగేంద్రస్వామినే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి.
ఇకపోతే.. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.
Labels:
Navagrahas
Wednesday, October 10, 2012
బుధ గ్రహ దోష నివారణకు విష్ణుపూజ చేయండి..!
బుధ గ్రహ దోష నివారణకు మహా విష్ణు పూజ చేయాలి. బుధ మంత్రంతో జపం చేసి మంచి పచ్చ (మరకతం)ను బుధవారం రోజు ధరిస్తే దోషాలు హరింపబడుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
బుధ గ్రహ దోష నివారణకు పచ్చని మైదానంలో, ఆకు పచ్చి వాతావరణంలో కొంతకాలం గడపటం మంచిది. విద్యాలయ పరిసరాల్లో ఉండటం, పండిత ప్రసంగ శ్రవణం, మేధావుల స్నేహం ఉపయుక్తమైన ప్రక్రియలు చేయడం ద్వారా బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
బుధ గ్రహ ప్రభావంతో నరాలు, చర్మం, స్వరపేటిక సంబంధిత వ్యాధులు, నాసిక సంబంధ వ్యాధులు, పక్షవాతం, పిచ్చితనం, నోటి వ్యాధులు సామాన్యంగా బుధుడు కల్పించే వ్యాధులు. అంతేగాకుండా వ్యాపారంలో చిక్కులు, మోసపోవడం, మతిపరుపు, ఆదాయ వ్యయాలు గణిత సంబంధమైన పొరపాట్లు బుధ గ్రహ దోషం వలన కలిగే ఇబ్బందులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
కాబట్టి బుధ గ్రహ దోష నివారణకు బుధవారం రోజు పచ్చ పెసలు బ్రాహ్మణునికి దానం చేయాలి. బుధవారాల్లో పచ్చ పెసలు నానపెట్టి ఆవుకు పెడితే దోష నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Labels:
Navagrahas
Tuesday, October 9, 2012
నవగ్రహాల్లో శనిభగవానుడిని మీరెలా నమస్కరిస్తున్నారు?
నవగ్రహాల్లో శని భగవానుడికి మీరెలా నమస్కరిస్తున్నారు. శని భగవానుడికి ప్రత్యక్షంగా నిలబడి నమస్కరిస్తున్నారా? అయితే అది మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ఏదైనా ఆలయంలో గల నవగ్రహాలను 9సార్లు ప్రదక్షిణ చేసి, అనంతరం శనిగ్రహానికి నేరుగా నిలబడి తలవంచి నమస్కరించడం కూడదు. శనిగ్రహం మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు నమస్కరిస్తే.. శనిగ్రహ ప్రభావంచే దుష్పలితాలు తప్పవని పండితులు అంటున్నారు.
ఇంకా నవగ్రహ ప్రదక్షణ చేసేటప్పుడు ఏ గ్రహాన్ని ముట్టుకోకుండా.. చేతితో ఏ విగ్రహాన్ని తాకకుండా ప్రదక్షణ చేయడం ద్వారా నవగ్రహాలచే ఏర్పడే దుష్ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది. ముఖ్యంగా శనిగ్రహానికి నేరుగా నిలబడి నమస్కరిస్తే ఆ గ్రహ ప్రభావంచే అశుభఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే.. నవగ్రహాల్లో శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పూర్వం శ్రీలంకను పరిపాలించిన రావణాసురుడు తన బలపరాక్రమాలచే దేవతలను మరియు నవగ్రహాలను జయించాడు. ఇందులో నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసి, వాటిపై నడవటం చేశాడు. దీన్ని గమనించిన నారదమహాముని రావణాసురుడి అహంకారానికి నిర్మూలించాలని భావించాడు.
ఈ క్రమంలో "ఓ రావణాసురా.. నీవు నిజమైన బలపరాక్రమశాలి అయితే నవగ్రహాలను బోల్తాపడేసి నడిచిపోవడం గాకుండా.. వారిని సాష్టాంగ పడుకోబెట్టి మెట్లుగా ఉపయోగించుకోవచ్చు కదా..!" అన్నాడు. నారదుని మాట విన్న రావణాసురుడు నవగ్రహాలను బోల్తా పడుకోబెట్టకుండా తనవైపు చూసేలా పడుకోబెట్టి మెట్లుగా ఉపయోగించుకున్నాడు.
ఇలా రావణాసురుడు ప్రత్యక్షంగా శనిగ్రహాన్ని చూడటం ద్వారా అప్పటినుంచి ఆతనికి చెడుకాలం ఆరంభమైంది. ఇది జరిగిన తర్వాతే రామునిచే రావణాసురుడు హతుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శనిభగవానుడిని నమస్కరించే సమయాల్లో ఆయనకు ప్రత్యక్షంగా గాకుండా పక్కకు నిలబడి నమస్కరించడం చేయాలని పురోహితులు చెబుతున్నారు.
Labels:
Navagrahas
నవగ్రహాల అనుగ్రహం కోసం ఏ వ్రతాలు చేయాలంటే..?
మనం కోరుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ పూజలు, పునస్కారాలు చేయడం పరిపాటి. అనుకున్నది జరగాలని కోరుకుంటూ వివిధ రకాల యజ్ఞయాగాదులు, పూజలు చేస్తుంటాం.
ముఖ్యంగా జ్యోతిష్యుల సలహాల ప్రకారం నవగ్రహ అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తుంటాం. ఇలా నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు చేయడంతో పాటు కొన్ని వ్రతాలను ఆచరిస్తే నవగ్రహ ప్రభావంచే ఏర్పడే దుష్పలితాలకు దూరంగా ఉండవచ్చునని పురోహితులు చెబుతున్నారు. నవగ్రహాల అనుగ్రహానికి చేయవలసిన వ్రతాలను ఓ సారి పరిశీలిద్ధాం...!
సూర్యగ్రహ అనుగ్రహముకు రథసప్తమి, శ్రీరామనవమి, కేదారేశ్వర, సూర్య చంద్ర వ్రతము చేయాలి. అలాగే చంద్ర గ్రహానికి అమావాస్య సోమతి వ్రతం, కృష్ణాష్టమి వ్రతం, సోమవార వ్రతం, కుజుడు అనుగ్రహానికి నాగుల చవితి, నాగ పంచమి, అంగారక చవితి, కాత్యాయనీ వ్రతము, కుజగౌరీ వ్రతము చేయాలి.
బుధగ్రహ అనుగ్రహానికి శ్రీ అనంత పద్మనాభ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, తులసీ వ్రతము, గురు గ్రహానికి శ్రీ సత్యసాయి వ్రతము, శ్రీ సత్యదత్త వ్రతము, త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది.
అలాగే శుక్రుడు అనుగ్రహానికి వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, శ్రీలక్ష్మి కుబేర వ్రతం, సంతోషిమాత, అనఘాదేవి వ్రతాలను చేయాలి. శని గ్రహం అనుగ్రహానికి హనుమద్వ్రతము, శివరాత్రి, శనైశ్చర వ్రతాలు, రాహు గ్రహానికి శ్రీదేవి నవరాత్రి, సావిత్రీ, షోడశగౌరీ వ్రతం, కేతువు అనుగ్రహానికి వినాయక చవితి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలితం వుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Labels:
Navagrahas
మీకు నవగ్రహదోషముందా? ఐతే 9సార్లు ప్రదక్షణ చేయండి?
దేవాలయాల్లోని నవగ్రహాల చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేయడం పరిపాటి. అయితే నవగ్రహ దోషమున్నవారు మాత్రమే నవగ్రహాలను తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేసుకోవాలని, మిగిలిన వారు ఒక్కసారి ప్రదక్షణ చేసుకుంటే సరిపోతుందని పురోహితులు అంటున్నారు.
ఇంకా "ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ నవగ్రహాలను ఒక్కసారి ప్రదక్షణ చేసుకుంటే చాలునట. అయితే తొమ్మిదిసార్లు ప్రదక్షణ చేసినా మంచిదేనని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే మీ జాతకం ప్రకారం ఏ గ్రహ ప్రభావం మీపై ఉందనే విషయాన్ని తెలుసుకుని, ఆ గ్రహానికి అనుకూలమైన పూజలు చేయడం, మంత్రాలు పఠించడం శ్రేయస్కరం. నవగ్రహ ప్రభావంలో ఏ గ్రహదశ మీపై ఉందనే విషయాన్ని తెలుసుకుని, ఆ గ్రహానికి అధిపతి అయిన భగవానుడిని పూజించడం ద్వారా మంచి జరుగుతుందని విశ్వాసం.
ఇందులో శనిగ్రహాన్ని గురించి చెప్పాలంటే..? శనివారం పూట నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా ఈతిబాధలు దూరమవుతాయి. ఇదేవిధంగా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఏలినాటి శని, అష్టమ శని, శని దశాకాలంతో ఏర్పడే అశుభ ఫలితాలను శనివారం శనీశ్వరునికి చేసే పూజ ద్వారా తప్పుకుంటాయని పురోహితులు సూచిస్తున్నారు.
Labels:
Navagrahas
కాలసర్పదోషానికి పరిహారం ఎలా చేయాలంటే..?!
కాలసర్పదోష పరిహారానికి అందరూ శ్రీ కాళహస్తీశ్వరాలయంలో రాహు-కేతువుల పూజ చేయించడం పరిపాటి. అయితే ఈ సర్పదోషం ఉన్న జాతకులు కాలభైరవ మూర్తిని ప్రార్థించడం శ్రేయస్కరం.
అంతేగాకుండా తమిళనాడు రాష్ట్రం, శివగంగై జిల్లా, తిరుప్పత్తూరులోని కాలభైరవ దేవాలయంలో పూజ చేయించినట్లైతే కాలసర్పదోషం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆలయంలో భైరవమూర్తి శునకముతో గాకుండా యోగాసీనుడై భక్తులకు దర్శనమివ్వడం ద్వారా కాలసర్పదోషాన్ని తొలగిస్తాడని పురోహితులు చెబుతున్నారు.
ఇంకా కాలసర్పదోషమున్న జాతకులు కులదైవాన్ని పూజించడం, మానసిక బాధితులకు సహాయం చేయడం ద్వారా కొంత శుభ ఫలితాలను పొందవచ్చును. అలాగే ప్రతి శనివారం శివాలయంలోని భైరవమూర్తికి నేతితో తొమ్మిది వారాల పాటు దీపమెలిగిస్తే శుభఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Labels:
Navagrahas
Monday, October 8, 2012
నవగ్రహ పారాయణాలు, పుణ్యతిథులేవో తెలుసా?
నవ గ్రహాలను పారాయణాలు, పుణ్యతిథులు ఏమిటో తెలుసా..? నవగ్రహాల శాంతికి ఆ గ్రహానికి సంబంధిత పారాయణము, పుణ్యతిథుల్లో స్తుతిస్తే ఆ గ్రహ ప్రభావములచే ఏర్పడే ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా నవగ్రహాల పారాయణాలు, పుణ్యతిథులు ఏమిటో తెలుసుకుందాం..!
తొమ్మిది నవగ్రహాల్లో వరుస క్రమంలో సూర్యునికి రామాయణము, భవిష్య కల్కి పురాణము, సూర్యపురాణం
చంద్రునికి శ్రీమద్భాగవతము, భవిష్య కల్కి పురాణము, వాయుపురాణము
కుజునికి- అగ్నిపురాణము, స్కాంధపురాణము, బ్రహ్మవైవర్తన పురాణాల్లో కుమారస్వామి చరిత్ర
బుధునికి- లింగపురాణంలో నరసింహావతారము, విష్ణుపురాణము, నారదపురాణము
గురునికి- బ్రహ్మణపురాణము, వామనపురాణం, లింగపురాణం
శుక్రునికి- బ్రహ్మండపురాణం, భవిష్యపురాణమునందు శ్రీమద్భాగవతంలోని పరశురామావతారం
శనీశ్వరునికి-మార్కండేయపురాణం, కూర్మపురాణం, భవిష్యపురాణం,
రాహువు-దేవీభాగవతం, వరాహపురాణం, గరుడపురాణం,
కేతువుకు- బ్రహ్మవైవర్తన పురాణం, మత్స్యపురాణం వంటివి పఠించాలి.
పుణ్యతిథుల విషయానికొస్తే..?
సూర్యునికి- కార్తిక శుద్ద పూర్ణిమ-కార్తిక మాసంలో రవిజపము ఆరువేల సార్లు చేసి గోధుమలు దానం చేయాలి.
చంద్రునికి- శ్రావణ పూర్ణిమ - శ్రావణ మాసంలో చంద్రజపమును పదివేలసార్లు చేసి తెల్లని వస్తాలతో బియ్యాన్ని దానం చేయాలి.
కుజునికి- చైత్రశుద్ద పూర్ణిమ చైత్రమాసంలో అంగారక జపము ఏడువేల సార్లు చేసి కందులు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.
మార్గశిర శుద్ద షష్టి- మార్గశిర మాసంలో అంగారక జపమును ఏడువేల సార్లు చేసి కందులు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.
బుధునికి-జ్యేష్ఠ పూర్ణిమ-జ్యేష్ఠ మాసంలో బుధజపాన్ని 17 వేల సార్లు చేసి పెసలు ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయాలి.
గురువు-వైశాఖ తదియ- భాద్రపదమాసంలో బృహస్పతి జపాన్ని 16 వేలసార్లు చేసి శెనగలు దానం చేయాలి.
శుక్రునికి- ఆషాఢశుద్దదశమి- ఆషాఢమాసంలో శుక్రజపమును 20వేల సార్లు చేసి అలచందలు, తెల్లని వస్త్రాలు దానం చేయాలి.
ఫాల్గుణ శుద్ద పూర్ణిమ - ఫాల్గుణమాసంలో శుక్రజపమును 20వేల సార్లు చేసి తెల్లని వస్త్రాలు దానం చేయాలి.
శని భగవానునికి - శ్రావణ బహుళ అష్టమి- శ్రావణ మాసంలో శనిజపము చేసి నల్లనువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయాలి. రాహువుకు - ఆశ్వీజ బహుళ చతుర్దశి - ఆశ్వీజమాసంలో రాహుజపం 18 వేలసార్లు చేసి మినుములు కాఫీపొడి రంగుకు చెందిన వస్త్రాలను దానం చేయాలి. కేతువుకు- ఆశ్వీజశుద్ద పాడ్యమి- ఆశ్వీజమాసంలో కేతుజపాన్ని ఏడువేల సార్లు చేసి ఉలవలు నలుపు వస్త్రాలను దానం చేయాలి.
మాఘశుద్ద అష్టమి - మాఘమాసంలో ఏడువేల సార్లు కేతుజపాన్ని చేసి ఉలవలు నలుపు వస్త్రాలను దానం చేయడం ద్వారా నవగ్రహాల ప్రభావంచే కలిగే అశుభ ఫలితాలు దరిచేరవని పురోహితులు సూచిస్తున్నారు.
Labels:
Navagrahas
కుజ, పుత్ర దోషాలు అంటే ఏమిటో తెలుసా..?
ఏలినాటి శని ప్రభావం తరహాలో కుజ దోషమంటేనే అందరూ భయపడటం సహజం. కానీ కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో జ్యోతిష్య నిపుణుల సూచనలు పాటిస్తే సరిపోతుంది.
సాధారణంగా కుజ దోషమంటే కుజుని ఆధిపత్యంతో కలిగే దోషం. కుజునికి అంగారకుడు అనే మరో పేరున్న విషయం తెలిసిందే. ఈ దోషం ఉన్న జాతకులు వివాహం చేసుకునే సమయంలో, చేసుకోబోయే వారి జాతక ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. ఒకవేళ కుజదోష జాతకులిరువురు వివాహం చేసుకోదలచుకుంటే జాతకాల్లోని కుజుని దశాకాలం, ఆధిపత్యం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే విధమైన ఆధిపత్యంతో గల కుజదోష జాతకులు వివాహం చేసుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
జాతకంలో కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజ దోషం తప్పక ఉన్నట్టే. పై స్థానాల్లో కుజుని ఆధిపత్యం మాత్రమే కాకుండా సూర్య, గురు, రాహు, కేతువులతో పాటు కుజుడు ఆధిపత్యం వహించినట్లయితే.., లేదంటే ఆ గ్రహాల దృష్టి కుజునిపై పడే విధంగా ఉంటే కుజదోషానికి పరిహారాలున్నాయి.
కాగా కుజదోషం ఉన్న జాతకులు వివాహం చేసుకోవాలంటే..
1. జాతకం ప్రకారం స్త్రీ, పురుషులిద్దరికి ఒకే విధమైన పూర్ణవంతమైన దోషాన్ని కలిగి ఉండాలి. (లేక)
2. స్త్రీ , పురుషులకు ఎటువంటి పూర్ణవంతమైన దోషం ఉండకూడదు.
పై రెండు లేని పక్షంలో ఇద్దరికి కుజదోషపరిహారం చేసుకునే మార్గమైనా ఉండితీరాలి.
ఇంకా కుజుని దశ ఇద్దరికి ముగించే స్థాయిలోనైనా కుజదోషస్థులు వివాహం చేసుకోవచ్చు.
ఇక పుత్ర దోషం - పుత్ర సంతానం ఉందా లేదన్న విషయాన్ని జాతకపరంగా తెలుసుకోవాలంటే పురుషుని జాతకాన్నిబట్టి చూడటం పరిపాటి. ప్రతి జాతకునికి ఐదోస్థానం పుత్ర స్థానంగా పరిగణించబడుతుంది. పుత్రకారకునిగా బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. గురువు శుభస్థాన ఆధిపత్యం వహిస్తే జాతకులకు పుత్రప్రాప్తి తప్పకుండా లభిస్తుంది.
ఐదో స్థానంలో రాహు- కేతులుంటే పుత్రదోషం ఉంటుంది. దీనికే "నాగదోషమని" పేరు. ఈ దోషం గల జాతకులు తప్పకుండా నాగదోష పరిహారం చేయాలి. అలా చేసిన పక్షంలో నాగదోషం తొలగిపోవటంతో పాటు పుత్రప్రాప్తి లభిస్తుంది.
పరిహారాలు :
1. పుత్ర దోషం కలవారు నాగ విగ్రహ సమేతంగా గల వేపచెట్టు, మర్రి చెట్టులను 41 రోజులు ప్రదక్షిణ చేయాలి. 41 వరోజు అర్చన చేయాలి.
2. వెండితో నాగ ప్రతిమను తయారు చేసి ఒక మండలం (41రోజులు) పూజచేసి శివాలయాల్లో సమర్పించటమో లేక హుండీలలో వేయటమో చేయాలి.
3. రామేశ్వరం, శ్రీ కాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలలో నాగదోష నివారణకు పూజలు చేసి పరమేశ్వరుని ధ్యానించటం ద్వారా పుత్రప్రాప్తి లభించటంతో పాటు పుత్రదోషం తొలగిపోతుంది.
Labels:
Navagrahas
బుధగ్రహాధిపత్యంలో జన్మించిన జాతకులైతే..?
బుధగ్రహాధిపత్యంలో జన్మించిన జాతకులు ఆధ్యాత్మిక ధ్యాసను కలిగి ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా విజ్ఞానం, కావ్యరచన, జ్యోతిష్య రంగాల్లో రాణిస్తారు. శాంత స్వభావం, విష్ణుభక్తి, సుందర స్వరూపం, పెద్దల పట్ల మర్యాద, నాటకములు, రజోగుణాన్ని కలిగి ఉంటారు. బుధగ్రహ నాయకుడైన బుధుడు ఆకుపచ్చ రంగు పట్ల ప్రీతిని కలిగి ఉంటాడు.
అంతేకాకుండా బుధగ్రహాధిపత్యంలో జన్మించిన జాతకులు ఎల్లప్పుడు స్థిర నిర్ణయంలో ఉంటారు. సత్య ప్రవర్తన, వినయం వంటి గుణాలను కలిగి ఉంటారు. దీనితో పాటు పుస్తకములు రాయడం, వేదాంతం, గుమాస్తా ఉద్యోగాల్లో స్థిరపడతారు. కొందరు న్యాయవాదులుగా ఉంటారు.
ఇకపోతే.. న్యాయానికి ప్రాణాన్ని ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉండే వీరు ఇతరుల సలహాలను సూక్ష్మంగా గ్రహిస్తారు. అయితే ఇతరులు ఇచ్చే సలహాల్లో మంచి చెడులను ఆలోచించి వాటిని పాటిస్తారు. బుధగ్రహాధిపత్యములో పుట్టిన జాతకులు ఆకుపచ్చ రంగులను కలిగిన దుస్తులను ధరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Labels:
Navagrahas














